
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 34


చిన్నప్పటి కలనెరవేరింది - రాశీఖన్నా

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!

రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసిన 'గని'

'భీమ్లా నాయక్' కోసం రెండు రిలీజ్ డేట్లు..!

బేబీ బంప్ తో అనుపమ పరమేశ్వరన్

"#NBK107" మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్

'ఎఫ్ 3' కి లైన్ క్లియర్.. చెప్పిన డేట్ కే రిలీజ్..!

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా

ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'ఆర్ఆర్ఆర్'

'పక్కా కమర్షియల్' ఫస్ట్ సింగిల్ ప్రోమో

బాలీవుడ్ లో సౌత్ మూవీస్ రీమేక్స్ హవా

సుదీప్ "K 3 కోటికొక్కడు" మూవీ రిలీజ్ డేట్

సినిమాలలో డ్యాన్స్ చేయడం ఇబ్బంది - నిత్యామీనన్

హీరో ప్రభాస్ కు శృతి హాసన్ థ్యాంక్స్

'దసరా'.. డీగ్లామర్ గా నాని, కీర్తిసురేష్..!

నిఖిల్ "18 పేజెస్"మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై సక్సెస్ ఫుల్ "కుమారి 21 ఎఫ్ "మూవీ ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ జంటగా రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ “18 పేజెస్ ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి డైరెక్టర్ సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. గోపీసుందర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

చిన్నప్పటి కలనెరవేరింది - రాశీఖన్నా
సూపర్ హిట్ “మద్రాస్ కేఫ్ ” మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు . పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్యూ”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు 4 తమిళ , “భ్రమమ్ ” మలయాళ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.సిద్దార్ధ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ “యోధ”లో రాశీఖన్నా నటిస్తున్నారు. అజయ్ దేవగన్ తో “రుద్ర “, “ఫ్యామిలీ మెన్ “వెబ్ సిరీస్ ఫేమ్ రాజ్ ,డి కె తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ “బ్లెస్సింగ్ “లో రాశీఖన్నా…

అల్లరి నరేష్ కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం..!
అల్లరి నరేష్ కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చేశాడు. రొటీన్ కథలను పక్కన పెట్టి కాస్త డిఫెరెంట్ గా చేయడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పటికే నాంది లాంటి డిఫరెంట్ స్టోరీతో వచ్చి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్నాడు. ప్రస్తుతం మల్లంపాటి సతీష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ సభకు నమస్కారం అనే సినిమా చేస్తున్నాడు. ఈస్ట్ కోస్ట్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి సంభాషణలు సమకూరుస్తున్నాడు.

రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసిన 'గని'
ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. పరిస్థితులు బాలేకపోవడంతో ముందుగానే రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు రిలీజ్ డేట్లను బుక్ చేసుకొని అందులో మార్చి 25వ తేదీని కన్ఫామ్ చేసుకుంది. ఇక భీమ్లానాయక్ కూడా రెండు రిలీజ్ డేట్లనే ఆప్షన్ లో పెట్టుకుంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న తమ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో సినిమా చేరింది.

"సిఎస్ఐ సనాతన్ "మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
యంగ్ హీరో ఆది సాయికుమార్ పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆది హీరోగా తెలుగు , తమిళ భాషల “జంగిల్ “, “కిరాతక” , “బ్లాక్”, “అమరన్ “, “తీస్ మార్ ఖాన్ “, ‘సీఎస్‌ఐ సనాతన్” మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి.చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్ పై శివ శంకర్ దేవ్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ , మిషా నారంగ్ జంటగా క్రైమ్ బ్యాక్ డ్రాప్‌లో ఒక మూవీ తెరకెక్కుతుంది. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా ఆదిసాయికుమార్ నటిస్తున్న ఈ మూవీ టైటిల్ ను ‘సీఎస్‌ఐ సనాతన్”గా దర్శకుడు అనిల్ రావిపూడి లాంచ్ చేసిన విషయం తెలిసిందే.

'భీమ్లా నాయక్' కోసం రెండు రిలీజ్ డేట్లు..!
పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా భీమ్లానాయక్. ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి మొదట రిలీజ్ అయిన పవన్ ఇంట్రడక్షన్ వీడియోతోనే సినిమాపై క్రేజ్ ను అమాంతం పెంచేశారు. దానికి తోడు టీజర్, పాటలు కూడా ఆకట్టుకోవడంతో ఈసినిమా కోసం అటు పవన్ అభిమానులు.. ఇటు రానా అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

బేబీ బంప్ తో అనుపమ పరమేశ్వరన్
సూపర్ హిట్ “అ ఆ “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన టాలెంటెడ్ యాక్ట్రెస్ అనుపమ పరమేశ్వరన్ “ప్రేమమ్ “, “శతమానం భవతి “, “హలో గురు ప్రేమ కోసమే “, “రాక్షసుడు “వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. అనుపమ ప్రస్తుతం ”తళ్ళిపోగాదే ”, “తలై నగరం 2” తమిళ మూవీస్ తో పాటు నిఖిల్ హీరోగా రూపొందుతున్న “18 పేజెస్ ”, “కార్తికేయ ”మూవీ సీక్వెల్ “కార్తికేయ 2 ” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

ఒరిజినల్ రిలీజ్ డేట్ కే ఫిక్స్ అవుతున్న 'కె.జి.యఫ్ 2'..?
కె.జి.యఫ్ 2.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ చేయలేకపోయారు. గత ఏడాది సమ్మర్ లో కావాల్సింది. ఇప్పటివరకూ పెండింగ్ లో పడిపోయింది. మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ వేరే సినిమాతో బిజీ అయిపోవడంతో సినిమా ప్రమోషన్స్ కూడా దాదాపు ఆపేశారు. ఈ సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ వచ్చి కూడా చాలా కాలం అయింది. గత ఏడాది టీజర్ రిలీజ్ చేశారు.. ఆ తరువాత సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీ నటుల పోస్టర్లు రిలీజ్ చేశారు తప్పా మరే అప్ డేట్ లేదు.

"సర్కారు వారి పాట"న్యూ రిలీజ్ డేట్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

"#NBK107" మూవీ రెగ్యులర్ షూటింగ్ డేట్
బ్లాక్ బస్టర్ "అఖండ"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న హీరో బాలకృష్ణ మరో మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు గొపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK107 మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వివివినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , కన్నడ నటుడు దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

'ఎఫ్ 3' కి లైన్ క్లియర్.. చెప్పిన డేట్ కే రిలీజ్..!
మొత్తానికి సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ వరుసపెట్టి రిలీజ్ కు రెడీ అయ్యాయి. నిర్మాతలందరూ చర్చలు జరుపుకొని ఫైనల్ గా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట ఫైనల్ రిలీజ్ డేట్లు ప్రకటించగా.. భీమ్లానాయక్ మాత్రం రెండు రిలీజ్ డేట్లను ఆప్షన్ లో పెట్టుకుంది. ఇక తాాజాగా ఎఫ్ 3 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.

'ఆర్ఆర్ఆర్' కోసం 'ఆచార్య' వాయిదా
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ఆచార్య. చిరంజీవి అలానే తనయుడు రామ్ చరణ్ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఈసినిమాపై అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈసినిమా కూడా ఎప్పటినుండో రిలీజ్ కు సిద్దంగా ఉంది. అయితే ఏప్రిల్ 1న రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నట్టు అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫైనల్ గా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'ఆర్ఆర్ఆర్'
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల పెద్ద పెద్ద సినిమాలు అన్నీ దాదాపు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు మేకర్స్ రిలీజ్ ప్లాన్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవ్వాల్సింది. అయితే పాన్ ఇండియా సినిమా.. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అన్నీ ఆలోచించుకొని రిలీజ్ చేసుకోవాలి. అందుకే కొన్ని చోట్ల థియేటర్లు మూసేయడం.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం అని భావించి వాయిదా వేశారు. అయితే ఆతరువాత ఆర్ఆర్ఆర్ టీమ్ రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్…

'పక్కా కమర్షియల్' ఫస్ట్ సింగిల్ ప్రోమో
యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న సినిమా పక్కా కమర్షియల్.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటివరకూ పలు పోస్టర్లు, ఇంట్రడక్షన్ వీడియోలు రిలీజ్ చేయగా అవి బాాాగానే ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు త్వరలో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉండటంతో చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసేస్తున్నారు.

బాలీవుడ్ లో సౌత్ మూవీస్ రీమేక్స్ హవా
సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి " మూవీ ని షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ "కబీర్ సింగ్ "గా హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ దర్శక , నిర్మాతలు సౌత్ మూవీస్ హిందీ రీమేక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. తెలుగు తో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషల మూవీస్ సుమారు 25 సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కావడం విశేషం.

సుదీప్ "K 3 కోటికొక్కడు" మూవీ రిలీజ్ డేట్
కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . బ్లాక్ బస్టర్ "ఈగ " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుదీప్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. "సైరా నరసింహా రెడ్డి "మూవీ లో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ , మడోన్నా సెబాస్టియన్ జంటగా తెరకెక్కిన మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ "K 3"కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది.

సినిమాలలో డ్యాన్స్ చేయడం ఇబ్బంది - నిత్యామీనన్
మలయాళ , తెలుగు , తమిళ , కన్నడ భాషలలో సుమారు 50 సినిమాలలో నటించిన యాక్ట్రెస్ , సింగర్ నిత్యామీనన్ 8 సంవత్సరాల వయసు లో ఒక ఇంగ్లీష్ మూవీ లో నటించారు. “ఆకాశగోపురం ” తో మలయాళ , “అలామొదలైంది “తో తెలుగు , “నూటరెంబదు “తో తమిళ చిత్ర పరిశ్రమలకు కథానాయికగా పరిచయం అయ్యారు. ” 7 O’ Clock”మూవీ లో సపోర్టింగ్ రోల్ తో నిత్యామీనన్ కన్నడ చిత్ర పరిశ్రమకు , “మిషన్ మంగళ్ ” మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు.

హీరో ప్రభాస్ కు శృతి హాసన్ థ్యాంక్స్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'దసరా'.. డీగ్లామర్ గా నాని, కీర్తిసురేష్..!
న్యాచురల్ స్టార్ నాని ఎప్పటినుండో ఒక హిట్ కోసం ఎదురుచూస్తుండగా రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్టర్ ను రిలీజ్ చేయగా నాని ఈసారి కూడా మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో నాని మాస్ లుక్‌లో, కోరమీసం, గుబురు గడ్డంతో మాస్ యాటిట్యూడ్ పాత్రలో కనిపించనున్నాడు.

"సర్కారు వారి పాట "మూవీ తాజా షెడ్యూల్ డేట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం ఏప్రిల్1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో సముద్రఖని , వెన్నెల కిషోర్ , సుబ్బరాజు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.