బ్లాక్ బస్టర్ “అఖండ“మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న హీరో బాలకృష్ణ మరో మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు గొపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా #NBK107 మూవీ పూజా కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు వివివినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఈ మూవీ లో శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , కన్నడ నటుడు దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక పవర్ ఫుల్ స్టోరీ తో తెరకెక్కనున్న “#NBK107” మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందనీ , పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. బ్లాక్ బస్టర్ “క్రాక్ “మూవీ తరువాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న “#NBK107” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ఫస్ట్ టైమ్ హీరో బాలకృష్ణ కు జోడీగా నటించడం విశేషం.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: