న్యాచురల్ స్టార్ నాని ఎప్పటినుండో ఒక హిట్ కోసం ఎదురుచూస్తుండగా రీసెంట్ గానే శ్యామ్ సింగరాయ్ సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే అంటే సుందరానికీ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయగా.. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈసినిమాతో పాటు నాని దసరా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా పోస్టర్ ను రిలీజ్ చేయగా నాని ఈసారి కూడా మరో డిఫరెంట్ కథతో వస్తున్నట్టు అర్థమవుతుంది. ఇందులో నాని మాస్ లుక్లో, కోరమీసం, గుబురు గడ్డంతో మాస్ యాటిట్యూడ్ పాత్రలో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈసినిమా పూర్తిగా తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నాని బొగ్గు గని కార్మికుడిగా కనిపించనున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనిలో భాగంగానే ఈసినిమాలో నాని.. అలానే నాని సరసన హీరోయిన్ గా నటిస్తున్న కీర్తి సురేష్ కూడా డీ గ్లామర్ గా కనిపించున్నారట.
కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వాస్తవ సంఘటనల ఆధారంగా ఈసినిమా తెరకెక్కుతుంది. చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫి అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: