
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 35


'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఫిక్స్

75 కోట్ల షేర్ దిశగా "అఖండ "

'ఖిలాడి'.. అర్జున్ రోల్ రివీల్..!

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!

కష్టపడితేనే సక్సెస్ - కీర్తి సురేష్

దుబాయ్ లో “ది ఘోస్ట్” మూవీ షూటింగ్

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"

బన్నీతో నటించాలని ఉంది..!
'బన్నీ' కి 'అర్హ' స్వీట్ వెల్ కమ్..!

అందరికీ కృతజ్ఞతలు -శృతి హాసన్
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్

అమ్మకు ప్రేమతో 'చిరు' బర్త్ డే విషెస్..!

కోలీవుడ్ లో 'పుష్ప' రాజ్ కొత్త రికార్డ్

విక్రమ్ 'మహాన్' టీజర్ రిలీజ్
యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా మహాన్. విక్రమ్ తనయుడు ధృవ్ కూడా ఈసినిమాలో నటిస్తున్నాడు. ఇక తండ్రీకొడుకులిద్దరూ ఒకే సినిమాలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ప్రస్తుతం పరిస్థితులు బాలేకపోవడంతో ఈసినిమాను డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఈసందర్భంగా ఈసినిమా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి నేడు టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'అశోక వనంలో అర్జున కళ్యాణం' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరోల్లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న హీరోల్లో విశ్వక్ సేన్ కూడా ఒకరు. ప్రస్తుతం విశ్వక్ సేన్ పలు సినిమాలతో బిజీగా ఉండగా అందులో 'అశోక వనంలో అర్జున కళ్యాణం' సినిమా కూడా ఒకటి. విద్యాసాగర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ఈసినిమాలో వడ్డీ వ్యాపారి అర్జున్ కుమార్‌గా అలరించనున్నాడు విశ్వక్. ప్రస్తుతం ఆయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు.. అలాగే ఒక పాటను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.

శివకార్తికేయన్ 'డాన్' రిలీజ్ డేట్ ఫిక్స్
శివ కార్తికేయన్ ఇప్పుడు వరుస సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అక్కడి హీరోలకు మంచి పోటీ ఇస్తూ విభిన్నమైన కథలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే డాక్టర్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు శివ కార్తికేయన్. ఆ సినిమాను తానే నిర్మించి మంచి నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టింది డాక్టర్ సినిమా. ఇప్పుడు మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయిపోయాడు. సిబి చక్రవర్తి దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

100 కోట్ల క్లబ్ లో "పుష్ప :ది రైజ్" హిందీ వెర్షన్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్“పుష్ప” మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప: ది రైజ్” డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.“పుష్ప: ది రైజ్” మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది. ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అల్లు అర్జున్ అందుకున్నారు…

'మాన్‌స్టర్'.. డబ్బింగ్ పూర్తి చేసుకున్న మంచు లక్ష్మీ
ఇప్పుడు తమిళ్, మలయాళం సినిమాలను కూడా తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక అక్కడి హీరోలకు మన తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులు ఉండటంతో కొన్ని సినిమాలు సూపర్ హిట్ కూడా అవుతున్నాయి. ఇక మలయాళ లెజెండరీ నటుడు మోహన్ లాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఇటీవల డైరెక్ట్ గా తెలుగులో జనతా గ్యారెజ్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇప్పుడు 'మాన్‌స్టర్' సినిమాతో రానున్నాడు. వైశాఖ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుండగా.. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

75 కోట్ల షేర్ దిశగా "అఖండ "
హీరో నందమూరి బాలకృష్ణ , మాస్ మసాలా చిత్ర దర్శకుడు బోయపాటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “అఖండ“మూవీ డిసెంబర్ 2వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను భారీ వసూళ్ళ తో 200 కోట్ల క్లబ్ లో చేరి , హీరో బాలకృష్ణ కెరీర్ లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ప్రగ్య జైస్వాల్ కథానాయిక . థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో బాలకృష్ణ రెండుపాత్రలలో పవర్ ఫుల్ డైలాగ్స్ , పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. ఫస్ట్ టైమ్ అఘోరా పాత్రలో నటించిన బాలకృష్ణ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

'ఖిలాడి'.. అర్జున్ రోల్ రివీల్..!
రమేష్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ఖిలాడి. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఇక ఈసినిమాను ఫిబ్రవరి 11న రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. ఏది ఏమైనా కానీ చెప్పిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయడానికి ఫిక్స్ అయ్యారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే రిలీజ్ కు ఇంకా ఎన్నో రోజులు లేకపోవడంతో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఇప్పటికే ఈసినిమాకు సంబంధించిన పలు పోస్టర్లు.. పాటలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

22 సంవత్సరాల తరువాత హీరో అజిత్ కు జోడీగా టబు
"హమ్ నౌజవాన్ "(1985 ) మూవీ తో బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించిన టబు "కూలీ నెం . 1 "మూవీ తో కథానాయికగా టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. "కాదల్ దేశం"మూవీ తో తమిళ , "కాలాపానీ "మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమకు టబు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ హిందీ, తమిళ, మలయాళ , ఇంగ్లీష్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు . అజిత్ హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ "కండుకొండెన్ కండుకొండెన్ "తమిళ మూవీ లో కథానాయికగా నటించిన టబు 22 సంవత్సరాల తరువాత "#THALA 61"మూవీ లో అజిత్ కు జోడీగా నటించనున్నారు.

షూటింగ్ పూర్తి చేసుకున్న 'ఎఫ్ 3'
అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ ఎఫ్ 2 ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో తెలుసుకదా. ఈ చిత్రంతో అనిల్ రావిపూడి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో నవ్వించారు. ఇక ఇప్పుడు దాని సీక్వెల్ గా ఎఫ్3 సినిమా వస్తుంది. ఇక ఈసినిమా షూటింగ్ కు కూడా కరోనా వల్ల ఎన్ని బ్రేకులు పడ్డాయో తెలిసిందే. లేకపోతే ఈసంక్రాంతికి రిలీజ్ అయి ఉండేది.

'ఆర్ఆర్ఆర్' వస్తే నేను తప్పుకోవాల్సిందే..!
కరోనా థర్డ్ వేవ్ వచ్చి పెద్ద సినిమా రిలీజ్ కు బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. లేకపోతే ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్ సినిమాలు ఎప్పుడో రిలీజ్ అయ్యేవి. కానీ తెలిసిందే కదా. కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం.. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు కూడా మూసేయడంతో పెద్ద సినిమాల రిలీజ్ లను వాయిదా వేశారు. ఇక తాజాాగా ఈసినిమాల రిలీజ్ లపై దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యాలు.

కష్టపడితేనే సక్సెస్ - కీర్తి సురేష్
సూపర్ హిట్ “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని కీర్తి సురేష్ తెలుగు , తమిళ, మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. పలు భాషల మూవీ షూటింగ్స్ లో పాల్గొంటూ కీర్తి సురేష్ సౌత్ ఇండియా లో బిజీయెస్ట్ యాక్ట్రెస్ గా మారారు.కీర్తి సురేష్ ప్రస్తుతం “సర్కారు వారి పాట “, “సాని కాయిధమ్ “(తమిళ ), “వాషి ” (మలయాళ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.పలు భాషల మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి , చిరంజీవి…

దుబాయ్ లో “ది ఘోస్ట్” మూవీ షూటింగ్
వెంకటేశ్వర సినిమాస్ , నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ “PSV గరుడ వేగ “మూవీ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ “ది ఘోస్ట్” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో నాగార్జున కు జోడీగా కాజల్ అగర్వాల్ ఎంపిక అయ్యారు. ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ ఈ మూవీ నుండి వైదొలగడంతో హీరో నాగార్జున కు జోడీగా సోనాల్ చౌహాన్ ఎంపిక అయ్యారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భరత్ సౌరభ్ సంగీతం అందిస్తున్నారు.

ప్రేక్షకులను ఆకట్టుకున్న "గుడ్ లక్ సఖి"
సక్సెస్ ఫుల్ చిత్ర నిర్మాత దిల్ రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై నగేష్ కుకునూరు దర్శకత్వం లో నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ , ఆది పినిశెట్టి, జగపతి బాబు లు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి”మూవీ జనవరి 28 వ తేదీన విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మ్యాంగో మ్యూజిక్ ద్వారా రిలీజ్ అయిన“గుడ్ లక్ సఖి”మూవీ సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

బన్నీతో నటించాలని ఉంది..!
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాలు రిలీజ్ చేయడమే చాలా కష్టంగా ఉంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద తెలుగు సినిమా సత్తాను మరోసారి చూపించాడు బన్నీ. సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన బన్నీ సినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఇంకా సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూనే ఉంది. ఇక నార్త్ లో అయితే బన్నీ ప్రభంజనం నడుస్తుంది. ఇప్పటికే వంద కోట్లు కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు సినీ విశ్లేషకులు.

పుష్ప "సామీ .. సామీ" సాంగ్ స్పెషల్ & మెమొరబుల్ -రష్మిక
మైత్రీమూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , రష్మిక మందన్న జంటగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యం లో యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ ఫస్ట్ పార్ట్ “పుష్ప : ది రైజ్” మూవీ డిసెంబర్ 17 వ తేదీన దక్షిణాది భాషల తో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. దేవిశ్రీ ప్రసాద్ స్వర కల్పనలో సాంగ్స్ ప్రేక్షకులను వీనుల విందు చేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ , రష్మిక ల స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను అలరించింది.
'బన్నీ' కి 'అర్హ' స్వీట్ వెల్ కమ్..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ సినిమా పుష్ప హవా ఏ రేంజ్ లో ఉందో చూస్తున్నాం. సుకుమార్ దర్శకత్వంలో రా అండ్ కల్ట్ సినిమాగా తెరకెక్కగా అందరూ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ మాత్రం ఈసినిమాకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇక పుష్ప పాటలు సోషల్ మీడియాను ఏ రేంజ్‌లో ఊపేస్తున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి మొదటిపాన్ ఇండియా పుష్ప సక్సెస్‌ను మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు బన్నీ.

అందరికీ కృతజ్ఞతలు -శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో శృతి హాసన్ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. 2021సంవత్సరంలో మల్టీ టాలెంటెడ్ శృతి హాసన్ కథానాయికగా రూపొందిన “క్రాక్ “, “వకీల్ సాబ్“మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. శృతి ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న “సలార్”మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. శృతి హాసన్ తాజాగా సీనియర్ హీరోస్ కు జోడీగా నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కనున్న “#NBK107” మూవీ కి శృతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అల్లు అర్జున్ ఇన్ స్టా గ్రామ్ రికార్డ్
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురము లో .. " మూవీ తో ప్రేక్షక, అభిమానులను అలరించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రూపొందిన"పుష్ప :ది రైజ్"మూవీ దక్షిణాది , ఉత్తరాది లతో పాటు ఓవర్ సీస్ లో భారీ కలెక్షన్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న విషయం తెలిసిందే. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన సాంగ్స్ అన్ని భాషల ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తూ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. "పుష్ప :ది రైజ్"మూవీ హిందీ డబ్బింగ్ వెర్షన్ స్ట్రయిట్ హిందీ మూవీస్ ను క్రాస్ చేసి 100కోట్ల కలెక్షన్స్ దిశగా దూసుకుపోవడం విశేషం.

అమ్మకు ప్రేమతో 'చిరు' బర్త్ డే విషెస్..!
కరోనా థర్డ్ వేవ్ ప్రభావం సినీ సెలబ్రిటీలు మీద గట్టిగానే పడుతుంది. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. ఒకరు కోలుకునేలోపే మరొకరు కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డ సంగతి తెలిసిందే. స్వల్ప లక్షణాలతో కరోనాబారిన పడ్డ చిరు ప్రస్తుతం ఇంట్లో చికిత్స తీసుకుంటున్నారు. దీంతో చిరు అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు.

కోలీవుడ్ లో 'పుష్ప' రాజ్ కొత్త రికార్డ్
సుకుమార్-బన్నీ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మాత్రం తన హవాను కొనసాగిస్తూనే ఉంది. బన్నీ కెరీర్ లో వచ్చిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. మొదటి సినిమాతోనే బన్నీ తన సత్తా ఏంటో చూపిస్తున్నాడు. సినిమా రిలీజ్ అయి ఇన్నిరోజులు అవుతున్నా ఇంకా ఏదో ఒక రకంగా పుష్ప రాజ్ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. పాటల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా శ్రీవల్లి పాట హుక్ స్టెప్ అయితే అయితే ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఆఖరికి క్రికెటర్లు కూడా డైలాగ్స్, స్టెప్స్ వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.