సోలో హీరోగా ర‌వితేజ ఫ‌స్ట్ మూవీ `నీ కోసం`కి 20 ఏళ్ళు

Ravi Teja First Solo Hero Movie Nee Kosam Completes 20 Years

ఒకే చిత్రం ముగ్గురు ప్ర‌ముఖుల `తొలి అడుగు`ల‌కు వేదిక‌గా నిల‌వ‌డం అరుదుగా జ‌రుగుతుంది. అలాంటి సినిమాల్లో `నీ కోసం` ఒక‌టి. ఆ ముగ్గురు ప్ర‌ముఖులు మ‌రెవ‌రో కాదు… మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, స్టార్ డైరెక్ట‌ర్ శ్రీ‌ను వైట్ల‌, స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆర్పీ ప‌ట్నాయ‌క్.

అప్ప‌టివ‌ర‌కు చిన్న చిన్న పాత్ర‌ల‌తో, క్యారెక్ట‌ర్ రోల్స్ తో, సెకండ్ హీరోగానూ ప‌లు చిత్రాలు చేసిన ర‌వితేజ‌కి `నీ కోసం` సోలో హీరోగా ఫ‌స్ట్ ఫిల్మ్ కాగా… శ్రీ‌ను వైట్ల‌కి ద‌ర్శ‌కుడిగా ఇదే మొద‌టి ప్ర‌య‌త్నం. ఇక స్వ‌ర‌క‌ర్త ఆర్పీ ప‌ట్నాయ‌క్ కి తెలుగునాట ఇదే తొలి చిత్రం.

ప‌లు మార్లు వాయిదాలు ప‌డి… ఎట్ట‌కేల‌కు 1999 డిసెంబ‌ర్ 3న విడుద‌లైన ఈ రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్… ఆ ముగ్గురికీ మంచి బ్రేక్ ని అందించింది. అలాగే ఐదు `నంది` పుర‌స్కారాలు (ద్వితీయ ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ న‌టి (మ‌హేశ్వ‌రి), ఉత్త‌మ నూత‌న ద‌ర్శ‌కుడు (శ్రీ‌ను వైట్ల‌), ఉత్త‌మ స్క్రీన్ ప్లే (శ్రీ‌ను వైట్ల‌), స్పెష‌ల్ జ్యూరీ (ర‌వితేజ‌)) సొంతం చేసుకుంది. ఇలా… ప‌లువురికి మెమ‌ర‌బుల్ ఫిల్మ్ గా నిల‌చిన `నీ కోసం`… నేటితో 20 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here