#NC 19 మూవీ టైటిల్ “లవ్ స్టోరీ “

#NC19 Movie Titled Love Story

నేషనల్ అవార్డ్ గ్రహీత శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీ తరువాత హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఒక అందమైన ప్రేమకథను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై తెరకెక్కుతున్న #NC 19 మూవీ టైటిల్ ను “లవ్ స్టోరీ ” గా చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా రూపుదిద్దుకొంటున్న” లవ్ స్టోరీ ” మూవీ ఏప్రిల్ 2వ తేదీ రిలీజ్ కానుంది. తమ కలలు నెరవేర్చుకొనడానికి చిన్నటౌన్స్ నుండి సిటీ కి వచ్చిన యువతీ యువకుల నేపథ్యంలో ఈ మూవీ రూపొందుతుందని సమాచారం. తెలంగాణ యాసను నేర్చుకొనడానికి నాగచైతన్య చాలా హార్డ్ వర్క్ చేశారని దర్శకుడు తెలిపారు. నాగచైతన్య బర్త్ డే సందర్భంగా నాగచైతన్య లుక్, చిన్న వీడియో చిత్రయూనిట్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.” లవ్ స్టోరీ ” మూవీ కి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్, హీరో నాగ చైతన్య , సాయి పల్లవి ఫస్ట్ కాంబినేషన్, శేఖర్ కమ్ముల , సాయి పల్లవి సెకండ్ కాంబినేషన్, సూపర్ హిట్ మూవీ “మజిలీ ” తరువాత నాగచైతన్య నటించే చిత్రం కావడం తో ” లవ్ స్టోరీ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + fifteen =