
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 33


'మహాన్' ట్రైలర్ రిలీజ్

ప్రారంభం అయిన "#SSMB 28"మూవీ

'హరిహర వీరమల్లు' కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్..!
"తగ్గేదే లే"

బ్లాక్ శారీలో ప్రియా ప్రకాష్ వారియర్

"రావణాసుర " మూవీ షూటింగ్ మొదటి రోజు ఫోటో

నాలుగేళ్ల సినీ ప్రయాణం.. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్

రాజమండ్రి లో "#RC15 "మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పక్కా కమర్షియల్'

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్

నా సినిమా రిలీజ్ రోజే పవన్ సినిమాకి వెళ్తా..!

"పుష్ప :ది రూల్ "మూవీ కి రిలీజ్ డేట్ ఫిక్స్?

మారిన 'సూర్య' సినిమా రిలీజ్ డేట్

'సామాన్యుడు' స్నీక్ పీక్

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు

'శాకుంతలం' లో అసుర మహారాజుగా..!

ధోని గ్రాఫిక్ నవల "అధర్వ" ఫస్ట్ లుక్ రిలీజ్
భారత క్రికెట్ మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచం అంతటా చాలా మంది అభిమానులు ఉన్న విషయం తెలిసిందే. ఇండియన్ క్రికెట్ కి దూరమైనా ఐపీఎల్ ద్వారా అభిమానులని అలరిస్తున్నాడు. క్రికెట్ తో పాటు వేరే గేమ్స్, సాహస కార్యక్రమాలు, బైక్ రైడింగ్స్, యాడ్స్ …వంటి వాటితో అభిమానులను అలరిస్తున్న ధోని ఇప్పుడు మరో కొత్త అవతారంలో పలుకరించనున్నారు.

రెండు రిలీజ్ డేట్లపై కౌంటర్.. 'రామారావు ఆన్ డ్యూటీ' డైరెక్టర్ రీకౌంటర్
ప్రస్తుతం కరోనా థర్డ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అందుకే సినీ పరిశ్రమలో మళ్లీ ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ లు వాయిదా పడ్డాయి. అయితే ఈనెల నుండి మళ్లీ వాయిదా పడిన సినిమాల తేదీలను మళ్లీ చిత్ర యూనిట్లు కొత్త రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకొని విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు. ఇక కొన్ని సినిమాలు ఒక్క డేట్ నే ఫిక్స్ చేసుకుంటే.. ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియక కొన్ని సినిమాలు మాత్రం రెండు తేదీలను ప్రకటిస్తున్నారు. అందులో భీమ్లానాయక్, గని, రవితేజ రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ముందు ముందు ఎన్ని సినిమాలు వస్తాయో చెప్పలేం.

'మహాన్' ట్రైలర్ రిలీజ్
విభిన్నమైన కథలను ఎంచుకోవడంలో తమిళ్ స్టార్ హీరో విక్రమ్ ఎప్పుడూ ముందుంటాడు. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత వరకైనా వెళ్లి పాత్రలో పరకాయ ప్రవేశం చేయగలిగే నటుడు ఆయన. ఇక ప్రస్తుతం మరో డిఫరెంట్ కథతో రాబోతున్నాడు. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో ఈసినిమా వస్తుండగా తెలుగులో మహాన్ అనే పేరుతో రిలీజ్ అవుతుంది. ఈసినిమాతో మొదటిసారి విక్రమ్, ధృవ్ ఇద్దరూ కలిసి స్క్రీన్ పై సందడి చేయనున్నారు. దీంతో ఫ్యాన్స్ కూడా ఈసినిమాకోసం ఆసక్తిగా ఎదురుచూస్తుండటంతో పాటు ఈ మూవీని ఫ్యాన్స్ అంతా థియేటర్‌లో చూడాలనుకున్నారు. కానీ వారిని నిరాశ పరుస్తూ ఈసినిమాను ఓటీటీలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వేదికగా…

ప్రారంభం అయిన "#SSMB 28"మూవీ
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తి సురేష్ కథానాయిక. ఈ మూవీ లో యాక్షన్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణ. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "సర్కారు వారి పాట"మూవీ షూటింగ్ ముగింపు దశలో వుంది. "#SSMB 28 ” మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'హరిహర వీరమల్లు' కోసం భారీ యాక్షన్ సీక్వెన్స్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. ఈసినిమా భీమ్లానాయక్ సినిమా కంటే ముందే మొదలు పెట్టినా కూడా కరోనా వల్ల గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ లో పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ సినిమా పూర్తి చేశాడు. ఇక ఇప్పుడు హరి హర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. క్రిష్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయిన సంగతి తెలిసిందే.
"తగ్గేదే లే"
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ కామెడీ "దువ్వాడ జగన్నాథమ్ "మూవీ కమర్షియల్ గా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ హీరో అల్లు అర్జున్ ను కలిశారు. వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ రానుందా అని ప్రేక్షకులకు సందేహం వచ్చింది. "పుష్ప :ది రైజ్"మూవీ సక్సెస్ ను ఆస్వాదిస్తున్న అల్లు అర్జున్ "పుష్ప :ది రూల్"మూవీ కై ప్రిపేర్ అవుతున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ "భవదీయుడు భగత్ సింగ్"మూవీ తెరకెక్కించే సన్నాహాలలో ఉన్నారు.

ఏప్రిల్ లో 'కాతు వాకుల రెండు కాదల్' .. టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, నయనతార ప్రధానపాత్రల్లో వస్తున్న సినిమా కాతు వాకుల రెండు కాదల్. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల చాలా బ్రేకులు పడగా.. మొత్తానికి షూటింగ్ ను అయితే పూర్తిచేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. అయితే ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది కూడా. అప్పుడప్పుడు పలు పోస్టర్లు రిలీజ్ చేస్తూనే ఉన్నారు మేకర్స్. గతంలో ఈసినిమాను వాలెంటైన్స్ డే రోజున రిలీజ్ చేద్దామని అనుకున్నారు కానీ అది కుదరలేదు.

బ్లాక్ శారీలో ప్రియా ప్రకాష్ వారియర్
“ఒరు అదార్ లవ్ “మూవీ తో మోడల్ , ప్లే బ్యాక్ సింగర్ ప్రియా ప్రకాష్ వారియర్ మలయాళ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించారు. ఆ మూవీ లోని ఒక సాంగ్ లో కన్ను గీటి ప్రేక్షకులను ఆకట్టుకుని ఇంటర్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. “ఒరు అదార్ లవ్ “మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “లవర్స్ డే “మూవీ తో ప్రియా ప్రకాష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. “చెక్ ” మూవీ తో టాలీవుడ్ లో కథానాయికగా మారారు. ప్రియా ప్రకాష్ కథానాయికగా రూపొందిన “శ్రీదేవి బంగళా “(హిందీ ) , “విష్ణుప్రియ (కన్నడ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.ఒక మలయాళ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. హీరో తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ మూవీతో…

"రావణాసుర " మూవీ షూటింగ్ మొదటి రోజు ఫోటో
అభిషేక్ పిక్చర్స్ , ఆర్ టి టీమ్ బ్యానర్స్ పై సుధీర్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “రావణాసుర” మూవీ సంక్రాంతి సందర్బంగా జనవరి 14న లాంచనంగా ప్రారంభం అయిన విషయం తెలిసిందే. రవితేజ పది డిఫరెంట్ గెటప్ లలో కనిపించి సర్ ప్రైజ్ చేయబోతున్న ఈ మూవీ లో అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్, పూజిత పొన్నాడ , దక్ష నగార్కర్ కథానాయికలు. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ మూవీ కి హర్షవర్ధన్ రామేశ్వర్ , భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ప్రారంభోత్సవం రోజున మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన పోస్టర్ లో రవితేజ…

నాలుగేళ్ల సినీ ప్రయాణం.. ప్రతిఒక్కరికీ థ్యాంక్స్
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన్న. కొంతమంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలంటే చాలా టైమ్ పడుతుంది కానీ రష్మికకు మాత్రం చాలా తక్కువ టైమే పట్టింది. ఛలో సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకోవడమే కాకుండా వరుసగా పెద్ద బ్యానర్లు.. స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకుంది. అలా ఇప్పుడు స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్స్ లో ముందు వరుసలో ఉంది రష్మిక. నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈభామ కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.

రాజమండ్రి లో "#RC15 "మూవీ తాజా షూటింగ్ షెడ్యూల్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో “#RC15” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్ లో నటిస్తున్న ఈ మూవీ లో జయరాం , అంజలి, శ్రీకాంత్ , సునీల్ కీలక పాత్రలలో నటించనున్నారని సమాచారం.”#RC15” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. పుణె లో #RC15” మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయం తెలిసిందే.

రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 'పక్కా కమర్షియల్'
సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ ఇప్పుడు రిలీజ్ కు సిద్దమవుతున్నాయి. ఈనేపథ్యంలోనే ఈరెండు రోజుల్లోనే పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు అన్నీ దాదాపు వచ్చేశాయి. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ సినిమా ముందు రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో ఇప్పుడు చిన్నా పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ డేట్లను బుక్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు సినిమాలు తమ రిలీజ్ డేట్లను ప్రకటించగా తాజాగా మారుతి, గోపీచంద్ కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు నిర్మాతలు. మే 20న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించి.. కరోనా కరుణిస్తే అన్న ట్యాగ్ కూడా ఇచ్చారు. మరి చూద్దాం కరోనా ఏం చేస్తుందో..

"అజిత్ కుమార్ 61" మూవీ లో కీలక పాత్రలో నాగార్జున ?
జీ స్టూడియోస్ సమర్పణలో బే వ్యూ ప్రాజెక్ట్స్ బ్యానర్ పై హెచ్ వినోద్ దర్శకత్వంలో అజిత్ కుమార్ హీరోగా తెరకెక్కిన “నెర్కొండ పార్వై “తమిళ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. సేమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన “వాలిమై” తమిళ మూవీ తమిళ , తెలుగు , కన్నడ , హిందీ భాషలలో ఫిబ్రవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నిర్మాత , దర్శకుడు , హీరో సేమ్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ “#THALA61″తమిళ మూవీలో అజిత్ కు జంటగా టబు నటిస్తున్నారు.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్
ఈ నగరానికి ఏమైంది, ఫలక్ నూమా దాస్ నుండి రీసెంట్ గా వచ్చిన పాగల్ వరకూ విభిన్నమైన కథలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ఇక ఈసారి కాస్త రూటు మార్చి 'అశోక వనంలో అర్జున కళ్యాణం' అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటుండగా.. మరోవైపు ప్రమోషన్స్ కూడా చేసేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను కొంచం డిఫరెంట్ గా స్టార్ట్ చేశారు. హీరో పోస్టర్ నే తనకు ముప్పై ఏళ్లు అవుతున్నా పెళ్లి కావడం లేదని జుట్టు పోతుందని, పొట్ట వచ్చేస్తుందని క్యారెక్టర్‌ను చక్కగా రివీల్ చేశారు. ఆ తరువాత రీసెంట్‌గా విశ్వక్ సేన్ తనకు అమ్మాయి దొరికేసిందంటూ…

నా సినిమా రిలీజ్ రోజే పవన్ సినిమాకి వెళ్తా..!
రాజావారు రాణిగారు, ఎస్ ఆర్ కల్యాణమండపం సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం. అంతేకాదు ఈ రెండు సినిమాలతోనే పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల్లో సైతం అవకాశం దక్కించుకున్నాడు. ప్రస్తుతం అయితే పలు సినిమాల్లో బిజీగా ఉండగా అందులో సెబాస్టియన్ సినిమా కూడా ఒకటి. బాలాజీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

"పుష్ప :ది రూల్ "మూవీ కి రిలీజ్ డేట్ ఫిక్స్?
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో అద్భుతమైన రెస్పాన్స్ పొందిన విషయం తెలిసిందే. రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. సౌత్ ప్రేక్షకులతో పాటు నార్త్…

మారిన 'సూర్య' సినిమా రిలీజ్ డేట్
టాలీవుడ్ లో చిన్నగా పాన్ ఇండియా సినిమాల నుండి పెద్ద సినిమాల వరకూ రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకున్నాయి. ఇక ఇప్పుడు కోలీవుడ్ హీరోలు కూడా తమ సినిమాల రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసుకుంటున్నారు. తాజాగా సూర్య కూడా తన కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ‘ఎదర్కుం తనిందవన్’ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. సూర్య కెరీర్ లో వస్తున్న 40వ సినిమా ఇది. ఇటీవలే సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈసినిమాను ముందు ఫిబ్రవరి 4వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు కానీ ఇప్పుడు మళ్లీ ఆ డేట్ ను మారుస్తూ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 10న ఈసినిమాను రిలీజ్ చేయనున్నట్టు చిత్ర…

'సామాన్యుడు' స్నీక్ పీక్
హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు విశాల్. రీసెంట్ గా ఎనిమి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విశాల్ ఇప్పుడు సామాన్యుడిగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం శరవణన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా వస్తున్న సినిమా సామాన్యుడు. ఈసినిమా కూడా రిలీజ్ కు సిద్దంగా ఉంది. నిజానికి ఈసినిమా కూడా ఎప్పుడో రిలీజ్ కావాలి. సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఈసినిమా రిపబ్లిక్ డేకు వస్తుందని అప్పట్లో మేకర్స్ ప్రకటించారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆ తేదీన కూడా ‘సామాన్యుడు’ సినిమా విడుదల కాలేదు. అయితే రీసెంట్ గానే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు ఫిబ్రవరి 4న ఈసినిమా…

'రామారావు ఆన్ డ్యూటీ' రిలీజ్ డేట్ లో మార్పు
గత నెలరోజులుగా కరోనా థర్డ్ వేవ్ వల్ల బాక్సాఫీస్ వద్ద సందడి తగ్గిపోగా.. ఇప్పుడు మళ్లీ వరుస రిలీజ్ డేట్లతో సందడి మొదలైంది. పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు వరుసగా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటున్నాయి. పెద్ద సినిమాల రిలీజ్ లను బట్టి కొన్ని సినిమాలు రిలీజ్ డేట్లను మార్చుకుంటున్నాయి. ఇప్పటికే భీమ్లానాయక్ ఫిబ్రవరి 25నే విడుదల చేస్తామని, లేకపోతే ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తామని తెలిపారు. ఆ తరువాత గని సినిమా ఫిబ్రవరి 25 లేదా మార్చి 4న థియేటర్లలో రానుందని తెలిపారు. ఇక ఇప్పుడు రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ప్రకటించారు.

'శాకుంతలం' లో అసుర మహారాజుగా..!
క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా శాకుంతలం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియా ద్వారా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో పాల్గొన్న ఈసినిమా నిర్మాత నీలిమ ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలియచేసింది. దీనిలో భాగంగానే ఈసినిమాలో విలన్ గా కబీర్ దుహాన్ సింగ్ నటిస్తున్నాడని.. అసుర మహారాజు అనే పాత్రలో నటిస్తున్నాడని తెలిపింది. ఈసినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ లో చాలా కష్టపడ్డాడని.. కిరీటం.. కవచం ఇలా దాదాపు 30 కిలోల బరువు మోశాడని తెలిపింది. ఇంకా ఈ సినిమాను…