మొత్తానికి సంక్రాంతికి వాయిదా పడ్డ పెద్ద సినిమాలు అన్నీ వరుసపెట్టి రిలీజ్ కు రెడీ అయ్యాయి. నిర్మాతలందరూ చర్చలు జరుపుకొని ఫైనల్ గా రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకున్నట్టున్నారు. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట ఫైనల్ రిలీజ్ డేట్లు ప్రకటించగా.. భీమ్లానాయక్ మాత్రం రెండు రిలీజ్ డేట్లను ఆప్షన్ లో పెట్టుకుంది. ఇక తాాజాగా ఎఫ్ 3 రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలి కానీ అప్పటికే పెద్ద సినిమాలు లిస్ట్ లో ఉండటం.. దానికి తోడు సినిమా షూటింగ్ కూడా ఇంకా కంప్లీట్ కాకపోవడంతో సినిమా రిలీజ్ వాయిదా పడింది. మొదట ఫిబ్రవరి అనుకున్నారు.. ఈతరువాత ఏప్రిల్ కు వెళ్లారు. ఫైనల్ గా ఏప్రిల్ 28 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. కానీ ఆ తరువాత ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి 25 లేదా ఏప్రిల్ 29 అంటూ రెండు ఆప్షన్స్ ఇచ్చారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ ఫైనల్ రిలీజ్ డేట్ ను ప్రకటించింది. మార్చి 25నే రిలీజ్ చేస్తామని ప్రకటించడంతో ఎఫ్ 3 సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయిపోయింది. ఏప్రిల్ 28నే ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ఎఫ్ 3 మేకర్స్ ప్రకటించారు.
Let’s have COOL FUN😎 in HOT SUMMER ☀️
The Ultimate Fun Franchise #F3Movie will release on APRIL 28th 2022😄@VenkyMama @IAmVarunTej @tamannaahspeaks @Mehreenpirzada @AnilRavipudi @Mee_Sunil @ThisIsDSP @SVC_official @f3_movie#F3OnApril28th pic.twitter.com/fJWRI89r0Q
— Anil Ravipudi (@AnilRavipudi) January 31, 2022
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2. 2019 సంక్రాంతికి రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అంటూ ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రానికి సీక్వెల్గా మోర్ ఫన్తో ఇప్పుడు ఎఫ్ 3 రాబోతుంది. దిల్రాజు సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక F2 నటించిన తమన్నా, మెహ్రిన్ లే ఈ సినిమాలో కూడా నటిస్తుండగా.. ఇంకా ఈసినిమాలో రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు.




[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























