ఐటీ అధికారిగా బాల‌కృష్ణ‌?

Balakrishna Plays IT Employee In Ruler Movie,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Balakrishna Role Revealed in Ruler Movie,Ruler Movie Updates,BalakrishnaRuler Telugu Movie

`య‌న్టీఆర్‌` బ‌యోపిక్ త‌రువాత న‌ట‌సింహ బాల‌కృష్ణ నుంచి వ‌స్తున్న చిత్రం `రూల‌ర్‌`. కె.య‌స్. ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ళ్యాణ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నాడు. బాలయ్య సరసన సోనాల్ చౌహాన్‌, వేదిక కథానాయికలుగా నటిస్తుండగా… భూమిక‌, ప్రకాష్ రాజ్, జయసుధ ముఖ్య‌ పాత్ర‌లు పోషిస్తున్నారు. పవర్ ప్యాక్డ్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో… పోలీస్ ఆఫీస‌ర్‌గా, గ్యాంగ్‌స్ట‌ర్‌గా రెండు విభిన్న ఛాయలున్న పాత్రలో దర్శనమివ్వనున్నారు బాల‌య్య‌. ఇప్పటికే ఈ రెండు లుక్స్‌కి సంబంధించిన పోస్టర్స్‌ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో బాలయ్య పాత్రకు సంబంధించి మరో కోణం కూడా ఉంటుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అదేమిటంటే… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలయ్య ఐటీ అధికారిగానూ కనిపిస్తారట‌. కెరీర్‌లో పలు వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి మెప్పించిన‌ బాలయ్య… ఈసారి సాఫ్ట్‌వేర్ ప్రొఫెష‌న‌ల్‌గానూ మెస్మ‌రైజ్ చేస్తారేమో చూడాలి.

చిరంత‌న్ భ‌ట్ సంగీత‌సార‌థ్యంలో రూపొందుతున్న `రూల‌ర్‌` డిసెంబ‌ర్ 20న థియేట‌ర్ల‌లోకి రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.