లెజెండరీ క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

Versatile Actress Taapsee Plays Legendary Cricketer Mithali Raj In Her Biopic Movie

ఝుమ్మంది నాదం మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన తాప్సీ పన్ను బ్లాక్ బస్టర్ మూవీ “చష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ కు ఎంటరయ్యారు. తెలుగు మూవీస్ కంటే హిందీ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు. ఛాలెంజింగ్ పాత్రలలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు పొందుతున్న తాప్సీ నటించిన బేబీ, పింక్, నామ్ షబానా , సూర్మా, బద్లా , గేమ్ ఓవర్, మిషన్ మంగళ్, శాండ్ కీ ఆంఖ్ మూవీస్ ఘనవిజయం
సాధించాయి. బయోపిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్న తాప్సీ మరో బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రికెటర్, ఉమెన్స్ నేషనల్ క్రికెట్ టీమ్ మాజీకెప్టెన్, ఇంటర్ నేషనల్ క్రికెట్ లో 20 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొన్న ప్రథమ మహిళ మిథాలీ రాజ్ జీవిత చరిత్ర ఆధారంగా “శభాష్ మిథు ” టైటిల్ తో మిథాలీ రాజ్ బయోపిక్ మూవీ తెరకెక్కనుంది. వయాకామ్ 18 స్టూడియోస్ బ్యానర్ పై రాహుల్ ధోలాకియా దర్శకత్వంలో తాప్సీ పన్ను , మిథాలీ రాజ్ పాత్రలో “శభాష్ మిథు ” మూవీ రూపొందనుంది. తాప్సీ సినీ కెరీర్ లో
ఈ మూవీ మరో మైలు రాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.