ట్యాగ్ · 2027 కథనాలు · పేజీ 21
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?
అనుష్క కి జనవరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
ఒక్కరోజు మాత్రమే ఆలస్యం - కిక్ లో తేడా లేదు

'తలైవి' లో శోభన్ బాబు పాత్రలో..?

వర్మ 'బ్యూటిఫుల్' కు సెన్సార్ పూర్తి

‘రొమాంటిక్’ లో రామ్..!

మోస్ట్ స్టైలిష్ హీరో విజయ్ దేవరకొండ.. !

'ప్రతి రోజూ పండగే' ట్రైలర్ రిలీజ్

రజినీ సినిమాలో నెగెటివ్ పాత్రలో..?
"తలైవి " మూవీ లో శశికళ పాత్రలో ప్రియమణి

థమన్ మాటలు కాన్ఫిడెన్స్ ను పెంచాయి..!
టాలీవుడ్ లో బిజీగా మారుతున్న ఐశ్వర్య రాజేష్
బాలీవుడ్ లో రీమేక్ కు బెల్లంకొండ సినిమా..!
యాసిడ్ ఎటాక్ నేపథ్యంలో 'అశ్వథ్థామ'?

విజయ్ దేవరకొండతో కియారా అద్వాని?
మళ్ళీ దసరాకే రానున్న చిరు?
ఈ ఏడాది దసరా సీజన్ లో `సైరా నరసింహారెడ్డి` అంటూ పలకరించిన మెగాస్టార్ చిరంజీవి... వచ్చే సంవత్సరం కూడా విజయదశమి బరిలోనే వినోదాలు పంచబోతున్నారట.
ఆ రీమేక్ ని వదిలేసిన వెంకీ?
విక్టరీ వెంకటేష్ తాజా చిత్రం `వెంకీమామ`... తన బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తరువాత తమిళ బ్లాక్ బస్టర్ `అసురన్` రీమేక్ లో నటించబోతున్నారు ఈ సీనియర్ హీరో. ఇందులో రెండు ఛాయలున్న పాత్రలో కనిపించబోతున్నారు వెంకీ. శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్... జనవరిలో సెట్స్ పైకి వెళ్ళనుంది. ఆ తరువాత యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కాంబోలో హార్స్ రేస్ క్లబ్ నేపథ్యంలో వెంకీ ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తారని టాక్.
అనుష్క కి జనవరి సెంటిమెంట్ రిపీట్ అవుతుందా?
`అరుంధతి`తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కి శ్రీకారం చుట్టింది అనుష్క. మొదటి ప్రయత్నంలోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కూడా. ఆపై`పంచాక్షరి, వర్ణ, రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి` వంటి నాయికా ప్రాధాన్య చిత్రాలతో పలకరించిన స్వీటీకి... వీటిలో `భాగమతి` మినహా మరే సినిమా విజయాన్ని ఇవ్వలేకపోయింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే... `అరుంధతి`, `భాగమతి`... ఈ రెండు చిత్రాలు కూడా వేర్వేరు సంవత్సరాల్లో జనవరి నెలలోనే రిలీజయ్యాయి.
మరో పాట పాడిన రాశీఖన్నా
రాశీఖన్నా... మంచి నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. `జోరు`, `విలన్`(మలయాళం)... ఇలా తను నటించిన సినిమాలకే కాదు... `బాలకృష్ణుడు`, `జవాన్` వంటి తను నటించని సినిమాలకు కూడా పాటలు పాడింది రాశి. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత రాశి మళ్ళీ గాత్రం సవరించుకుంది. తను నాయికగా నటించిన `ప్రతి రోజూ పండగే` కోసం ఓ హుషారైన పాట పాడిందట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయనిగా మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్. త్వరలోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని వినికిడి.
ఒక్కరోజు మాత్రమే ఆలస్యం - కిక్ లో తేడా లేదు
శేఖర్ రెడ్డి దర్శకత్వంలో కార్తికేయ హీరోగా తెరకెక్కిన సినిమా '90ML'. ఈ సినిమా రిలీజ్ ఒక రోజుకు వాయిదా పడింది. నిజానికి ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన రిలీజ్ కావాల్సి వుంది. నిన్న సెన్సార్ క్లియరెన్స్ చేయకపోవడంతో వాయిదా పడింది. ఈ రోజు సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వడంతో శుక్రవారానికి మార్చారు.ఇక ఈ విషయాన్ని కార్తికేయ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు.

'తలైవి' లో శోభన్ బాబు పాత్రలో..?
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో జయలలిత పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగన రనౌత్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

వర్మ 'బ్యూటిఫుల్' కు సెన్సార్ పూర్తి
రామ్ గోపాల్ వర్మ శిష్యుడు అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా బ్యూటిఫుల్. టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై బ్యూటిఫుల్ అనే సినిమా తెరకెక్కుతుంది. నైనా కథానాయికగా, సూరి కధానాయకుడిగా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ కి, మొదటి సింగల్ కి విశేషమైన స్పందన లభించిన సంగతి తెలిసిందే.

‘రొమాంటిక్’ లో రామ్..!
అనిల్ పాడూరి దర్శకత్వంలో పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా తెరకెక్కుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'రొమాంటిక్'. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక గతకొద్ది కాలంగా ఈ సినిమా గోవా లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇటీవలే ఈ షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. 30 రోజుల పాటు జరిగిన ఈ లెంగ్తీ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలు, యాక్షన్ సీన్స్, పూరి మార్క్ బీచ్ సాంగ్ ను షూట్ చేశారు.

మోస్ట్ స్టైలిష్ హీరో విజయ్ దేవరకొండ.. !
'అర్జున్ రెడ్డి' సినిమాతో అటు తెలుగు ప్రేక్షకులతో పాటు సౌత్ లోనూ.. నార్త్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్ రెడ్డి అదే విజయ్ దేవరకొండ. ఈ ఒక్క సినిమా విజయ్ సినీ కెరీర్ నే మార్చేసింది. ఇక మన యంగ్ హీరోకు అభిమానులు కూడా అదే రేంజ్ లో పెరిగారు. కేవలం సామాన్యులే కాదు టాప్ హీరోయిన్ లు కూడా విజయ్ స్టైల్ కు ఫిదా అయిపోతున్నారు. రోజు రోజుకి విజయ్ కు ఫిదా అయిపోతున్న సెలబ్రిటీస్ కౌంట్ పెరిగిపోతోందే తప్పా... తగ్గడంలేదు.

'ప్రతి రోజూ పండగే' ట్రైలర్ రిలీజ్
మారుతి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా సాయి తేజ్ హీరోగా వస్తున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది. ఇక ఈ సినిమా నుండి ఇప్పటికే టీజర్ ను, పాటలు రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

రజినీ సినిమాలో నెగెటివ్ పాత్రలో..?
వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. 2018లో 'కాలా', '2.0' చిత్రాలతో చేయగా.. ఇక ఈ ఏడాది ‘పేట’ సినిమాతో వచ్చారు. ఇక 2020లో రెండు సినిమాలతో అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎ.ఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘దర్బార్’లో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ 2020 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్.
'వెంకీమామ' నుండి 'కోకో కోలా పెప్సీ' పాట రిలీజ్
రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత 'వెంకీమామ' చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. వెంకటేష్ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 13న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ వేడుకకు తేదీ సహా వెన్యూ ఫిక్సయ్యింది. తాజా సమాచారం ప్రకారం ఖమ్మం లేక్ వ్యూ క్లబ్ వేదికగా డిసెంబర్ 7 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది.
"తలైవి " మూవీ లో శశికళ పాత్రలో ప్రియమణి
2003 సంవత్సరంలో "ఎవరే అతగాడు " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన ప్రియమణి తెలుగు, తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషల చిత్రాలలో నటించారు. "పరుత్తివీరన్ " తమిళ మూవీ లో పెర్ఫార్మెన్స్ కు ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు హిట్ చిత్రాలలో నటించిన ప్రియమణి తెలుగులో నటించిన ఆఖరి మూవీ "మన ఊరి రామాయణం" . తరువాత వివాహం చేసుకొని సినిమాలకు దూరమయ్యారు. "ది ఫ్యామిలీ మాన్ " వెబ్ సిరీస్ తో ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. కొన్ని ఆసక్తికర మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

థమన్ మాటలు కాన్ఫిడెన్స్ ను పెంచాయి..!
బాబి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, నాగచైతన్య మల్టీస్టారర్ గా వస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వెంకీమామ’. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాను థమన్ చూసినట్టు తెలిపారు డైరెక్టర్ బాబి. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు..
జపనీస్ భాషలో "మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ " మూవీ
దర్శకుడు క్రిష్, కంగనా రనౌత్ దర్శకత్వంలో భారత వీరనారి ఝాన్సీ లక్ష్మీ బాయ్ జీవిత చరిత్ర ఆధారంగా జీ స్టూడియోస్, కైరోస్ కంటెంట్ స్టూడియోస్ బ్యానర్స్ పై రూపొందిన పీరియాడిక్ డ్రామా "మణికర్ణిక:ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ " హిందీ మూవీ విజయం సాధించిన విషయం తెలిసిందే. స్టార్ రైటర్ కె వి విజయేంద్ర ప్రసాద్ ఈ మూవీ కి స్క్రీన్ ప్లే అందించారు.
ఓ దేవుడా ఫైనల్లీ డేట్ ఫిక్స్ చేశావ్ - 'వెంకీ'మామ కామెడీ
ఎన్నో కన్ఫ్యూజన్ ల తర్వాత ఫైనల్ గా రెండు రోజుల క్రితం వెంకీమామ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 13వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ సినిమాను ఇంత త్వరగా రిలీజ్ చేస్తారని ఊహించని ఫ్యాన్స్.. ఇంత తొందరగా మామాఅల్లుళ్లు సందడి చేయడానికి వస్తుండటంతో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ కు ఇంకా పదిరోజులు కూడా లేకపోవడంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచింది. ఈ నేపథ్యంలో నిన్న ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు చిత్రబృందం.
టాలీవుడ్ లో బిజీగా మారుతున్న ఐశ్వర్య రాజేష్
ఓల్డ్ హీరో రాజేష్ తనయ, ప్రముఖ కమెడియన్ శ్రీలక్ష్మి మేనకోడలు ఐశ్వర్య రాజేష్ 10 సంవత్సరాలుగా కోలీవుడ్ లో 30 పైగా మూవీస్ లో నటించారు. స్పోర్ట్స్ డ్రామా "కనా " తమిళ మూవీ తెలుగు రీమేక్ "కౌసల్య కృష్ణమూర్తి " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించిన "మిస్ మ్యాచ్ " మూవీ డిసెంబర్ 6వ తేదీ రిలీజ్ కానుంది.
బాలీవుడ్ లో రీమేక్ కు బెల్లంకొండ సినిమా..!
ఈ రోజుల్లో సినిమాకు భాషా హద్దులు చెరిగిపోయానని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏదైన సినిమా రిలీజ్ అయి హిట్ అయితే చాలు వెంటనే రైట్స్ కొనేస్తున్నారు.. వేరే భాషలో రీమేక్ చేస్తున్నారు. ఇప్పటికే చాలా సినిమాలు రీమేక్ అయ్యాయి. ముఖ్యంగా మన సౌత్ సినిమాలకు బాలీవుడ్ లో బాగా డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అర్జున్ రెడ్డి ని 'కబీర్ సింగ్' పేరుతో రీమేక్ చేసి షాహిద్ కపూర్ హిట్ కొట్టి మళ్ళీ రీమేక్ నే నమ్ముకున్నాడు. ఈసారి 'జెర్సీ' సినిమా రీమేక్ లో నటిస్తున్నాడు. ఇక షారుఖ్ కూడా రీమేక్ నే నమ్ముకున్నాడు. వీరితో పాటు పలువురు హీరోలు రీమేక్ లనే నమ్ముకున్నారు.
యాసిడ్ ఎటాక్ నేపథ్యంలో 'అశ్వథ్థామ'?
`ఛలో`, `@ నర్తనశాల` తరువాత సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ లో యంగ్ హీరో నాగశౌర్య నటిస్తున్న చిత్రం `అశ్వథ్థామ`. నాగశౌర్యకి జోడీగా మెహరీన్ నటిస్తున్న ఈ సినిమా ద్వారా రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. `ఛలో`, `@ నర్తనశాల` తరహాలో ఎంటర్ టైన్ మెంట్ బేస్డ్ ఫిల్మ్ గా కాకుండా... ఓ సీరియస్ సోషల్ ఇష్యూని బేస్ చేసుకుని మెసేజ్ ఓరియెంటెడ్ ఫిల్మ్ గా `అశ్వథ్థామ`ని నిర్మిస్తున్నారని సమాచారం.

విజయ్ దేవరకొండతో కియారా అద్వాని?
యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, ఇస్మార్ట్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్ లో `ఫైటర్` అనే చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో విజయ్... బాక్సర్ గా కనిపించనున్నాడని టాక్. అంతేకాదు... యూనివర్సల్ అప్పీల్ ఉన్న సబ్జెక్ట్ కావడంతో పాన్ - ఇండియా ప్రాజెక్ట్ గా దీన్ని నిర్మించాలని పూరి అండ్ టీమ్ ప్లాన్ చేస్తోందట.