కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

రవితేజ సినిమాలో సముద్రఖని

రవితేజ సినిమాలో సముద్రఖని

Director Samuthirakani Turns Actor For Ravi Teja Movie

తమిళనాట దర్శకుడిగానూ, నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్న సముద్రఖని... తెలుగువారికి కూడా సుపరిచితుడే. మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టించిన‌ ‘శంభో శివ శంభో’(2010), నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన ‘జెండాపై కపిరాజు’(2014)... స‌ముద్ర‌ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలోనే రూపొందాయి. ఓ వైపు దర్శకుడిగా రాణిస్తూనే, మరోవైపు నటుడిగానూ పలు తమిళ చిత్రాలలో నటిస్తూ వస్తున్న ఈ డైరెక్టర్ కమ్ యాక్టర్... ఇప్పుడు నటుడిగా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించడానికి సిద్ధపడుతున్నాడు.

ఆ వివరాల్లోకి వెళితే... రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటించనున్న ఈ కాప్ స్టోరీలో... సముద్రఖని ఓ కీలకపాత్రలో దర్శనమివ్వనున్నాడు. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ‘శంభో శివ శంభో’ చిత్రం కోసం రవితేజను డైరెక్ట్ చేసిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్... ఇప్పుడు అదే రవితేజతో వెండితెరను పంచుకోనుండడం విశేషం. మరి... అప్పుడు దర్శకుడిగా రవితేజకు అచ్చొచ్చిన‌ సముద్రఖని... ఇప్పుడు నటుడిగా కూడా క‌లిసొస్తాడేమో చూడాలి.

కాగా... ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్.య‌స్.రాజ‌మౌళి రూపొందిస్తున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్‌ ‘ఆర్ ఆర్ ఆర్’లోనూ స‌ముద్ర‌ఖ‌ని ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అలాగే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌`అల వైకుంఠ‌పుర‌ములో`లోనూ విల‌న్‌గా న‌టిస్తున్నాడ‌ని టాక్‌. సో... 2020లో మూడు క్రేజీ ప్రాజెక్ట్‌ల‌తో తెలుగునాట న‌టుడిగా అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాడ‌న్న‌మాట స‌ముద్ర‌ఖ‌ని.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్