కరోనా థర్డ్ వేవ్ ప్రభావం వల్ల పెద్ద పెద్ద సినిమాలు అన్నీ దాదాపు వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. అయితే మళ్లీ ఇప్పుడు మేకర్స్ రిలీజ్ ప్లాన్లు చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఆర్ఆర్ఆర్ మేకర్స్ కూడా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. ఈసినిమా నిజానికి సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అవ్వాల్సింది. అయితే పాన్ ఇండియా సినిమా.. భారీ బడ్జెట్ సినిమా కాబట్టి అన్నీ ఆలోచించుకొని రిలీజ్ చేసుకోవాలి. అందుకే కొన్ని చోట్ల థియేటర్లు మూసేయడం.. మరికొన్ని చోట్ల 50 శాతం ఆక్యుపెన్సీ మాత్రమే ఉండటంతో ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ చేయడం కష్టం అని భావించి వాయిదా వేశారు. అయితే ఆతరువాత ఆర్ఆర్ఆర్ టీమ్ రెండు రిలీజ్ డేట్లను ఫిక్స్ చేసింది. అందులో మొదటిది మార్చి 25వ తేదీ కాగా.. రెండోది ఏప్రిల్ 28 వ తేదీ. పరిస్థితులు కాస్త మెరుగుపడితే మార్చి 25వ తేదీన రిలీజ్ చేస్తామని.. లేకపోతే ఏప్రిల్ 28 తేదీనే రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు తాజాగా ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్
చేస్తూ అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. చెప్పిన రెండు డేట్లలో మార్చి 25వ తేదీనే ఫిక్స్ చేస్తూ క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
#RRRonMarch25th, 2022… FINALISED! 🔥🌊 #RRRMovie pic.twitter.com/hQfrB9jrjS
— RRR Movie (@RRRMovie) January 31, 2022
ఇక రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈసినిమాను భారీగానే ప్రమోషన్ చేశారు రాజమౌళి. నార్త్, సౌత్ లో కూడా అన్ని ప్రెస్ మీట్లలో యాక్టివ్ గా పాల్గొన్నారు ఎన్టీఆర్, చరణ్ కూడా. రిలీజ్ డేట్ వాయిదా పడటంతో కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు కాబట్టి మళ్లీ ప్రమోషన్స్ లో రాజమౌళి యాక్టీవ్ అవుతారేమో చూడాలి.
కాగా భారత స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవితాల ఆధారంగా తెరకెక్కిన ఫిక్షన్ డ్రామా ‘ఆర్ఆర్ఆర్’. అల్లూరిగా రామ్‌చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్ నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది.



[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: