రియల్ లైఫ్ లో మేనమామ, మేనల్లుడు అయిన విక్టరీ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య రీల్ లైఫ్ లోనూ అవే పాత్రల్లో నటించిన చిత్రం `వెంకీమామ`. వెంకీకి జోడీగా పాయల్ రాజ్ పుత్, చైతూకి జంటగా రాశీఖన్నా కనువిందు చేయనున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహించాడు. డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. వెంకీ బర్త్ డే స్పెషల్ గా డిసెంబర్ 13న ఈ క్రేజీ ప్రాజెక్ట్ తెరపైకి రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `వెంకీమామ` ప్రధానంగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయినా… ఇందులో ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ రెండూ మిక్స్ అయి ఉంటాయట. అంతేకాదు… ఈ సినిమాకి కథ ప్రధాన బలంగా నిలుస్తుందని… వెంకీ, చైతూ మధ్య సాగే సన్నివేశాల్లో కొన్ని నవ్విస్తే… మరికొన్ని కంటతడి పెట్టిస్తాయని సమాచారం. మరి… ఎంటర్ టైన్ మెంట్, ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేస్తూ తెరకెక్కిన `వెంకీమామ`… బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: