ఫ‌స్ట్ సింగిల్స్‌తో ఇంప్రెస్ చేస్తున్న థ‌మ‌న్‌

Thaman Creates Sensation With His First Singles,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,S Thaman First Singles Songs,Music Director Thaman First Singles Songs,S Thaman Sensation Songs

స‌రిగ్గా ప‌దేళ్ళ క్రితం తెలుగునాట `కిక్‌`ఇచ్చే ఓ కొత్త సౌండింగ్ ప‌రిచ‌య‌మైంది. `రేసుగుర్రం`లా దూసుకొచ్చి `దూకుడు` చూపించిన ఆ స్వ‌ర‌ప్ర‌స్థానం.. చూస్తుండ‌గ‌నే తొమ్మిదేళ్ళ‌కే శ‌త‌కం పూర్తిచేసి ఔరా అనిపించింది. ఉవ్వెత్తున ఎగసిప‌డిన ఆ స్వ‌ర‌త‌రంగమే… య‌స్.య‌స్. థ‌మ‌న్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ మ‌ధ్య వ‌రుస ప‌రాజ‌యాల‌తో కాస్త ట్రాక్ త‌ప్పిన‌ట్లు క‌నిపించిన థ‌మ‌న్… గ‌త రెండేళ్ళుగా వీనుల‌విందైన బాణీల‌తో వ‌రుస మ్యూజిక‌ల్ హిట్స్ అందుకుంటూ మ‌ళ్ళీ ఫామ్‌లోకి వ‌చ్చేశాడు. ఇక‌… నెలన్న‌ర‌ రోజుల గ్యాప్‌లో వ‌చ్చిన అత‌ని కొత్త చిత్రాల `ఫ‌స్ట్(బెస్ట్) సింగిల్స్` అయితే థ‌మ‌న్ స్థాయిని మ‌రింత పెంచేలా ఉన్నాయి. వీటిలో ముందుగా… `అల వైకుంఠ‌పురములో` నుంచి వచ్చిన ఫ‌స్ట్ సింగిల్ `సామ‌జ‌వ‌ర గ‌మ‌న‌` ఎంత‌టి సంచ‌ల‌న‌మో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంతేకాదు… `డిస్కో రాజా` నుంచి వ‌చ్చిన ఫ‌స్ట్ సింగిల్‌ `నువ్వు నాతో ఏమ‌న్నావో`తో పాటు `ప్ర‌తి రోజూ పండ‌గే` టైటిల్ సాంగ్‌, తాజాగా విడుద‌లైన `వెంకీమామ‌` టైటిల్ ట్రాక్ వ‌ర‌కు థ‌మ‌న్ రీ-ఫ్రెషింగ్ ట్యూన్స్‌తో భ‌లేగా ఇంప్రెస్ చేశాడు. అంతేకాదు… ఆ యా చిత్రాల ఫుల్ ఆల్బ‌మ్స్ కోసం వేచిచూసేలా చేయ‌డ‌మే కాకుండా… సినిమాల‌పై ఆస‌క్తిని పెంచేశాడు.

మ‌రి… నెల రోజుల గ్యాప్‌లో రానున్న ఈ నాలుగు సినిమాల‌తో థ‌మ‌న్ వ‌రుస విజ‌యాలు అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen + four =