రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసిన ‘గని’

Ghani Movie team Blocks two Release Dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Ghani Movie,Ghani Telugu Movie,Ghani Upcoming Telugu Movie,Ghani Movie Latest Updates,Ghani Movie Release Dates,Ghani Movie Movie Release,Ghani Movie Dates,Ghani Movie Release Two Dates, Ghani Varun Tej,Varun Tej New Movie,Varun Tej Upcoming Movie Ghani,Feb 25th or March 4th Ghani Movie Release,Ghani Movie Release On Feb 25th,Ghani Movie Release on March 4th, Varun Tej as Boxer in Ghani Movie,Music s Thaman,S thaman Music Director,S thaman Music For Ghani Movie

ఇండస్ట్రీలో మరో కొత్త ట్రెండ్ మొదలైంది. పరిస్థితులు బాలేకపోవడంతో ముందుగానే రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ రెండు రిలీజ్ డేట్లను బుక్ చేసుకొని అందులో మార్చి 25వ తేదీని కన్ఫామ్ చేసుకుంది. ఇక భీమ్లానాయక్ కూడా రెండు రిలీజ్ డేట్లనే ఆప్షన్ లో పెట్టుకుంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న తమ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈలిస్ట్ లో మరో సినిమా చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గని. బాక్సింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. అయితే ఈసినిమా రిలీజ్ డేట్లను ఫిక్స్ చేస్తూ తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో ‘గని’ బాక్సింగ్ పంచెస్ విసరబోతున్నాడు అంటూ మేకర్స్ ప్రకటించారు.

కాగా మొదటినుండి పలు డిఫరెంట్ స్టోరీలతో అలరించిన వరుణ్ ఈసినిమాలో ఇప్ప‌టి వ‌ర‌కూ చేయ‌ని డిఫ‌రెంట్ క్యారెక్టర్‌లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈసినిమాలో హీరోయిన్ గా సయీ మంజ్రేకర్ నటిస్తుండగా నదియా, జగపతిబాబు ఉపేంద్ర, సునీల్ శెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. ఈసినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + fifteen =