సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి ” మూవీ ని షాహిద్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ “కబీర్ సింగ్ “గా హిందీ లో రీమేక్ చేయగా ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ సాధించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దాంతో బాలీవుడ్ దర్శక , నిర్మాతలు సౌత్ మూవీస్ హిందీ రీమేక్స్ పై ఆసక్తి చూపుతున్నారు. తెలుగు తో పాటు తమిళ , మలయాళ , కన్నడ భాషల మూవీస్ సుమారు 25 సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కావడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“బాహుబలి “, “సాహో “మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించడంతో సౌత్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ పై ఆసక్తి చూపుతున్నారు. హీరో ప్రభాస్ నటించే సినిమాలు అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం. రీసెంట్ గా రిలీజ్ అయిన అల్లు అర్జున్ మూవీ “పుష్ప :ది రైజ్ ” మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ దర్శక , నిర్మాతలు టాలీవుడ్ హీరోస్ తో హిందీ మూవీస్ తెరకెక్కించడానికి సిద్ధంగా ఉన్నారు. బ్లాక్ బస్టర్ “బాహుబలి”, “బాహుబలి 2 ” మూవీస్ తో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























