కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 132

సినిమా వార్తలు

నన్ను ఇంప్రెస్ చేయాలంటే ఇలా చేయాలి..!

‘వర్షం’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన త్రిష మొదటి సినిమాతోనే యూత్ లో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకొని.. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ్ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే కొత్త హీరోయిన్స్ వల్ల ఆఫర్స్ కాస్త తగ్గినా తనకు వచ్చిన అవకాశాలని వినియోగించుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తెలంగాణ సాయుధ పోరాటం పై సుకుమార్ మూవీ ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి, జగపతి బాబు, బాబు సింహా,ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై రూపొందుతున్న "పుష్ప " మూవీ దక్షిణాది భాషలతో పాటు హిందీ లో కూడా రిలీజ్ కానుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల థ్రిల్లర్ మూవీ ?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటి ఫుల్ వంటి ఫీల్ గుడ్ మూవీస్ ప్రేక్షకులను అలరించాయి. తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "ఫిదా" మూవీ ఘనవిజయం సాధించింది. బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ రూపొందుతుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా చిప్స్ ప్రాబ్లమ్ ఉపాసన అర్ధం చేసుకుంది...!

సమంత పుట్టిన రోజు రెండు రోజుల క్రితం జరిగిన సంగతి తెలిసిందే. ఇక కరోనా వల్ల పుట్టిన రోజులు వేడుకలు జరుపుకోకపోయిన సోషల్ మీడియా వేదికగా మాత్రం సామ్ కు అందరి అభినందనలు అందాయి. ఇక సమంత కోసం చై స్పెషల్ గా కేక్ కూడా తయారు చేసాడు. ఇక ఇదిలా ఉండగా తాజాగా సమంతకు మరో సర్పరైజ్ అందింది. అదేంటంటే.. సమంతకు చిప్స్ అంటే చాలా ఇష్టం. ఇక ఈ లాక్ డౌన్ లో పాపం సమంత ఎక్కడ చిప్స్ కోసం బాధపడుతుందో అని ఉపాసన తన కోసం కొన్ని చిప్స్ పాకెట్స్ కొని పార్సిల్ చేసి పంపింది. ఇక ఈ విషయాన్ని సమంత తన సోషల్ మీడియా ద్వారా తెలుపు తూ.. నేను నమ్మలేకపోతున్న.. నా చిప్స్ ప్రాబ్లమ్ నీకు గుర్తుందని.. నా ప్రాబ్లమ్ ను అర్ధం చేసుకొని నెలకు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్‌తో చైతు, విక్రమ్ చిత్రం?

‘మనం’(2014) వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి ప్ర‌ముఖ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు బి.వి.ఎస్.రవి కథను అందిస్తున్నాడని టాక్. కాగా, ఈ చిత్రానికి ‘థాంక్యూ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
ఓటీటీ

కొత్త సినిమాపై వస్తున్న రూమర్లకు చెక్..!

ఇటీవలే 'వదలడు' సినిమాతో వచ్చిన సిద్దార్ధ్ ఇప్పుడు తాజాగా మరో డిఫరెంట్ స్టోరీతో వస్తున్నాడు. జి క్రిష్ దర్శకత్వంలో సిద్దార్ధ్, దివ్యాంశ కౌశిక్ హీరో హీరోయిన్లుగా వస్తున్న సినిమా 'టక్కర్'. నిజానికి ఈ సినిమా ఈ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలిసిందే కదా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో అన్ని సినిమాలకు వస్తున్నట్టే... ఈ సినిమాకు పై కూడా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే సిద్దార్ధ ఈ వార్తలన్నిటినీ ఖండించాడు. తమ సినిమా థియేటర్ లోనే రిలీజ్ అవుతుందని.. ఎప్పుడు లాక్ డౌన్ అయిపోయి ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ చేస్తారో అప్పటి వరకూ వెయిట్ చేస్తామని చెప్పాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నవరసభరితంగా మహేష్, పరశురామ్ చిత్రం

‘గీతగోవిందం’(2018)తో కెరీర్ బెస్ట్ హిట్‌ను అందుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్. స్వల్పవిరామం అనంతరం తన తదుపరి చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారాయన‌. సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఫిల్మ్.. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత సెట్స్ పైకి వెళ్లనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

యన్టీఆర్ ‘పెత్తందార్లు’కు 50 ఏళ్ళు

మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు, దిగ్గజ దర్శకులు సి.యస్.రావు కలయికలో పలు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలు తెరకెక్కాయి. వాటిలో సింహభాగం విజయం సాధించాయి కూడా. అలాంటి అపురూప చిత్రాల్లో ‘పెత్తందార్లు’ ఒకటి. “తమ బ్రతుకులతో ఆటలాడుకునే నాయకులకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు?”.. అన్న కథాంశంతో రూపొందిన సినిమా ఇది. ఇందులో యన్టీఆర్ సరసన విజయనిర్మల క‌థానాయికగా నటించారు. జోతీ సినీ సిండికేట్ పతాకంపై యు.విశ్వేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాకరరెడ్డి, సావిత్రి, శోభన్‌బాబు, సంధ్యారాణి, నాగభూషణం, సత్యనారాయణ, నాగయ్య, రాజబాబు, అల్లు రామలింగయ్య, ధూళిపాల, రేలంగి, ముక్కామల, రావు గోపాలరావు, హేమలత…

Team TFNవాట్సాప్
Mega Star Chiranjeevi Musical Blockbuster Iddaru Mitrulu Turns 21
సినిమా వార్తలు

మెగాస్టార్ చిరంజీవి `ఇద్దరు మిత్రులు`కి 21 ఏళ్ళు

తెరజీవితంలోనే కాదు నిజ‌జీవితంలోనూ స్నేహానికి అధిక ప్రాధాన్య‌మిచ్చే మెగాస్టార్ చిరంజీవి.. 1999లో వరుసగా రెండు ఫ్రెండ్‌షిప్ బ్యాక్‌డ్రాప్ మూవీస్‌లో నటించారు. అందులో ఒక‌టి `స్నేహం కోసం` కాగా, మ‌రొక‌టి `ఇద్ద‌రు మిత్రులు`. టైటిల్స్‌లోనే స్నేహాన్ని ప్ర‌తిబింబిస్తూ తెర‌కెక్కిన ఈ రెండు సినిమాల్లోనూ స్నేహితుడి పాత్ర‌ల్లో చ‌క్క‌గా ఒదిగిపోయారు చిరు. `స్నేహం కోసం` ఇద్దరు మ‌గ స్నేహితుల చుట్టూ తిరిగే క‌థ‌తో ఆద్యంతం హృద్యంగా తెర‌కెక్కితే.. `ఇద్ద‌రు మిత్రులు` ఆడ‌, మ‌గ మ‌ధ్య ఉండే స్వ‌చ్ఛ‌మైన స్నేహానికి ప్ర‌తీక‌లా రూపొందింది.

Team TFNవాట్సాప్
Legendary Bollywood Actor Rishi Kapoor Passes Away
సినిమా వార్తలు

లెజెండరీ యాక్టర్ రిషి కపూర్ కన్నుమూత

కల్ట్ క్లాసిక్ "మేరా నామ్ జోకర్ " మూవీలో నటించి రిషి కపూర్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ "బాబీ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనేక సూపర్ హిట్ మూవీస్ లో తన డ్యాన్స్ లతో ప్రేక్షకులను అలరించారు. రిషికపూర్ నటించిన హమ్ కిసీసే కమ్ నహీ, అమర్ అక్బర్ ఆంథోనీ, చాందిని, దీవానా వంటి మూవీస్ ల్యాండ్ మార్క్ గా నిలిచాయి.

Team TFNవాట్సాప్
Nandamuri Balakrishna Box Office Sensation Simha Completes 10 Years
బాక్సాఫీస్

న‌ట‌సింహ బాలకృష్ణ ‘సింహా’కు 10 ఏళ్ళు

“చూడు.. ఒకవైపే చూడు.. రెండో వైపు చూడాలనుకోకు.. తట్టుకోలేవు.. మాడిపోతావ్”.. అంటూ డాక్టర్ నరసింహగా న‌టసింహ నంద‌మూరి బాలకృష్ణ తన నటవిశ్వరూపాన్ని ప్ర‌ద‌ర్శించిన‌ చిత్రం ‘సింహా’. ఇందులో బాల‌య్య ప‌లికిన ప్ర‌తీ డైలాగ్ అప్ప‌ట్లో సంచ‌ల‌న‌మే. మ‌రీ ముఖ్యంగా.. జ‌నాల జేజేలందుకునేలా బాలయ్యను స‌రికొత్త కోణంలో ఆవిష్క‌రించారు చిత్ర ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీను. బాలయ్య ద్విపాత్రాభినయం పోషించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో నయనతార, స్నేహా ఉల్లాల్, న‌మిత నాయిక‌లుగా నటించారు. కె.ఆర్.విజయ, రెహమాన్, సాయికుమార్, ఆదిత్యమీనన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, వేణు మాధవ్, చలపతిరావు, కృష్ణభగవాన్, ఝాన్సీ ముఖ్య పాత్రలు పోషించారు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నా కోసం స్క్రిప్ట్ రెడీ చెయ్.. అప్పటి వరకూ ఆగలేను..!

విజయ్ దేవరకొండ సినీ కెరీర్ గురించి మాట్లాడుకోవాలంటే అర్జున్ రెడ్డి కి ముందు, అర్జున్ రెడ్డి కి తర్వాత...అని చెప్పొచ్చు. ఎందుకంటే అర్జున్ రెడ్డి కంటే ముందు విజయ్ పలు సినిమాల్లో నటించాడు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' సినిమాలో ఏదో కనిపించి కనిపించని పాత్రలో కనపడి.. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాలో నాని ఫ్రెండ్ గా కనిపించి తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు. ఇక ఆ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పెళ్లి చూపులు సినిమాతో సూపర్ హిట్ కొట్టి హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆ తర్వాత వచ్చిందే 'అర్జున్ రెడ్డి'.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'పోకిరి' సినిమా నేనే చేయాలి.. కానీ మిస్సయ్యింది..!

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, మహేష్ బాబు కలయికలో వచ్చిన పోకిరి సినిమా ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది ఈ సినిమా. 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయిన ఈ సినిమా నిన్నటితో 14 ఏళ్ళు పూర్తి చేసుకుంది. పూరీ పంచ్ డైలాగ్స్, మహేష్ యాక్షన్, ఇలియానా గ్లామర్, మణిశర్మ మ్యూజిక్ ఇలా అన్నీ కలిసొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇందులోమహేష్ బాబు, ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో ఇలియానా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'మహాసముద్రం' నా మొదటి - చివరి ముల్టీస్టారర్

ఆర్ఎక్స్ 100 లాంటి కల్ట్ అండ్ బోల్డ్ కంటెంట్ తో సినిమా తీసి మంచి కమర్షియల్ కొట్టి కొట్టాడు అజయ్ భూపతి. ఇక ఆ తర్వాత అజయ్ కు చాలా అవకాశాలే వచ్చాయి.. పలు హీరోలు అజయ్ తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అయితే పరుశురాంకు మాత్రం ఇంతవరకూ రెండో సినిమా చేసే అవకాశం దక్కలేదు. అయితే ప్రస్తుతం మ‌హాస‌ముద్రం అనే సినిమాను చేయడానికి రెడీ అయ్యాడు. ఇక ఈ సినిమాలో మొదట రవితేజ ను హీరోగా అనుకున్నాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమానుండి రవితేజ తప్పుకున్నాడు. ఆ తర్వాత తాను ప‌లువురు హీరోల‌కి చెప్ప‌గా కొందరు డేట్స్ అడ్జెట్స్ చేయ‌లేక నో చెప్పార‌ట‌.

TFN Adminవాట్సాప్
సాంగ్

"పుష్ప" లో దిశా పటాని స్పెషల్ సాంగ్ ?

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా రాయసీమ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సునీల్ శెట్టి, బాబీ సింహా, ప్రకాష్ రాజ్, జగపతి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

హ్యాపీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే -చిరంజీవి

ఏప్రిల్ 29 వ తేదీ ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా మెగా స్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో డ్యాన్స్ కు కొత్త ఒరవడి క్రియేట్ చేసిన ఘనత చిరంజీవి దే. తన డ్యాన్స్ లతో ప్రేక్షక , అభిమానులను అలరించే చిరంజీవి సూపర్ హిట్ "పసివాడి ప్రాణం " మూవీ తో బ్రేక్ డ్యాన్స్ ను పరిచయం చేశారు. తనదైన స్టైల్ డ్యాన్స్ లతో చిరంజీవి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇంటర్నేషనల్ క్రికెటర్స్ మూవీ చిట్ చాట్

ఇంటర్నేషనల్ క్రికెటర్స్ రవిచంద్రన్ అశ్విన్ (తమిళనాడు ), హనుమ విహారి (ఆంధ్ర ప్రదేశ్ ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తెలుగు మూవీస్ గురించి చర్చించారు. తెలుగు లో మీ ఫేవరేట్ మూవీ అని అశ్విన్ అడగగా ఇటీవలే ఒక మంచి కామెడీ మూవీ "భీష్మ " చూశానని, నితిన్ హీరో అని విహారి బదులిచ్చారు. అశ్విన్ మాట్లాడుతూ .. తెలుగు మూవీస్ కు పెద్ద ఫ్యాన్ అని, అద్భుతమైన సినిమాలు చూశానని, తన ఆల్ టైమ్ ఫేవరేట్ మూవీ "మగధీర "అని, ఈ మధ్య చూసిన సినిమాలలో "ఎవరు " మూవీ చాలా బాగుందని, మహేష్ బాబు ఫ్యాన్ ను అని చెప్పారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భార్యకు అండగా నిలిచిన సూర్య..!

కుడి చేత్తో చేసిన దానం ఎడమ చేతికి కూడా తెలియకుండా దానం చేస్తుంటారు కొంతమంది. అలాంటి వాళ్లలో మన సినీ సెలబ్రిటీస్ చాలా మందే ఉన్నారు. అందులో తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. అగరం ఫౌండేషన్‌ ద్వారా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కుటుంబం ఎంతో మందికి సేవలను అందిస్తుంది. ఇటీవల నూతన విద్యా విధానం గురించి సూర్య చెప్పిన అభిప్రాయం చర్చనీయాంశంగా మారిన సంగతి కూడా తెలిసిందే. దానికి పలువురి మద్దతు లభించింది కూడా. ఇక ఇదిలాఉండగా ఈ మధ్య సూర్య భార్య జ్యోతిక చేసిన వ్యాఖ్యలు కూడాచర్చంశనీయమైన సంగతి తెలిసిందే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ మృతి..!

బాలీవుడ్ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్‌ ఖాన్ (54) మృతి చెందారు. గతకొద్దికాలంగా ఇర్ఫాన్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ఆయన క్యాన్సర్‌ వ్యాధితో పోరాటం చేశారు. కొన్ని నెలల క్రితం కోలుకున్నారు. అయితే మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీనితో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషయం చెందటంతో ఈ రోజు మరణించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి అధికారికంగా ప్రకటన చేసింది. ఇర్ఫాన్ ఖాన్‌ మృత దేహాన్ని ఆసుపత్రి సిబ్బంది ఆయన కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

దేవి 'మ్యూజికల్' క్లీనింగ్..!

అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగా స్టార్ట్ చేసిన ప్రస్తుతం టాలీవుడ్ లో 'బీ ద రియల్ మ్యాన్' ఛాలెంజ్ జోరుగా నడుస్తుంది. ఈ ఛాలెంజ్ ఇప్పటివరకూ ఎంతో మంది కంప్లీట్ చేసి 'రియల్ మ్యాన్' అనిపించుకున్నారు. కొంతమంది ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకుంటే కొంతమంది లైట్ గా తీసుకున్నారు. అయితే చాలా మంది మాత్రం తమ ఛాలెంజ్ ను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో దేవి కూడా చేరిపోయాడు.

TFN Adminవాట్సాప్

షేర్