తేజ కు గోపీచంద్ గ్రీన్ సిగ్నల్..!

Gopichand Gives Green Signal to Teja,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Gopichand Latest News,Gopichand New Movie News,Gopichand Next Film Updates,Gopichand Latest Movie Details,#Gopichand

కెరీర్ మొదట్లో వరుస విజయాలతో దూసుకుపోయిన ‘గోపీచంద్’ కు ఇప్పుడు కాలం కలిసి రావట్లేదు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నా సక్సెస్ మాత్రం దక్కట్లేదు. గతకొద్ది కాలంగా ప్లాప్స్ తప్పించి సక్సెస్ అనేది చూడలేదు. ఇటీవల వచ్చిన ‘చాణక్య’ సినిమా అన్న హిట్ అవుతుందనుకున్నాడు.. కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీనితో తన తర్వాత వచ్చే కథల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ నేపథ్యంలో తేజతో సినిమా చేయడానికి గోపీచంద్ రెడీ అవుతున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. గోపీచంద్ కోసం తేజ ఓ క‌థ సిద్ధం చేశాడ‌ట‌. ఒక విభిన్నమైన కథాంశాన్ని గోపిచంద్ కి వినిపించాడట. ఆ కథ బాగా నచ్చడంతో గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం. గతంలో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’ .. ‘నిజం’ సినిమాల్లో గోపీచంద్ విలన్ గా మాత్రమే చేశాడు. తేజతో హీరోగా గోపీచంద్ చేసే తొలి సినిమా ఇదే. వచ్చే ఏడాది ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్టు తెలుస్తుంది. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

మరి కెరీర్ మొదట్లో నిజంతో గోపీచంద్‌ని విల‌న్‌గా చూపించాడు తేజ‌. ఆ సినిమాతో గోపీచంద్ కు ఎంత పేరొచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఇప్పుడు మరోసారి గోపీచంద్ కు తేజ బ్రేక్ ఇస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 7 =