బాలకృష్ణ అఘోరా పాత్రలో కనిపిస్తారు..!

Nandamuri Balakrishna To Play Aghora In His Upcoming Boyapati Directorial
Nandamuri Balakrishna To Play Aghora In His Upcoming Boyapati Directorial

బోయపాటి దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ప్రస్తుతం లాక్ డౌన్ వల్ల.. షూట్ కు బ్రేక్ చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా.. రెండో షెడ్యూల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను గతంలో ఎన్నడూ చూపించని డిఫరెంట్ షేడ్స్ లో బోయపాటి చూపించబోతున్నట్టు ఇంతకుముందే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో కాశీ ఎపిసోడ్ ఉంటుందని… అక్కడ బాలకృష్ణ అఘోరా పాత్రలో నటిస్తున్నాడన్న వార్తలు కూడా వచ్చిన సంగతి విదితమే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాగా దీనిపై మాట్లాడిన బోయపాటి… బాలయ్య ఈ సినిమాలో ఓ పాత్రలో అఘోరా గా కనిపిస్తాడని, ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా అద్భుతమైన నేపథ్యంతో ఆ పాత్ర ఉంటుంది అని ఆయన చెప్పుకు రావడం జరిగింది. అంతేకాదు గతంలో బాలకృష్ణ గారితో నేను చేసిన సింహ, లెజెండ్ సూపర్ హిట్స్ గా నిలిచాయి. మా హ్యాట్రిక్ మూవీపై భారీ అంచనాలున్న నేపథ్యంలో సింహ. లెజెండ్ కి మించి ఈ చిత్రం ఉంటుందని చెప్పాడు.

ఇక ఈసినిమాలో హీరోయిన్ గా ఇంతవరకూ ఎవర్ని ఎంపిక చేయలేదు. కొత్త హీరోయిన్ నే తీసుకుంటున్నట్టు ఇంతకుముందే చెప్పాడు. ఎస్.ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా జూన్ 10వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టు సమాచారం. ఆ రోజున సింపుల్ గా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారట. ఆ తరువాత రెగ్యులర్ షూటింగుకు వెళతారట.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =