`ఫ‌స్ట్ టైమ్ బ‌ర్త్ డే స్పెష‌ల్స్` తో వ‌స్తున్న స్టార్స్

Rundown On Stars and Their Birthday Special Movies

`విచిత్ర కుటుంబం` (1969)… తెలుగునాట స‌రికొత్త సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టిన చిత్రం. ఇంత‌కీ ఆ సంప్ర‌దాయం ఏంటంటే… లీడ్ రోల్ ప్లే చేసిన `స్టార్` బ‌ర్త్ డే స్పెష‌ల్ గా సినిమా రిలీజ్ కావ‌డం. స‌రిగ్గా యాభై ఏళ్ళ క్రితం మ‌హాన‌టుడు య‌న్టీఆర్ మొద‌లుపెట్టిన ఈ సంప్ర‌దాయాన్ని… ఆపై లెజండ‌రీ యాక్ట‌ర్స్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, కృష్ణ‌, శోభ‌న్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున‌, యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్ వంటి స్టార్స్ కొన‌సాగించారు. ఇప్పుడీ వ‌రుస‌లోనే మ‌రో ముగ్గురు స్టార్స్ చేర‌బోతున్నారు. ఆ స్టార్స్ మ‌రెవ‌రో కాదు.. విక్ట‌రీ వెంక‌టేష్‌, మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, `సిసింద్రీ` అఖిల్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… 33 ఏళ్ళ న‌ట‌ప్ర‌స్థానంలో ఇప్ప‌టివ‌ర‌కు బ‌ర్త్ డే రిలీజ్ చూడ‌ని వెంకీ… ఫ‌స్ట్ టైమ్ `వెంకీమామ‌`తో స‌రిగ్గా త‌న పుట్టిన‌రోజున (డిసెంబ‌ర్ 13)న ఆ ముచ్చ‌ట‌ని తీర్చ‌బోతున్నారు. ఇక ర‌వితేజ విష‌యానికి వ‌స్తే… త‌న బ‌ర్త్ డే (జ‌న‌వ‌రి 26)కి రెండు రోజుల ముందు (జ‌న‌వ‌రి 24) `డిస్కో రాజా`తో సంద‌డి చేయ‌బోతున్నారు. హీరోగా ర‌వితేజ నుంచి వ‌స్తున్న ఫ‌స్ట్ బ‌ర్త్ డే స్పెష‌ల్ మూవీ ఇదే కావ‌డం విశేషం. అలాగే యంగ్ హీరో అఖిల్ కూడా త‌న నాలుగో చిత్రాన్ని బ‌ర్త్ డే స్పెష‌ల్ (ఏప్రిల్ 8)గా ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. ఈ `ఫ‌స్ట్ టైమ్‌` బ‌ర్త్ డే స్పెష‌ల్ మూవీస్… ఆ యా హీరోల‌కి కెరీర్ బెస్ట్ హిట్స్ అందివ్వాల‌ని ఆకాంక్షిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 2 =