ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 43
మహేష్ మేనల్లుడి ఎంట్రీ కి రంగం సిద్ధం
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్
నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి
బాలీవుడ్ కామెడీ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
యన్టీఆర్, సావిత్రి ‘మాతృదేవత’కు 50 ఏళ్ళు
వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ

'నిశ్శబ్దం' టీజర్ కు సూపర్ రెస్పాన్స్
నాగార్జునతో `ఊపిరి` రచయిత చిత్రం?
బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ లో రాజ్ తరుణ్
విశాల్ సినిమాలో గౌతమి?

'భీష్మ' ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’?
'దర్బార్' మోషన్ పోస్టర్ రిలీజ్
మురగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీ కాంత్, నయనతార ప్రధాన పాత్రల్లో దర్బార్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముగిసింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రజినీకాంత్ కు సంబంధించి పలు లుక్స్ ను రిలీజ్ చేయగా తాజాగా ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
'డిస్కోరాజా' రిలీజ్ డేట్ ఫిక్స్ - త్వరలో రానున్న టీజర్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక నిన్న ఈ సినిమా రిలీజ్ డేట్.. టీజర్ రిలీజ్ డేట్ అప్ డేట్ ఇస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
మహేష్ మేనల్లుడి ఎంట్రీ కి రంగం సిద్ధం
మహేష్ మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నట్టు గత కొద్దికాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య దిల్ రాజు బ్యానర్ లో సినిమా ప్రారంభించగా అది ఆగిపోయింది. అయితే మళ్లీ వేరే ప్రాజెక్ట్ సెట్ చేశారు. కాగా గతంలో 'భలే మంచి రోజు' 'శమంతకమణి' మరియు దేవదాసు సినిమాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నాడు.
నవ్వించినా... ఏడిపించినా ఈయనకే సాటి..!
ఆకెళ్ళ నాగ శ్రీనివాస వర్మ... ఈ పేరు ఎవరిదబ్బా అని అనుకుంటున్నారా..? అదే త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్పండి ఎవరికైనా అర్ధమవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఎంతో మంది డైరెక్టర్లు, రచయితలు వున్నా త్రివిక్రమ్ స్టైల్ వేరు. పంచులు, ప్రాసలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే త్రివిక్రమ్ అనే చెబుతారు ఎవరైనా.. తన పంచులు ప్రాసలతో నవ్విస్తాడు.. ఎమోషనల్ డైలాగ్స్ తో కన్నీళ్లు పెట్టిస్తాడు.. సందేశాత్మక సన్నివేశాలతో ఆలోచింపచేస్తాడు.. తన కలం నుండి రాలే ప్రతి అక్షరానికి కొత్త అర్ధం వస్తుంది. చాలా సరళమైన.. మనకు అర్ధమయ్యే భాషలోనే మనిషి విలువలు గురించి చెప్తాడు. అలా అని పేరాల పేరాలు డైలాగ్స్ ఉంటాయా అంటే తప్పే.. చాలా షార్ట్ అండ్…
థాయ్ ల్యాండ్ లో "పొన్నియిన్ సెల్వన్" మూవీ షూటింగ్
లెజండరీ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పీరియా డిక్ డ్రామా "పొన్నియన్ సెల్వన్ "మూవీ భారీ బడ్జెట్, భారీ తారాగణంతో రెండు భాగాలుగా రూపొందనుంది. తమిళ కింగ్ రాజ రాజ చోళన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందనున్న" పొన్నియన్ సెల్వన్ "మూవీ లో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, జయరామ్, మోహన్ బాబు, ఆది , ఐశ్వర్యారాయ్, కీర్తి సురేష్ ప్రధాన తారాగణం. కోలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు ముఖ్య పాత్రలలో నటించనున్నారు.
నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి
లెజండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ చిత్ర సీమ లో ప్రవేశించి ఈ రోజు తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. KA అబ్బాస్ దర్శకత్వంలో రూపొందిన సాత్ హిందూస్థానీ మూవీ తో అమితాబ్ బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. సాత్ హిందూస్థానీ మూవీ 1969 నవంబర్ 7 వ తేదీ రిలీజయింది. ఆ మూవీ తో మోస్ట్ ప్రామిసింగ్ న్యూ కమర్ గా అమితాబ్ నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సాత్ హిందూ స్థానీ మూవీ ఢిల్లీ లో రిలీజయిన కొన్ని నెలల తరువాత ముంబై లో రిలీజ్ కావడం విశేషం. సూపర్ హిట్ ఆనంద్ మూవీ తో అమితాబ్ ముంబై వాసులకు పరిచయమయ్యారు.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్
ఒక అరుంధతి చేయాలన్నా.. దేవసేన చేయాలన్నా.. రుద్రమదేవి చేయాలన్నా.. భాగమతి చేయలన్నా ఒకే ఒక్క హీరోయిన్ వల్ల అవుతుంది. ఆమె ఎవరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదనుకుంటా.. వన్ అండ్ ఓన్లీ అనుష్క. అందం, అభినయం ఉండి లక్ లేకపోయినా.. లక్ ఉండి మిగిలిన రెండూ లేకపోయినా కష్టమే.. కానీ అందం, అభినయం తో పాటు లక్ కూడా వున్న హీరోయిన్ అనుష్క. అయితే తొలినాళ్లలో అనుష్క కూడా పలు ప్లాప్స్ మూటగట్టుకుందనుకోండి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ స్టార్ హీరోయిన్ గా.. తన కోసం స్టోరీ లు రాసి సినిమా తీసే అంత స్థాయికి ఎదిగింది.
అల .. వైకుంఠ పురములో .. మలయాళ డబ్బింగ్ వెర్షన్ టైటిల్ రిలీజ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అల .. వైకుంఠ పురములో.. మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. అల్లుఅర్జున్ మూవీస్ మలయాళ డబ్బింగ్ వెర్షన్స్ కమర్షియల్ గా విజయం సాధిస్తాయి. కేరళ రాష్ట్రంలో అల్లుఅర్జున్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. అల .. వైకుంఠ పురములో . మూవీ లో థమన్S స్వరకల్పనలో రూపొందిన సామజవరగమన , రాములో రాములా సాంగ్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభించింది. రెండు సాంగ్స్ కలిపి 150 మిలియన్స్ వ్యూస్ సాధించాయి.
బాలీవుడ్ కామెడీ మూవీ లో రకుల్ ప్రీత్ సింగ్
తెలుగు, తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ వరుస తెలుగు, తమిళ, హిందీ మూవీస్ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ మూవీ యారియాన్ తో బాలీవుడ్ లో ప్రవేశించిన రకుల్ నటించిన దే దే ప్యార్ దే మూవీ ఘనవిజయం సాధించింది. రకుల్ హీరోయిన్ గా నటించిన మర్జవాన్ మూవీ నవంబర్ 8వ తేదీ రిలీజ్ కానుంది. బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా వెలుగొందుతున్న రకుల్ మరో బాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
యన్టీఆర్, సావిత్రి ‘మాతృదేవత’కు 50 ఏళ్ళు
“మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ.. త్యాగములో అనురాగములో తరగని పెన్నిధి మగువ...” అంటూ స్త్రీమూర్తి గొప్పతనాన్ని చాటిచెప్పిన చిత్రం ‘మాతృదేవత’. `మహానటి` సావిత్రి దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో మహానటుడు యన్.టి.రామారావు, మహానటి సావిత్రి జంటగా నటించారు. శోభన్‌బాబు, రేలంగి, నాగభూషణం, ప్రభాకర్ రెడ్డి, జగ్గారావు, రాజబాబు, చంద్రకళ, విజయలలిత, హేమలత, సురభి బాలసరస్వతి ముఖ్య భూమికలు పోషించారు.
వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ
ఠాగూర్ మధు నిర్మాణ సారథ్యం లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహరాజా రవితేజ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ #RT66 మూవీరూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అట్లీ దర్శకత్వంలో విజయ్ హీరో గా రూపొందిన బ్లాక్ బస్టర్ తెరి మూవీ కి రీమేక్ అని ఊహాగానాలు చెలరేగాయి. #RT66 మూవీ ఏ మూవీ కి రీమేక్ కాదని, వాస్తవ సంఘటనల ఆధారంగా #RT66 మూవీ రూపొందనుందని దర్శకుడు వెల్లడించారు. శృతి హాసన్ హీరోయిన్ గా ఎంపికయ్యారు. రవితేజ సూపర్ హిట్ మూవీ కిక్ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయమైన థమన్ S సంగీతం అందిస్తారు.

'నిశ్శబ్దం' టీజర్ కు సూపర్ రెస్పాన్స్
ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు కాకుండా తను చేసే ప్రతి సినిమాలో ఓ ప్రత్యేకత ఉండేలా.. విభిన్నంగా ఉండేలా చూసుకుంటుంది అనుష్క. అలా ఆలోచిస్తుంది కాబట్టే అరుంధతి, సైజ్ జీరో, బాహుబలి సిరీస్, భాగమతి లాంటి సినిమాలు తీసి అందరి ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు మరోసారి మరో ప్రయోగం చేయనుంది.
నాగార్జునతో `ఊపిరి` రచయిత చిత్రం?
‘ఊపిరి’... ‘కింగ్’ నాగార్జున కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రం. అటువంటి సినిమాకి రచయితగా పనిచేసిన అహిసోర్ సోల్‌మన్ డైరెక్షన్‌లో నాగ్ ఓ చిత్రం చేయబోతున్నట్లు టాలీవుడ్ టాక్.
బ్రోచేవారెవరురా మూవీ కన్నడ రీమేక్ లో రాజ్ తరుణ్
పక్కింటి అబ్బాయిగా సింపుల్ గా ఉండి రాజ్ తరుణ్ తనదైన ప్రత్యేక స్టైల్ లో ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావ, కిట్టు ఉన్నాడు జాగ్రత్త, రాజుగాడు వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. GR కృష్ణ దర్శకత్వం లో రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఇద్దరి లోకం ఒకటే మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతున్న ఒరేయ్ బుజ్జిగా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
మహేష్ తదుపరి చిత్రాన్ని నిర్మించనున్న ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్?
ఎ.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్... తెలుగునాట పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ని నిర్మిస్తోంది ఈ సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ . ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే... మహేష్‌తోనే మరో చిత్రాన్ని నిర్మించే అవకాశాన్ని దక్కించుకుందని టాక్.
విశాల్ సినిమాలో గౌతమి?
విశాల్ కథానాయకుడిగా మిస్కిన్ రూపొందించిన యాక్షన్ క్రైమ్ థిల్లర్ `తుప్పరివాలన్` (తెలుగులో ‘డిటెక్టివ్’). 2017లో విడుదలైన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ మంచి విజయాన్ని అందుకుంది. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత ఈ సినిమాకి సీక్వెల్ గా ‘తుప్పరివాలన్ 2’ను రూపొందిస్తున్నాడు దర్శకుడు మిస్కిన్. విశాల్ కి జంటగా ఆశ్య అనే నూతన కథానాయిక నటిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా బాణీలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్ లో జరుగుతోంది. 40 రోజుల పాటు అక్కడే చిత్రీకరణ సాగుతుందని సమాచారం.
'యాక్షన్' సినిమా - ఎటు నడుస్తున్నా.. ఏడ నిలుస్తున్నా' పాటకు గుడ్ రెస్పాన్స్
కోలీవుడ్ స్టార్ విశాల్, సీనియర్ డైరెక్టర్ సి.సుందర్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘యాక్షన్’. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని నవంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ట్రిడెంట్ ఆర్ట్స్ పతాకంపై ఆర్.రవీంద్రన్ నిర్మిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, హుషారు, రాజుగారి గది 3 వంటి సూపర్‌హిట్ చిత్రాలను డిస్ట్రిబ్యూట్ చేసిన శ్రీనివాస్ ఆదెపు నిర్మాతగా మారి శ్రీకార్తికేయ సినిమాస్ పతాకంపై ’యాక్షన్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

'భీష్మ' ఫస్ట్ గ్లిoప్స్ రిలీజ్
‘ఛలో’ ఫేమ్ వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా భీష్మ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశకు వచ్చింది. ఇక ఒక పక్క షూటింగ్ జరుపుకుంటూనే...మరోపక్క డబ్బింగ్ ను కూడా స్టార్ట్ చేసేసారు. ఇక ఈ రోజు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేస్తానని చెప్పిన నేపథ్యంలో.. చెప్పినట్టే ఉదయం 10 గంటలకు ఈ వీడియో ను రిలీజ్ చేశారు.
బాలకృష్ణ సినిమాలో బాలీవుడ్ ‘ఖల్ నాయక్’?
‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఈ ఏడాది డిసెంబర్ 20న ప్రారంభించి... 2020 మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే... యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
డిస్కో రాజా బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాబీ సింహా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.