వెంకటాద్రి టాకీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై సందీప్ కిషన్ హీరోగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వం లో హాకీ నేపథ్యం లో “A 1 ఎక్స్ ప్రెస్ ” మూవీ రూపొందుతుంది. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, మురళీశర్మ, రఘు బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు, హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. హాకీ క్రీడా నేపథ్యంలో రూపొందుతున్న ” A 1 ఎక్స్ ప్రెస్” మూవీ టాలీవుడ్ లో ఈ జానర్ లో మొదటి మూవీ. హీరో సందీప్ కిషన్ కూడా ఈ జానర్ లో ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
” A 1 ఎక్స్ ప్రెస్” మూవీ లో లావణ్య త్రిపాఠి కథానాయిక. ఈ మూవీ లో హాకీ ఛాంపియన్ గా నటిస్తున్న లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ .. స్కూల్, కాలేజ్ డేస్ లో అనేక స్పోర్ట్స్ లో పాల్గొన్నానని, హాకీ స్టిక్ ను టచ్ చేయలేదని, ఫస్ట్ టైమ్ హాకీ ని ట్రై చేస్తున్నానని, హాకీ లో ట్రైనింగ్ కొరకు ఒక ప్రొఫెషనల్ కోచ్ ను మేకర్స్ నియమించారని, తనది ఈ మూవీ లో టామ్ బాయ్ క్యరెక్టర్ అని, హాకీ ప్లేయర్ గా నటిస్తున్నానని అమ్మకు చెప్పగా చాలా ఆనందపడ్డారని, ఛాలెంజింగ్ పాత్రలలో నటించాలనే తన కోరిక ను లావణ్య వెల్లడించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: