విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్ మూవీ `వెంకీమామ`. బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్… డిసెంబర్ 13న వెంకీ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… నాగచైతన్య బర్త్ డే (నవంబర్ 23) కి ఓ గ్లింప్స్, రాశీఖన్నా బర్త్ డే(నవంబర్ 30)కి ఓ గ్లింప్స్ రిలీజ్ చేసిన యూనిట్… ఈ పరంపరలోనే వెంకీకి జోడీగా నటించిన పాయల్ రాజ్ పుత్ కి సంబంధించిన క్యారెక్టర్ గ్లింప్స్ ని ఆమె పుట్టినరోజు (డిసెంబర్ 5)న విడుదల చేయడానికి ప్లాన్ చేసిందట. ఇక వెంకీ పుట్టినరోజున (డిసెంబర్ 13) ఎలాగూ సినిమానే థియేటర్లలోకి వస్తుండడం విశేషం.
ఆసక్తికరమైన విషయమేమిటంటే….`వెంకీమామ` లీడ్ స్టార్స్ నాగచైతన్య, రాశీఖన్నా, పాయల్ రాజ్ పుత్ మరియు వెంకటేష్ బర్త్ డే లు వరుస వారాల్లోనే (నవంబర్ 23, నవంబర్ 30, డిసెంబర్ 5, డిసెంబర్ 13 రావడం విశేషం. ఒక రకంగా ఇదో అరుదైన విషయమనే చెప్పాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: