కన్నడ సూపర్ స్టార్ సుదీప్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో కన్నడ ప్రేక్షకులను , డబ్బింగ్ వెర్షన్స్ మూవీస్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . బ్లాక్ బస్టర్ “ఈగ ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సుదీప్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. “సైరా నరసింహా రెడ్డి “మూవీ లో చిన్న పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. శివ కార్తీక్ దర్శకత్వంలో సుదీప్ , మడోన్నా సెబాస్టియన్ జంటగా తెరకెక్కిన మాస్ &యాక్షన్ ఎంటర్ టైనర్ “K 3″కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
4 రోజులలో 40 కోట్లు కలెక్ట్ చేసిన “K 3” కన్నడ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను “K 3 కోటికొక్కడు “పేరుతో గుడ్ సినిమా గ్రూప్ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ చేస్తుంది. ఈ మూవీ కి అర్జున్ జెంయా సంగీతం అందించారు. స్టార్ హీరో సుదీప్ “K 3 కోటికొక్కడు ” మూవీ తో తెలుగు ప్రేక్షకులను అలరించనున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: