ప్రేమించడానికి సిద్ధం గా లేను – ఇలియానా

I Am Not Seeking Love Says Ileana,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ileana D'Cruz not ready for love,Ileana D'Cruz opens up on break up with Andrew Kneebone,Ileana Latest News 2019

బ్లాక్ బస్టర్ మూవీ దేవదాసు తో టాలీవుడ్ కు ఎంటరయిన గోవా బ్యూటీ ఇలియానా నటించిన పోకిరి, జల్సా, కిక్, జులాయి మూవీస్ ఘన విజయం సాధించాయి. సూపర్ హిట్ బర్ఫీ మూవీ తో ఇలియానా బాలీవుడ్ లో ప్రవేశించారు. ఇలియానా నటించిన ఫటా పోస్టర్ నిఖ్లా హీరో, మై తేరా హీరో, రుస్తుం, ముబారకన్, బాద్ షా హో, రైడ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 6 సంవత్సరాల తరువాత ఇలియానా అమర్ అక్బర్ ఆంథోనీ మూవీ తో టాలీవుడ్ రీ ఎంట్రీ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బర్ఫీ మూవీ టైమ్ లో ఇలియానా ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల క్రితం వారి లవ్ బ్రేకప్ అయింది . ఇలియానా మాట్లాడుతూ .. జీవితంలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనం మరింత గా ప్రేమించుకొనడం ఉత్తమం అన్నారు. లవ్ బ్రేకప్ తనను బాధించిందని, ఒక థెరపిస్ట్ ను కలిశానని, జీవితాన్ని యథాతథం గా స్వీకరించమని ఆమె చెప్పిన మాటలు
తనలో స్ఫూర్తి ని నింపాయని, లవ్ బ్రేకప్ ఎన్నో పాఠాలను నేర్పిందని, మునుపటి కంటే పరిణితి తో ఆలోచిస్తున్నానని, ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నానని , ప్రేమించడానికి సిద్ధంగా లేనని, ప్రస్తుతం తాను నటిస్తున్న పాగల్ పంటి, ది బిగ్ బుల్ మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నానని ఇలియానా తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 − 6 =