
ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 22


ప్రభాస్ కి అతిథిగా కాజల్?

'వెంకీమామ' లో ఆ రెండూ ఉంటాయట

"ఇద్దరి లోకం ఒకటే" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో అఖిల్ కు అమ్మగా ఆమని

#NC 19 మూవీ టైటిల్ "లవ్ స్టోరీ "
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "
`వెంకీమామ`.. ఇక పాయల్ వంతు
రాశీఖన్నా, థమన్... బ్యాక్ టు బ్యాక్ మూవీస్

'మిస్ మ్యాచ్' కోసం 'వెంకీమామ'

ఏఎంబీ సినిమాస్ కు హ్యాపీ బర్త్ డే
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్
ఫైనల్లీ 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఫిక్స్

హైటెక్ సిటీలో 'వరల్డ్ ఫేమస్ లవర్'
వచ్చే ఏడాది వాలెంటైన్స్ డేకి `వరల్డ్ ఫేమస్ లవర్`గా పలకరించబోతున్నాడు విజయ్ దేవరకొండ. నాలుగు విభిన్న ప్రేమకథలతో రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్ కి జోడీగా రాశీఖన్నా, కేథరిన్ ట్రెసా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లి నాయికలుగా నటిస్తున్నారు. క్రాంతి మాధవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నాడు.

ప్రభాస్ కి అతిథిగా కాజల్?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన కనువిందు చేసిన కథానాయికల్లో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఒకరు. `డార్లింగ్` (2010), `మిస్టర్ పర్ ఫెక్ట్` (2011) వంటి బ్లాక్ బస్టర్స్ లో ఈ ఇద్దరి జోడీ మెప్పించింది. కట్ చేస్తే... తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత ప్రభాస్ సినిమాలో కాజల్ దర్శనమివ్వనుందట. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు. అతిథి పాత్రలో.

'వెంకీమామ' లో ఆ రెండూ ఉంటాయట
రియల్ లైఫ్ లో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్ లోనూ అవే పాత్రల్లో నటించిన చిత్రం `వెంకీమామ`. వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా కనువిందు చేయనున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించాడు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. వెంకీ బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.

"ఇద్దరి లోకం ఒకటే" మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై జి ఆర్ కృష్ణ దర్శకత్వంలో రాజ్ తరుణ్, షాలిని పాండే జంటగా రూపొందిన రొమాంటిక్ డ్రామా "ఇద్దరి లోకం ఒకటే " మూవీ డిసెంబర్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాజర్, మాస్టర్ భరత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు.
హీరో అఖిల్ కు అమ్మగా ఆమని
"జంబలకిడిపంబ ", "మిస్టర్ పెళ్ళాం " , "శుభలగ్నం " వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ ఆమని సక్సెస్ ఫుల్ మూవీ "సిసింద్రీ " లో అఖిల్ అక్కినేని కి అమ్మగా నటించారు. ఆ మూవీ లో నటించిన అఖిల్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. అప్పుడు అఖిల్ వయసు ఒక సంవత్సరం లోపే ఉండడం విశేషం.

#NC 19 మూవీ టైటిల్ "లవ్ స్టోరీ "
నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న #NC 19 మూవీ టైటిల్ ను "లవ్ స్టోరీ " గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
హాకీ ఛాంపియన్ పాత్రలో లావణ్య త్రిపాఠి
వెంకటాద్రి టాకీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం లో హాకీ నేపథ్యం లో "A 1 ఎక్స్ ప్రెస్ " మూవీ రూపొందుతుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న " A 1 ఎక్స్ ప్రెస్" మూవీ టాలీవుడ్ లో ఈ జానర్ లో మొదటి మూవీ. హీరో సందీప్ కిషన్ కూడా ఈ జానర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు.
స్టార్ రైటర్ కోన వెంకట్ మీడియా సమావేశంలో ...
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం " జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన "నిశ్శబ్ధం "మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు.
లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ
ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తాప్సీ పన్ను బ్లాక్ బస్టర్ మూవీ "చష్మే బద్దూర్ " మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయ్యారు. తెలుగు మూవీస్ కంటే హిందీ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న తాప్సీ నటించిన బేబీ, పింక్, నామ్ షబానా , సూర్మా, బద్లా , గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, శాండ్ కీ ఆంఖ్ మూవీస్ ఘనవిజయం సాధించాయి. బయోపిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న తాప్సీ మరో బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

#NANI 26 మూవీ టైటిల్ "టక్ జగదీష్ "
షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా #NANI 26 మూవీ గా రూపొందనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ ని "టక్ జగదీష్ " టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలు. సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మాణ సారథ్యం లో రూపొందనున్న "టక్ జగదీష్ " మూవీ కి థమన్ సంగీతం అందిస్తున్నారు.
`వెంకీమామ`.. ఇక పాయల్ వంతు
విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ `వెంకీమామ`. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్... డిసెంబర్ 13న వెంకీ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
రాశీఖన్నా, థమన్... బ్యాక్ టు బ్యాక్ మూవీస్
డిసెంబర్ 13, డిసెంబర్ 20... ఈ రెండు రోజులు అటు అందాల తార రాశీఖన్నాకి, ఇటు యువ సంగీత సంచలనం థమన్ కి ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే... ఈ రెండు తేదీల్లో వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. ఆ చిత్రాలే... `వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే`.
సోలో హీరోగా రవితేజ ఫస్ట్ మూవీ `నీ కోసం`కి 20 ఏళ్ళు
ఒకే చిత్రం ముగ్గురు ప్రముఖుల `తొలి అడుగు`లకు వేదికగా నిలవడం అరుదుగా జరుగుతుంది. అలాంటి సినిమాల్లో `నీ కోసం` ఒకటి. ఆ ముగ్గురు ప్రముఖులు మరెవరో కాదు... మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల, స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పీ పట్నాయక్.
నాగచైతన్య, శేఖర్ కమ్ముల చిత్రానికి రిలీజ్ డేట్ ఫిక్సయ్యిందా?
యువ సామ్రాట్ నాగచైతన్య, ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ఫిదా` బ్యూటీ సాయిపల్లవి నాయికగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్రస్తుతం మెరుపు వేగంతో చిత్రీకరణ జరుపుకుంంటోంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాని వేసవి కానుకగా ఏప్రిల్ 2న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది.
`ఫస్ట్ టైమ్ బర్త్ డే స్పెషల్స్` తో వస్తున్న స్టార్స్
`విచిత్ర కుటుంబం` (1969)... తెలుగునాట సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటంటే... లీడ్ రోల్ ప్లే చేసిన `స్టార్` బర్త్ డే స్పెషల్ గా సినిమా రిలీజ్ కావడం. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం మహానటుడు యన్టీఆర్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని... ఆపై లెజండరీ యాక్టర్స్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్స్ కొనసాగించారు. ఇప్పుడీ వరుసలోనే మరో ముగ్గురు స్టార్స్ చేరబోతున్నారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ, `సిసింద్రీ` అఖిల్.

'మిస్ మ్యాచ్' కోసం 'వెంకీమామ'
నిర్మల్ కుమార్ దర్శకత్వంలో ఆట గదరా శివ ఫేమ్ ఉదయ్ శంకర్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సినిమా 'మిస్ మ్యాచ్'. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని సిద్ధంగా వుంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ గా ఉంది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఏఎంబీ సినిమాస్ కు హ్యాపీ బర్త్ డే
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఏషియన్ సినిమాస్ భాగస్వామ్యంతో ఏఎంబీ సినిమాస్ మల్టీప్లెక్స్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మల్టీప్లెక్స్ ప్రారంభించి నేటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు ట్విట్టర్ వేదికగా ఏఎంబీ సినిమాస్ కు తొలి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. వెరీ హ్యాపీ బర్త్ డే ఏషియన్ సినిమాస్ అంటూ ట్వీట్ చేశారు. ఎంతో శ్రమించి ఏఎంబీ సినిమాస్ ను ఈ స్థాయికి తెచ్చిన ఏఎంబీ టీమ్ కు శుభాభినందనలు. ఏఎంబీ సినిమాస్ నేడు ఈ స్థాయిలో ఉందంటే అది మీ చలవే అంటూ స్పందించారు.
తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!
కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన 'గోపీచంద్' కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన 'చాణక్య' సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

#Nani26 రేపు రిలీజ్ చేయనున్న టైటిల్
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ V మూవీ. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. సుధీర్ బాబు , నివేత థామస్, అదితి రావు హైదరి ముఖ్య పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీన రిలీజ్ కానుంది.
ఫైనల్లీ 'వెంకీమామ' రిలీజ్ డేట్ ఫిక్స్
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా 'వెంకీమామ' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందు డిసెంబర్ లోనే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. దీనితో మామా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని కన్ఫ్యూజన్ కూడా అభిమానుల్లో నెలకొంది.