ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 23

" నిశ్శబ్ధం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న ప్రముఖ రచయిత..?
'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
తనీష్ 'మహాప్రస్థానం'
గోదావరి నేపథ్యంలో నాని, శివ చిత్రం?
యాక్షన్ మోడ్ లో `క్రాక్`
`అర్జున్ సురవరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్
రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ`
తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య

కంగనా తో అసెంబ్లీకి వెళ్లనున్న ప్రకాష్ రాజ్..!

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
'అర్జున్ సురవరం' నిఖిల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
'శ్రీదేవి' జీవిత చరిత్ర పుస్తక ఆవిష్కరణ
బాల నటిగా సినీ రంగంలోకి ప్రవేశించి.. ఆ తర్వాత హీరోయిన్‌గా తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించి.. వెండి తెరపై తన అందం అభినయంతో కోట్లాది అభిమానులను సంపాదించుకున్న నటి శ్రీదేవి. వెండితెరపై ఎంతో మంది హీరోయిన్స్ వచ్చినా.. అతిలోకసుందరి అంటే అందరి మదిలో మెదిలే రూపం శ్రీదేవిదే. అంతేకాదు భారతీయ చిత్ర పరిశ్రమలో ఓ నటిగా చెరగని ముద్ర వేసింది శ్రీదేవి. ఆమె ఈ లోకాన్ని వీడి దాదాపు రెండేళ్లు కావొస్తోంది.
'సరిలేరు నీకెవ్వరు' ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తోన్న 26వ చిత్రం సరిలేరు నీకెవ్వరు సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వుంది. ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క వెంట వెంటనే అప్ డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్ లో ఇప్పటినుండే జోరు పెంచారు. ఇక ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేసిన చిత్ర బృందం.. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లిరికాల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. 'మైండ్ బ్లాక్' అంటూ వచ్చే పాటను రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

" నిశ్శబ్ధం "మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ " నిశ్శబ్ధం " 2020 సంవత్సరం జనవరి 31 వ తేదీ రిలీజ్ కానుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్,సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకొన్న హాలీవుడ్ క్రాస్ ఓవర్ మూవీ " నిశ్శబ్ధం "పలు భాషలలో రిలీజ్ కానుంది.

బయోపిక్ కు ప్లాన్ చేస్తున్న ప్రముఖ రచయిత..?
రామ్ గోపాల్ వర్మకు ప్రముఖ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ చిత్రంపై ఓ ఛానెల్‌లో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో జొన్నవిత్తుల కూడా పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఫోన్ కాల్ లో మాట్లాడుతూ వర్మ డిబేట్ మధ్యలోనే బ్రేక్ చెప్పి వెళ్లిపోవడంతో జొన్నవిత్తుల ఆగ్రహం చేశారు. ఆయనపై కొన్ని అనూహ్య కామెంట్లు చేశారు. మరి వర్మ సైలెంట్ గా ఉండడు కదా.. ఆయనపై కొన్ని కామెడీ ట్వీట్స్ చేశారు. ఇక అప్పటినుండి వీళ్లిద్దరి మధ్య వార్ నడుస్తూనే వుంది. అంతేకాదు అందరి బయోపిక్ లు తీస్తున్న వర్మ బయోపిక్ ను తాను తీస్తా అని చెప్పిన సంగతి…
'ప్రతిరోజూ పండగే' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ కు కూడా ముహూర్తం ఫిక్స్ చేశారు. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.
తనీష్ 'మహాప్రస్థానం'
చైల్డ్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించి ఆతర్వాత హీరోగా మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టిన నటుడు తనీష్. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అవేమీ పెద్దగా ఆడలేదని చెప్పొచ్చు. ఇక కొంతకాలం గ్యాప్ ఇచ్చి గత ఏడాది బిగ్ బాస్ షో లో కూడా పాల్గొని సందడి చేశాడు. ఇదిలా ఉండగా ఇప్పుడు మళ్ళీ ఓ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు తనీష్.

"రంగమార్తాండ " మూవీ లో నటుడు గా రాహుల్ సిప్లిగంజ్
సూపర్ హిట్ మూవీస్ ఈగ, రచ్చ, రంగస్థలం, కాంచన 3, RX 100, ఇస్మార్ట్ శంకర్ వంటి మూవీస్ లో తన సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఇప్పుడు నటుడిగా అలరించనున్నారు. బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 3 టైటిల్ గెలుచుకొన్న రాహుల్ సింగర్ గానూ, నటుడి గానూ పలు అవకాశాలను అందుకొంటున్నారు. ఇప్పుడు రాహుల్ "రంగమార్తాండ " మూవీ లో ఒక కీలక పాత్ర లో నటిస్తున్నట్టు సమాచారం.

" సామజవరగమన" సాంగ్ రికార్డ్
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా రూపొందుతున్న "అల .. వైకుంఠపురం లో .." మూవీ జనవరి 12 వ తేదీ రిలీజ్ కానుంది. టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందించారు . మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ మూడు సాంగ్స్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి.
గోదావరి నేపథ్యంలో నాని, శివ చిత్రం?
`నిన్ను కోరి` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తరువాత నేచురల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్ లో మరో సినిమా రానున్న సంగతి తెలిసిందే. `పెళ్ళి చూపులు` ఫేమ్ రీతూ వర్మ నాయికగా నటించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు.
యాక్షన్ మోడ్ లో `క్రాక్`
`బలుపు` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మాస్ మహారాజా రవితేజ, స్టన్నింగ్ బ్యూటీ శ్రుతి హాసన్, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని, యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `క్రాక్`. ప్రముఖ నిర్మాత `ఠాగూర్` మధు నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ తెరకెక్కుతోంది.
`అర్జున్ సురవరం`కి అచ్చొచ్చిన సెంటిమెంట్స్
ఫేక్ సర్టిఫికేట్ స్కామ్ నేపథ్యంలో తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ `అర్జున్ సురవరం`... శుక్రవారం (నవంబర్ 29) జనం ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ బ్లాక్ బస్టర్ `కణితన్` ఆధారంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా... పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు ఏడాదికిపైగా ఆలస్యంగా విడుదలకు నోచుకుంది. అయినప్పటికీ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా కావడంతో... `అర్జున్ సురవరం`కి సర్వత్రా మంచి స్పందన వచ్చింది. కొన్ని ఏరియాల్లో థియేటర్ల సంఖ్యను పెంచడం చూస్తే... ఈ సినిమాకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతుందన్న విషయం స్పష్టమవుతోంది.
రామానాయుడు స్టూడియోస్ లో `భీష్మ`
`ఛలో` వంటి సక్సెస్ ఫుల్ మూవీ తో దర్శకుడిగా తొలి అడుగులు వేసిన వెంకీ కుడుముల... స్వల్ప విరామం తరువాత తన రెండో చిత్రాన్ని `భీష్మ`గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. యువ కథానాయకుడు నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా నాయికగా నటిస్తోంది.
అల్లు అర్జున్, సుకుమార్ మూవీ ఫస్ట్, సెకండ్ షెడ్యూల్స్ అప్ డేట్
`ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ థ్రిల్లర్ లో బన్నీకి జోడీగా రష్మికా మందన్నా నటించనుండగా... హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
తెలంగాణ యువకుడి పాత్రలో నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగో క్రియేషన్స్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా ఒక అందమైన ప్రేమకథ #NC 19 గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో నాగచైతన్య, సాయి పల్లవి తెలంగాణ యువతీ యువకులు గా నటిస్తున్నారు. తమ కలలు నెరవేర్చుకొనడానికి చిన్న టౌన్స్ నుండి సిటీ కి వచ్చిన యువతీ యువకుల నేపథ్యంలో ఈ లవ్ స్టోరీ రూపొందుతుంది.
'సరిలేరు నీకెవ్వరు' నుండి రానున్న 'Mind Block'
'సరిలేరు నీకెవ్వరు' నుండి ప్రతి సోమవారం ఇక పాటను రిలీజ్ చేస్తూ మ్యూజికల్ ట్రీట్ ఇస్తామని చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చెప్పినట్టే ఈ రోజు ఈ సినిమా నుండి ఒక పాటను రిలీజ్ చేస్తున్నట్టు పోస్టర్ ద్వారా తెలిపారు. ఈ రోజున సాయంత్రం 5:04 నిమిషాలకి Mind Block .. అంటూ సాగే లిరికల్ సాంగ్ ను విడుదల చేయనున్నారు. ఇక ఈ పాట కోసం మహేష్ అభిమానులు ఇప్పటినుండే ఎదురుచూస్తున్నారు. మరి చూద్దాం దేవి తన మార్క్ చూపిస్తాడేమో...

కంగనా తో అసెంబ్లీకి వెళ్లనున్న ప్రకాష్ రాజ్..!
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

" నిశ్శబ్ధం" మూవీ లో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వికాస్
కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్ర లో సస్పెన్స్ థ్రిల్లర్ "నిశ్శబ్ధం" మూవీ రూపొందింది. మాధవన్, అంజలి, షాలిని పాండే, మైఖేల్ మ్యాడ్సన్, సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటించారు. అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ సాక్షి, మాధవన్ సంగీత కళాకారుడు ఆంథోనీ, మైఖేల్ మ్యాడ్సన్ సియోటెల్ పోలీస్ డిపార్ట్ మెంట్ కాప్ రిచర్డ్ డికెన్స్ , అంజలి క్రైమ్ డిటెక్టివ్ మహ, సుబ్బరాజు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ వికాస్ పాత్రలలో నటించారు.

యు.ఎస్. నేపథ్యంలో బాలకృష్ణ, బోయపాటి ఫిల్మ్?
`సింహా`, `లెజెండ్` తరువాత నటసింహ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మరో మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ నెలలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రథమార్ధంలో పూజా కార్యక్రమాలు జరిపి... నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్.

పునర్జన్మల నేపథ్యంలో ప్రభాస్ చిత్రం?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఓ పిరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి `జిల్` రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ... ఇప్పటికే కొంతమేర షూటింగ్ జరుపుకుంది. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.
'అర్జున్ సురవరం' నిఖిల్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్
మొత్తానికి లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వస్తా అన్న రేంజ్ లో ఫైనల్ థియేటర్స్ కు వచ్చి మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాడు నిఖిల్ 'అర్జున్ సురవరం' తో. విడుదలకు ఎన్నో ఇబ్బందుల పై ఫైనల్ గా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక మొదటిరోజే ఈ సినిమా మంచి టాక్ ను తెచ్చుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా పరవాలేదనిపించింది. మొదటిరోజే 4.1కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటిరోజే మంచి షేర్స్ అందుకున్నాడు. ఇక వీకెండ్ కాబట్టి ఈ రెండు రోజుల్లో మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం వుంది.