లాక్ డౌన్ ఎఫెక్ట్ – ఆగిపోయిన 2000 కోట్ల టాలీవుడ్ బిజినెస్ ..!

Tollywood Film Industry Accrues Loss Of Around 2000 Crore Rupees Worth Business Due To Lockdown
Tollywood Film Industry Accrues Loss Of Around 2000 Crore Rupees Worth Business Due To Lockdown

కరోనా వల్ల ఎక్కడి సినిమాలు అక్కడ ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్, మే నెలలో చాలా సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ వల్ల థియేటర్స్ కూడా మూత పడటంతో..సినిమా రిలీజ్ లు అన్ని ఆగిపోయాయి. అంతేనా ఈ ఏడాది రిలీజ్ అవ్వాల్సిన సినిమాలపై కూడా ఆ ఎఫెక్ట్ పడింది. ఎన్నో సినిమాలు దసరాకి.. దీపావళి కి షెడ్యూల్ ను పెట్టుకొని ఉన్నాయి. కానీ షూటింగ్ లు మధ్యలో ఆగిపోవడం వల్ల ఆ సినిమాలు కాస్త వచ్చే ఏడాదికి వెళ్లాయి. ఒక వేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ అయితే అప్పుడే తెరుచుకునే పరిస్థితులు అయితే లేవు. థియేటర్లు, మాల్స్ , పబ్లిక్ ఎక్కువగా వుండే ప్రదేశాలకు అనుమతి ఇస్తారని అనుకుకోవడం లేదు. ఎంతో కఠిన మైన నియమ నిభంధనలతో జనాలు బయటకు రావలసిందే. ఇలాంటి పరిస్థితి లో థియేటర్ కి వెళ్ళడానికి ఎవరు ధైర్యం చేయరు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ తర్వాత మనదే పెద్ద ఇండస్ట్రీ. ఎలా లేదనుకున్నా ఒక ఏడాదికి 250 పైన సినిమాలే బయటకు వస్తుంటాయి. అందులో ఓ 150 సినిమాలు స్ట్రెయిట్ గా తెలుగు సినిమాలు ఉన్నా… మిగిలినవి డబ్ అయినవి ఉన్నా ఓవరాల్ గా 250 సినిమాలు టాలీవుడ్ నుండి రిలీజ్ అవుతాయి.

ఇక ఈ నేపథ్యంలో ఈ కరోనా వల్ల దాదాపు 2 వేల కోట్ల రూపాయల బిజినెస్ ఆగిపోయిందని చెప్తున్నారు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు. 15 సినిమాలు రిలీజ్ కు రెడీగా వున్నాయి… మరో 70కు పైగా సినిమాలు లైన్ లో వున్నాయి.. ఒక్క ఆర్ఆర్ఆర్ సినిమానే 400 కోట్ల బడ్జెట్… ఇంకా 20-30 కోట్ల బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు 3-5 కోట్లతో తెరకెక్కే సినిమాలు ఇలా ఎన్నో సినిమాలు ఆగిపోయి వున్నాయి. మా బ్యానర్ లోనే ‘నారప్ప’, ‘విరాట పర్వం’, ‘క్రష్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీలా’ సినిమాలు పోస్ట్ ప్రొడక్షన్ లో వున్నాయి.. ఇంకా మూడు సినిమాలు లైన్ లో వున్నాయి అని తెలిపారు. మొత్తం మీద కరోనా వల్ల టాలీవుడ్ లో 2వేల కోట్ల ప్రొడక్షన్ ఆగిపోయింది అని చెప్పారు.

నిజానికి సినిమా వాళ్లకు ఏడాది ప్రారంభం అంటే సంక్రాంతి ఆ తర్వాత సమ్మర్ సీజన్ ఇంకా తర్వాత దసరా.. ఇంకా పండుగల్లో మంచి బిజినెస్.. సంక్రాంతి ఎలాగూ అయిపోయింది.. ఇంకా ఈ సమ్మర్ సీజన్ కు మాత్రం కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. మరి దసరా వరకైనా థియేటర్స్ తీస్తే ప్రాబ్లమ్ లేదు.. అప్పటికి కూడా తెరవకపోతే కష్టమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 17 =