ప్ర‌భాస్ కి అతిథిగా కాజ‌ల్?

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ స‌ర‌స‌న క‌నువిందు చేసిన క‌థానాయిక‌ల్లో టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఒక‌రు. `డార్లింగ్` (2010), `మిస్ట‌ర్ ప‌ర్ ఫెక్ట్` (2011) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్స్ లో ఈ ఇద్ద‌రి జోడీ మెప్పించింది. క‌ట్ చేస్తే… తొమ్మిదేళ్ళ సుదీర్ఘ విరామం త‌రువాత ప్ర‌భాస్ సినిమాలో కాజ‌ల్ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. అయితే, ఈ సారి హీరోయిన్ గా కాదు. అతిథి పాత్ర‌లో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ఓ పిరియాడిక‌ల్ ల‌వ్ స్టోరీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `జిల్` రాధాకృష్ణ రూపొందిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తోంది. పున‌ర్జ‌న్మ‌ల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాలో ప్ర‌భాస్, పూజ‌… ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్నార‌ని టాక్. కాగా… ఈ చిత్రంలోనే కాజ‌ల్ అతిథి పాత్ర‌లో మెరుస్తుంద‌ని వినికిడి. ఇప్ప‌టికే ఈ మేర‌కు సంప్ర‌దింపులు కూడా జ‌రిగాయ‌ని తెలిసింది. ఏదేమైనా, కొద్ది రోజుల్లో కాజ‌ల్ ఎంట్రీపై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశ‌ముంది.

`జాన్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉన్న ఈ సినిమా… 2020 ద్వితీయార్ధంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.