కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2019

ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 41

Prabhas to Entertain Hindi Audience Again,Latest Telugu Movies News, Prabhas Gears Up To Shoot His Next Movie, Prabhas New movie shooting update, Prabhas Latest News 2019, Prabhas Next Movie Updates, Prabhas Upcoming Movie Details, Rebal Star Prabhas
సినిమా వార్తలు

హిందీలో కూడా వస్తున్న #prabhas20

సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరో గా వచ్చిన 'సాహో' ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్నో అంచనాల మధ్య ఆగష్ట్ 30 వ తేదీన విడుదలైన ఈ సినిమా అందరిచేత 'సాహో' అనిపించుకుంది. నాలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 424 కోట్లను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా హిందీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. సాహో సినిమాకు అక్కడి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమా తెలుగులో 200 పైగా కలెక్షన్స్ రాబట్టగా... హిందీలో 185 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
Director Confirmed For Asuran Telugu Remake?,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Venkatesh Asuran Remake Director,Asuran Telugu Remake Director,Asuran Telugu Movie Updates
సినిమా వార్తలు

'అసుర‌న్' రీమేక్‌కి ఆ డైరెక్ట‌ర్ క‌న్ఫ‌ర్మ్ అయ్యాడా ?

రీమేక్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో `విక్ట‌రీ` వెంక‌టేష్ ఒక‌రు. కెరీర్ ఆరంభం నుంచి ప‌లు రీమేక్ మూవీస్‌లో న‌టించ‌డ‌మే కాకుండా... సింహ‌భాగం ఘ‌న‌విజ‌యాలు అందుకున్నారు వెంకీ. కాగా... తాజాగా ఈ సీనియ‌ర్ హీరో త‌మిళ బ్లాక్‌బ‌స్ట‌ర్ ‘అసురన్’ రీమేక్‌లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. డి.సురేష్ బాబు, క‌లైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడెవ‌ర‌న్న‌ది ఇంకా స్ప‌ష్ట‌త రాలేదు. ఆ మ‌ధ్య ఓంకార్ పేరు వినిపించినా... అది వార్త‌ల‌కే ప‌రిమితం అయింది. తాజా స‌మాచారం ప్రకారం... ఆ అవ‌కాశం యువ ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడిని వ‌రించింద‌ని తెలిసింది.

Team TFNవాట్సాప్
20 Years For Super Hit Movie Chirunavvutho,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,20 Years For Chirunavvutho Movie,Chirunavvutho Movie Completes 20 Years,Chirunavvutho Telugu Movie,Trivikram Chirun
సినిమా వార్తలు

20వ వ‌సంతంలోకి 'చిరునవ్వుతో'

జీవితంలో ఎన్ని స‌మ‌స్య‌లు ఎదురైనా వాటిని చిరున‌వ్వుతో అధిగ‌మిస్తూ ముందుకు సాగాల‌ని చాటి చెప్పిన చిత్రం `చిరున‌వ్వుతో`. “ప్రేమించడం కంటే... ప్రేమించబడటం గొప్ప” అనే కాన్సెప్ట్‌లోంచి పుట్టిన ఈ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో... వేణు, షహీన్ జంట‌గా నటించారు. ప్రేమ, ప్రకాష్ రాజ్, చంద్రమోహన్, సునీల్, గిరిబాబు, బ్రహ్మానందం, అలీ, సుధ, ప్రియ‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. జి.రామ్ ప్రసాద్‌ని ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ ఎస్.పి.ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట‌ శ్యామ్ ప్రసాద్ ఈ ఫీల్ గుడ్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌ని నిర్మించారు.

Team TFNవాట్సాప్
Bumper Offer For Actress Genelia,latest telugu movies news,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Actress Genelia New Movie in Tollywood,Genelia Next Movie with Megastar,Genelia Latest News 2019,Genelia Upcoming Projects
సినిమా వార్తలు

'బొమ్మరిల్లు' భామ‌కి బంప‌ర్ ఆఫ‌ర్‌ ?

‘సత్యం’, ‘బొమ్మరిల్లు’, ‘రెడీ’, ‘శశిరేఖా పరిణయం’... ఇలా ప‌లు తెలుగు చిత్రాల్లో అభిన‌యానికి అవ‌కాశ‌మున్న పాత్ర‌ల్లో క‌నిపించి న‌టిగా మంచి గుర్తింపుని తెచ్చుకుంది జెనీలియా. పెళ్ళ‌య్యాక మ‌ళ్ళీ తెలుగు సినిమాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌ని ఈ టాలెంటెడ్ బ్యూటీ... తాజాగా ఓ మెగా ఆఫర్‌ను దక్కించుకున్నట్టు టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'జాన్' షూటింగ్ అప్ డేట్

సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు 'జాన్' సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే రెండు షెడ్యూల్ లను కంప్లీట్ చేసుకుంది. అయితే ఇక ఇన్ని రోజులు సాహో సినిమా షూటింగ్‌, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్‌జాన్ సినిమాకు కాస్త బ్రేక్‌ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సాలిడ్ గా 'నిశ్శబ్దం' ప్రీ రిలీజ్ బిజినెస్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు లో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌... ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటోంది. ఇక రీసెంట్ గా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'స‌రిలేరు నీకెవ్వ‌రు' కేరళ షెడ్యూల్ పూర్తి

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 'స‌రిలేరు నీకెవ్వ‌రు' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక గతకొద్దికాలంగా కేరళ లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుండగా.. తాజాగా ఈ షెడ్యూల్ కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ అంతా గ్రూప్ ఫోటో దిగారు. ఇందులో మ‌హేష్ బాబు, ర‌ష్మిక‌, ప్ర‌కాశ్ రాజ్, అనీల్ రావిపూడి, విజ‌య‌శాంతి, రాజేంద్ర‌ప్రసాద్, సంగీత త‌దిత‌రులు ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Ram Pothineni talks about New movie, Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,iSmart director Puri Jagannadh,Ram Pothineni Next Movie with Puri Jagannadh,Director Puri Jagannadh New Movie,Ram Pothine
సినిమా వార్తలు

సీక్వెల్ కావచ్చు.. ప్రీక్వెల్ కావచ్చు - సినిమా మాత్రం పక్కా..!

ఒక్క దెబ్బకి మూడు పిట్టలు అన్నట్టు ఒక్క ఇస్మార్ట్ శంకర్ తో అటు హీరో రామ్ కి, నిర్మాతలు పూరి, ఛార్మి కి, నిధి అగర్వాల్ కి పెద్ద సక్సెసే దక్కింది. ఎప్పటినుండో రామ్ మంచి హిట్ కోసం చూస్తున్నాడు.. ఇక నిధి కూడా వచ్చిన రెండు సినిమాలు ప్లాప్ అవ్వడంతో ఫస్ట్ హిట్ కోసం ఎదురుస్తుంది.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా హిట్ ఇచ్చి చాలా అయింది. అలా ఒకేసారి వీరందరికీ మంచి హిట్ ఇచ్చి కష్టకాలం నుండి బయటపడేసింది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా 75కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డ్స్ క్రియేట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్రోజన్ 2 లో ఎల్సా పాత్రకు శృతి హాసన్ డబ్బింగ్

వాల్ట్ డిస్నీ యానిమేషన్ స్టూడియోస్ క్రిస్ బక్, జెన్నీఫర్ లీ దర్శకత్వంలో ఎల్సా, అన్నాప్రధాన పాత్రలతో నిర్మించిన 3D కంప్యూటర్ యానిమేటెడ్ మ్యూజికల్ ఫాంటసీ మూవీ ఫ్రోజన్ 2013 సంవత్సరంలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఫ్రోజన్ మూవీ కి సీక్వెల్ ఫ్రోజన్ 2 మూవీ రూపొంది ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 22 వ తేదీ రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Vijay Sethupathi Movie Teaser Is Out,Latest Telugu Movies News,Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Telugu Movie Trailers 2019,Vijay Sethupathi Movie Teaser,Vijay Sethupathi Teaser,Vijay Sethupathi Telugu Movie Teaser,Vij
ట్రైలర్ & టీజర్

"విజయ్ సేతుపతి " మూవీ టీజర్ రిలీజ్

కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా వెలుగొందుతున్న విజయ్ సేతుపతి హీరోగా విజయ్ చందర్ దర్శకత్వంలో రూపొందిన సంగ తమిళ మూవీ, తమిళ తెలుగు డబ్బింగ్ వెర్షన్ విజయ్ సేతుపతి మూవీ రెండు భాషలలోనూ నవంబర్ 15 వ తేదీ రిలీజ్ కానున్నాయి. విజయ్ సేతుపతి డ్యూయల్ రోల్ లో నటించిన ఈ మూవీలో రాశీ ఖన్నా, నివేత పేతురాజ్ కథానాయికలు. నాజర్, అశుతోష్ రానా, రవి కిషన్ శుక్లా, తులసి ముఖ్య పాత్రలలో నటించారు. వివేక్ - మెర్విన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
ఏడు చేపల కథ ఫస్ట్ డే కలెక్షన్స్
బాక్సాఫీస్

ఏడు చేపల కథ ఫస్ట్ డే కలెక్షన్స్

సినిమా టైటిల్ నుండి టీజర్, ట్రైలర్ లతోనే అందరికి షాకిచ్చి ఎట్టకేలకు నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది 'ఏడు చేపల కథ'. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి షో కే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ యూత్ లో సినిమా పై ఉన్న క్రేజ్ తో అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అందుకుంది. ఈ సినిమా ఫస్ట్ డే ఏకంగా 1.06 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజు 1.13 కోట్ల షేర్ ని సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర షాకింగ్ ఓపెనింగ్స్ ని మొదటి రోజు అందుకుని సంచలనం సృష్టించింది.

TFN Adminవాట్సాప్
ట్రైలర్ & టీజర్

రఘుపతి వెంకయ్య నాయుడు మూవీ ట్రైలర్ రిలీజ్

మండవ శాంతిశ్రీ సమర్పణ లో యెల్లో లైన్ పిక్చర్స్ బ్యానర్ పై బాబ్జీ దర్శకత్వంలో నరేష్ హీరోగా ఫాదర్ ఆఫ్ తెలుగు సినిమా రఘుపతి వెంకయ్య నాయుడు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన రఘుపతి వెంకయ్య నాయుడు మూవీనవంబర్ 29 వ తేదీ రిలీజ్ కానుంది. తనికెళ్ళ భరణి, మహర్షి, సత్య ప్రియ, భావన ముఖ్య పాత్రలలో నటించారు, శ్రీ వెంకట్ సంగీతం అందించారు. రఘుపతి వెంకయ్య నాయుడు తెలుగు చలన చిత్ర సీమకు ఎనలేని సేవలు అందించారు. మద్రాస్ (చెన్నై ) లో మొట్ట మొదటి థియేటర్ ను నిర్మించిన ఘనత ఆయనదే.

Team TFNవాట్సాప్
త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్
ట్రైలర్ & టీజర్

త్వరలో రాబోతున్న 'రూలర్' టీజర్

కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 'రూలర్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. గతకొద్దికాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చింది. ప్ర‌స్తుతం కేర‌ళ‌లో ఓ పాట తెర‌కెక్కిస్తున్నారు. ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే మ‌రోవైపు ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఏ సినిమా నుండి పలు పోస్టర్లు రిలీజ్ చేశారు.

TFN Adminవాట్సాప్
అట్లీతో వరుసగా మూడు సినిమాలు సూపర్ స్టార్ డీల్...!
సినిమా వార్తలు

అట్లీతో వరుసగా మూడు సినిమాలు సూపర్ స్టార్ డీల్...!

తమిళ్ లో పలు సూపర్ హిట్ సినిమాలు తీసి తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు అట్లీ. ఇక ఇటీవలే విజయ్ తో బిగిల్ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాడు అట్లీ. ఇక అట్లీ డైరక్షన్ లో షారుఖ్ ఖాన్ తో ఒక సినిమా చేస్తున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక అట్లీ దర్శకత్వంలో సూపర్ హిట్ అయిన 'రాజా రాణి' సినిమాను షారుఖ్ రీమేక్ చేయనున్నాడు. ఇక ఈ రీమేక్ కు అట్లీ నే దర్శకత్వం వహించనున్నాడు. మరో కొద్దిరోజుల్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అల .. వైకుంఠపురములో .. పై ఫ్రాన్స్ కన్సొలేట్ ట్వీట్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా తివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీఅల .. వైకుంఠపురములో .. సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. టబు, సుశాంత్ , నవదీప్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత రెస్పాన్స్ లభించింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'విరాటపర్వం'కోసం బాలీవుడ్ యాక్షన్ డైరక్టర్

వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమెకు శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అశోక్ గల్లా మూవీ లాంచ్ కు ముఖ్య అతిథి రామ్ చరణ్ ?

అమర్ రాజా మీడియా &ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిడిపి MP జయదేవ్ గల్లా తనయుడు, సూపర్ స్టార్ మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ కు హీరోగా పరిచయమవుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ మూవీ 10 వ తేదీ ప్రారంభం కానుంది. ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయిక గా ఎంపికయ్యారు. నరేష్, సత్య, అర్చనా సౌందర్య ముఖ్య పాత్రలలో నటించనున్నారు. జిబ్రాన్ సంగీతం అందించనున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

‘ఒకే ఒక్కడు’కు 20 ఏళ్ళు

భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో ద‌ర్శ‌కుడు శంక‌ర్ తీరే వేరు. ముఖ్యంగా... సామాజిక అంశాలకు సాంకేతిక విలువ‌లను జోడించి ఆయ‌న రూపొందించిన ప‌లు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట సంచ‌ల‌నం సృష్టించాయి. వాటిలో `ఒకే ఒక్క‌డు` (త‌మిళంలో `ముద‌ల్ వ‌న్‌`) ఒక‌టి. `ఒక రోజు ముఖ్య‌మంత్రి` అనే కొత్త త‌ర‌హా పాయింట్‌తో, ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా రూపొందించిన ఈ సెన్సేష‌న‌ల్ మూవీ... తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఘ‌న‌విజ‌యం సాధించింది. త‌న తొలి చిత్ర క‌థానాయ‌కుడు, `యాక్షన్ కింగ్` అర్జున్ తో శంక‌ర్ రూపొందించిన రెండో సినిమా ఇది. ఇందులో టీవీ జ‌ర్న‌లిస్ట్ గా, ముఖ్య‌మంత్రిగా రెండు విభిన్న ఛాయ‌లున్న పాత్ర‌లో అర్జున్ ఒదిగిపోయాడు…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాల‌కృష్ణ‌కు జోడీగా ర‌చితా రామ్‌?

నటసింహ నందమూరి బాలకృష్ణకు అచ్చొచ్చిన ద‌ర్శ‌కుల్లో బోయపాటి శ్రీను ఒక‌రు. జట్టుక‌ట్టిన రెండు సార్లూ బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లుకొట్టిన ఘ‌న‌త ఈ కాంబినేష‌న్‌ది. `సింహా`, `లెజెండ్‌` రూపంలో బాక్సాఫీస్‌ని షేక్ చేసిన ఈ ద్వ‌యం... హ్యాట్రిక్ మూవీకి సిద్ధ‌మ‌వుతోంది. గ‌త రెండు చిత్రాల్లోనూ బాల‌య్య‌ని రెండు విభిన్న పాత్ర‌ల్లో (ద్విపాత్రాభిన‌యం) చూపించిన బోయ‌పాటి... థ‌ర్డ్ జాయింట్ వెంచ‌ర్‌లో మాత్రం అందుకు భిన్నంగా రెండు షేడ్స్ ఉన్న‌ పాత్రలో ప్రెజెంట్ చేయ‌బోతున్నాడ‌ని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సల్మాన్ ఖాన్‌కి విల‌న్‌గా ‘ప్రేమిస్తే’ భరత్

`బాయ్స్‌`, `ప్రేమిస్తే` వంటి త‌మిళ అనువాద చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన క‌థానాయ‌కుడు భ‌ర‌త్‌. `యువ‌సేన‌`, `స్పైడ‌ర్‌` వంటి తెలుగు సినిమాల్లోనూ సంద‌డి చేసిన ఈ టాలెంటెడ్ యాక్ట‌ర్‌... ఆ మ‌ధ్య ‘జాక్‌పాట్’(2013) అనే హిందీ చిత్రంలోనూ మెరిశాడు. క‌ట్ చేస్తే... ఆరేళ్ళ త‌రువాత బాలీవుడ్‌లో మ‌రో సినిమాలో న‌టించ‌బోతున్నాడు భ‌ర‌త్‌. అయితే, ఈ సారి ఏకంగా బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్‌కు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నాడు భ‌ర‌త్‌.

Team TFNవాట్సాప్

షేర్