బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా ‘వెంకీమామ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజ్ అయినా సాంగ్స్ , టీజర్ , స్టిల్స్ కు అభిమానులను నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. ముందు డిసెంబర్ లోనే రిలీజ్ అన్నారు. ఆ తర్వాత సంక్రాంతి అన్నారు. దీనితో మామా అల్లుళ్ళు ఎప్పుడు వస్తారా అని కన్ఫ్యూజన్ కూడా అభిమానుల్లో నెలకొంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ ను అధికారికంగా చిత్ర యూనిట్ ఖరారు చేసి అభిమానుల్లో నెలకొని ఉన్న సందేహాలకు తెరదించారు. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
కాగా ఈ సినిమాలో వెంకీ సరసన బోల్డ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నటిస్తుండగా.. నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సురేష్ బాబుతో కలిసి టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: