కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 42

సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ ఐకానిక్ పాత్రకు ప్రియదర్శి డబ్బింగ్

ఇప్పటీకే హాలీవుడ్ యానిమేటెడ్ మూవీస్ కు తెలుగు డబ్బింగ్ లో మన వాళ్ళు పలు పాత్రలకు తమ గొంతులను అరువు ఇచ్చిన సందర్భాలు వున్నాయి. నిన్ననే ఫ్రోజెన్ 2 సినిమాలో కీలకపాత్ర ఐన 'ఎల్సా' అనే పాత్రకు డబ్బింగ్ చెబుతున్నట్టు ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ లిస్ట్ లో ప్రియదర్శి కూడా చేరిపోయాడు. ఈ సినిమాలో ఐకానిక్ పాత్ర ఐన ఫన్నీ స్నో మ్యాన్ ఒలఫ్ పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నాడు. మరి ప్రియదర్శికి ఈ ఆఫర్ రావడం కష్టమే.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అప్పటి వరకూ నటిస్తూనే ఉంటా..!

తమిళనాడు సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాలపై ఎప్పుడూ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తునే ఉంటుంది. ఎప్పటిలాగే ఇప్పుడు అలాంటి వార్తే ఒకటి వినిపిస్తుంది. తాను బీజేపీలో చేరుతున్నట్టు వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చాడు. తన గురువు కె.బాలచందర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ మాట్లాడుతూ... తనకు కొందరు బీజేపీ రంగు వేయాలని ప్రయత్నిస్తున్నారని అన్నారు. గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డైరెక్టర్ కావలెను - యంగ్ డైరెక్టర్స్ కు 'అసురన్' స్పెషల్ స్క్రీనింగ్

తమిళ్ టాలెంటెడ్ నటుడు ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చి సూపర్ హిట్ అయిన 'అసురన్' మూవీని తెలుగులో కూడా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ లో వెంకటేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక వెంకటేష్ పక్కన శ్రేయ శరణ్ ను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Pappu Lanti Abbayi Song Teaser From Kamma Rajyamlo Kadapa Reddlu Out Now,Kamma Rajyam Lo Kadapa Reddlu Full Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Movie Songs, Kamma Rajyam Lo Kadapa Reddlu Telugu Movie Songs, latest telugu movies news, Pappu Laanti Ab
ట్రైలర్ & టీజర్

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' - 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ రిలీజ్

టైటిల్ తోనే తన సినిమాలకు ఎక్కడా లేని క్రేజ్ ను తీసుకొచ్చే వర్మ.. ఈసారి ఏకంగా రెండు వర్గాల పేర్లనే టైటిల్ గా తీసుకొని 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' అన్న సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక వర్మ ప్రమోషన్స్ ఎలా వుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. టీజర్, ట్రైలర్, పాటలతోనే సగం సినిమాకు క్రేజ్ తీసుకొస్తాడు. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి పలు పాటలను రిలీజ్ చేసి... డైరెక్ట్ గా పలు రాజకీయ నేతలపైనే సెటైర్లు వేసాడు. ఇప్పుడు తాజాగా మరో పాటతో రెడీ అయ్యాడు. తాజాగా ఈ సినిమా నుండి 'పప్పు లాంటి అబ్బాయి' సాంగ్ టీజర్ ను రిలీజ్ చేసి షాకిచ్చాడు. మరి ఈ పాట ఎన్ని వివాదాలకు దారి తీస్తుందో చూద్దాం..

TFN Adminవాట్సాప్
Latest Telugu Movie Reviews, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Thipparaa Meesam Movie Plus Points, Thipparaa Meesam Movie Public Talk, Thipparaa Meesam Movie Rating, Thipparaa Meesam Movie Review, Thipparaa Meesam Mo
రివ్యూ

ఎంత తిప్పినా తిరగని మీసం

మొత్తానికి సింపతీకి అవకాశం లేని పాత్ర ద్వారా హీరో శ్రీ విష్ణు- దర్శకుడు కృష్ణ విజయ్ లకు ఏ స్థాయి సక్సెస్ దక్కుతుందో చూడాలి.

Team TFNవాట్సాప్
సాంగ్

'90ML' నుండి 'నాతో నువ్వుంటే చాలు' లిరికల్ వీడియో రిలీజ్

శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా '90ML' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. గోల్డ్‌ మెడలిస్ట్‌ అయిన దేవదాస్‌ డ్రింకర్‌ గా మారడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటన్న నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, పలు పాటలను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

రాశీ ఖన్నా న్యూ ట్యాలెంట్

తెలుగు, తమిళ భాషాచిత్రాలతో బిజీగా ఉన్న పంజాబీ బ్యూటీ రాశీ ఖన్నా తన అందం, అభినయం తో ప్రేక్షకులను ఆకట్టు కుంటున్నారు. సూపర్ హిట్ మూవీ ఊహలు గుస గుస లాడే తో టాలీవుడ్ కు ఎంటరయిన రాశీ ఖన్నా నటించిన బెంగాల్ టైగర్, సుప్రీమ్, జై లవ కుశ, రాజా ది గ్రేట్, తొలి ప్రేమ మూవీస్ ఘనవిజయం సాధించాయి. సక్సెస్ ఫుల్ ఇమైక్క నోడిగళ్ మూవీ తో కోలీవుడ్ లో ప్రవేశించిన రాశీ ఖన్నా కోలీవుడ్ లో బిజీగా మారారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'కల్కి' అవుట్ - 'శివగామి' ఇన్

అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా 'రొమాంటిక్' మూవీ రూపొందుతున్న తెలిసిందే. స్టోరీ, స్క్రీన్ ప్లే , డైలాగ్స్ పూరి అందించిన ఈ సినిమా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో ఇషా కొప్పికర్

నటి, మోడల్, పొలిటీషియన్ ఇషా కొప్పికర్ 1998 సంవత్సరంలో చంద్రలేఖ మూవీ తో టాలీవుడ్ కు ఎంటరయి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషా చిత్రాలలో నటించారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన సూపర్ హిట్ హిందీ మూవీ కంపెనీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. వాలంటరీ గా నటనకు బ్రేక్ తీసుకొని, వివాహం చేసుకొని తల్లిగా మారిన ఇషా కొప్పికర్ మరొకసారి RGV వెబ్ సిరీస్ ద్వారా లైమ్ లైట్ లోకి వస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గోవిందా హరి గోవిందా' అంటున్న చిరు-కొరటాల..!

సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వరుస విజయాలతో తన సత్తా చాటుతున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఇప్పుడు కొరటాల కాంబినేషన్ లో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జ‌రుపుకుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబ‌ర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హాలీవుడ్ మూవీ "ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ "

వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో రూపొందిన మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత కథ తో ఒక హాలీవుడ్ మూవీ రూపొందింది. ఒక భారతీయ మహిళ ప్రధాన పాత్రతో రూపొందిన మొట్టమొదటి హాలీవుడ్ మూవీ"ది వారియర్ క్వీన్ ఆఫ్ ఝాన్సీ ".

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రేమించడానికి సిద్ధం గా లేను - ఇలియానా

బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు తో టాలీవుడ్ కు ఎంటరయిన గోవా బ్యూటీ ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్, జులాయి మూవీస్ ఘన విజయం సాధించాయి. సూపర్ హిట్ బర్ఫీ మూవీ తో ఇలియానా బాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా నటించిన ఫటా పోస్టర్ నిఖ్లా హీరో, మై తేరా హీరో, రుస్తుం, ముబారకన్, బాద్ షా హో, రైడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 6 సంవత్సరాల తరువాత ఇలియానా అమర్ అక్బర్ ఆంథోనీ మూవీ తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
బాక్సాఫీస్

విజిల్, ఖైదీ వైజాగ్ కలెక్షన్స్

అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన సినిమా 'బిగిల్'. తెలుగులో 'విజిల్' అనే పేరుతో రిలీజ్ చేశారు. ఇక ఈ నెల 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇక్కడ 10 కోట్లకు పైగా బిజినెస్ జరుపుకున్న ఈ సినిమా మొదటి వారానికి 8.93 షేర్ ను రాబట్టింది. ఇక పది రోజులకు గాను 10.09 కోట్లు రాబట్టింది.

TFN Adminవాట్సాప్
Vishal New Movie Action Pre Release Event Date Confirmed,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Action Movie Pre Release Event Date,Vishal New Movie Action Updates,Vishal Action Movie Latest News
సినిమా వార్తలు

"యాక్షన్" మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

యాక్షన్ హీరో విశాల్ మూవీస్ కు కోలీవుడ్ లో ఎంతటి క్రేజ్ ఉందో టాలీవుడ్ లో అంతే క్రేజ్ ఉంది. ట్రైడెంట్ ఆర్ట్స్ బ్యానర్ పై సుందర్.సి దర్శకత్వంలో విశాల్, తమన్నా జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ యాక్షన్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ నవంబర్ 15వ తేదీ రిలీజ్ కానున్నాయి. హీరో విశాల్ కల్నల్ సుభాష్ అనే ఆఫీసర్ పాత్రలో, తమన్నా కాప్ పాత్రలో నటించారు. హిప్ హప్ తమిళ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Entha Manchivaadavuraa Movie Release Date Fixed, Entha Manchivaadavuraa Movie Updates, Entha Manchivaadavuraa Release Date Locked, Entha Manchivaadavuraa Telugu Movie Release Date, Entha Manchivaadavuraa Release Date Fixed, Latest Telugu Movies News,
రిలీజ్ అప్‌డేట్

'ఎంత మంచి వాడవురా' రిలీజ్ డేట్ ఫిక్స్

సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో నందమూరి కల్యాణ్‌రామ్‌ నటిస్తున్న సినిమా ‘ఎంత మంచివాడవురా’. ఇక ఈ సినిమా షూటింగ్ చివరిదశకు వచ్చింది. కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో చివరి షెడ్యూల్ జరుపుకుంటుంది. అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఐటీ అధికారిగా బాల‌కృష్ణ‌?

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత న‌ట‌సింహ బాల‌కృష్ణ నుంచి వ‌స్తున్న చిత్రం `రూల‌ర్‌`. కె.య‌స్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా... భూమిక‌, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య‌ పాత్ర‌లు పోషిస్తున్నారు. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో... పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నారు బాల‌య్య‌. ఇప్పటికే ఈ రెండు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే... ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి మరో కోణం…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రవితేజ సినిమాలో సముద్రఖని

తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని... తెలుగువారికి కూడా సుపరిచితుడే. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన‌ ‘శంభో శివ శంభో’(2010), నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ‘జెండాపై కపిరాజు’(2014)... స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందాయి. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ పలు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్... ఇప్పుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధపడుతున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

చిరుతో మైత్రీ మూవీ మేకర్స్?

మెగా ఫ్యామిలీకి అచ్చొచ్చిన‌ నిర్మాణ సంస్థల్లో హ్యాట్రిక్ విజయాల సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒకటి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ‘రంగస్థలం’ వంటి మెమ‌ర‌బుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ని అందించిన మైత్రీ... ఆపై వ‌రుస ప‌రాజ‌యాల్లో ఉన్న‌ మరో మెగాహీరో సాయితేజ్ కి ‘చిత్రలహరి’ రూపంలో విజ‌యాన్ని అందించింది. అంతేకాదు... సాయితేజ్ త‌మ్ముడు వైష్ణవ తేజ్ ని క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ప్ర‌స్తుతం ‘ఉప్పెన’ అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా బ్రిలియంట్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రో సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది మైత్రీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిసెంబర్ 20న కార్తి కొత్త చిత్రం?

దీపావ‌ళి కానుక‌గా విడుద‌లైన ‘ఖైదీ’తో మరో ఘ‌న‌విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు కార్తి. తమిళ‌, తెలుగు భాష‌ల్లో ఒకే రోజున‌ రిలీజైన‌ ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ బ్లాక్‌బ‌స్ట‌ర్ అయింది. కాగా, ఒక‌వైపు `ఖైదీ` విజ‌యాన్ని ఆస్వాదిస్తూనే... మ‌రోవైపు త‌దుప‌రి చిత్రాన్ని పూర్తిచేసే ప‌నిలో ఉన్నాడు కార్తి. అంతేకాదు... ఫ్యామిలీ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమా కూడా ఈ ఏడాదిలోనే తెర‌పైకి రానుందని స‌మాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫ‌స్ట్ సింగిల్స్‌తో ఇంప్రెస్ చేస్తున్న థ‌మ‌న్‌

స‌రిగ్గా ప‌దేళ్ళ క్రితం తెలుగునాట `కిక్‌`ఇచ్చే ఓ కొత్త సౌండింగ్ ప‌రిచ‌య‌మైంది. `రేసుగుర్రం`లా దూసుకొచ్చి `దూకుడు` చూపించిన ఆ స్వ‌ర‌ప్ర‌స్థానం.. చూస్తుండ‌గ‌నే తొమ్మిదేళ్ళ‌కే శ‌త‌కం పూర్తిచేసి ఔరా అనిపించింది. ఉవ్వెత్తున ఎగసిప‌డిన ఆ స్వ‌ర‌త‌రంగమే... య‌స్.య‌స్. థ‌మ‌న్‌.

Team TFNవాట్సాప్

షేర్