పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క ప్రధానపాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” విడుదల కరోనా కారణంగా వాయిదా పడింది. US లో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న “నిశ్శబ్ధం” మూవీ తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. బ్లాక్ బస్టర్ “భాగమతి ” మూవీ తరువాత స్టార్ హీరోయిన్ అనుష్క నటించిన ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. “నిశ్శబ్ధం” మూవీ OTT లో రిలీజ్ కానుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“నిశ్శబ్ధం” మూవీ దర్శకుడు హేమంత్ మధుకర్ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టారు. ఆయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఎక్కువ స్పాన్ , ఎక్కువ టైమ్ పట్టే సినిమాలపై ఎక్కువ ఊహాగానాలు వస్తాయని, అనుష్కకు మూవీ నచ్చలేదని, పబ్లిసిటీ కి దూరంగా ఉందనీ, OTT రిలీజ్ కు ఒప్పుకొనడంలేదని రూమర్స్ వచ్చాయని, షూటింగ్ టైమ్ లో మానిటర్ కానీ , సినిమా చూసే అలవాటు అనుష్క కు లేదని, దర్శక నిర్మాతల పై నమ్మకంతో మూవీ లో నటిస్తారని చెప్పారు. ప్లాన్డ్ గా పబ్లిసిటీ చేద్దామని అనుష్క చెప్పారని, అందుకే అనుష్క సినీకెరీర్ 15 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా వేడుక నిర్వహించామని, OTT లో అఫర్ వచ్చిన మాట నిజమేనని, తెలుగు వెర్షన్ రెడీ గా ఉందని, తమిళ, మలయాళ, హిందీ వెర్షన్స్ రెడీ చేయాలనీ హేమంత్ చెప్పారు. అంతా రెడీ అయిన తరువాత లాక్ డౌన్ తరువాత థియేటర్స్ ప్రారంభం అవుతాయా లేదా చూసుకొని ఇండస్ట్రీ పెద్దలు, దర్శకులు, నటుల నిర్ణయాన్ని బట్టి , దాని ప్రకారం వెళదామని అనుకుంటున్నాం అని హేమంత్ చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: