ఒరిజినల్ రిలీజ్ డేట్ కే ఫిక్స్ అవుతున్న ‘కె.జి.యఫ్ 2’..?

KGF 2 Makers To Stick To Original Date Only,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, KGF 2,KGF 2 Movie,KGF 2 Telugu Movie,KGF 2 latest Telugu Movie,KGF 2 Upcoming Movie,KGF 2 Release Date,KGF 2 Telugu Movie Release Date Confirmed,KGF 2 Movie Date, KGF 2 Origial Date Fixed,KGF 2 Release Date No Changed,KGF 2 Will Release On Same Date,KGF 2 On April 14th,KGF 2 will Release on 14th April,Yash,Hero Yash,Yash New Movie KGF2, Yash KGF2 Movie Release On 14th April,Yash Upvoming Movie,Yash New Movie,Yash Latest Updates,KGF Chapter 2,sanjay dutt,sanjay dutt In Adhir,Sanjay Dutt In KGF2,

కె.జి.యఫ్ 2.. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ చాలా ఎదురుచూస్తున్నారు. కానీ కరోనా వల్ల సినిమా రిలీజ్ చేయలేకపోయారు. గత ఏడాది సమ్మర్ లో కావాల్సింది. ఇప్పటివరకూ పెండింగ్ లో పడిపోయింది. మరోవైపు ఈ సినిమా డైరెక్టర్ వేరే సినిమాతో బిజీ అయిపోవడంతో సినిమా ప్రమోషన్స్ కూడా దాదాపు ఆపేశారు. ఈ సినిమా నుండి సాలిడ్ అప్ డేట్ వచ్చి కూడా చాలా కాలం అయింది. గత ఏడాది టీజర్ రిలీజ్ చేశారు.. ఆ తరువాత సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీ నటుల పోస్టర్లు రిలీజ్ చేశారు తప్పా మరే అప్ డేట్ లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మరోవైపు ఈసినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తల ప్రకారం.. రిలీజ్ డేట్ ను మార్చకుండా ఫిక్స్ చేసిన డేట్ కే సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు అన్నీ దాదాపు ఫిక్స్ అయిపోయాయి.. ఏప్రిల్ 14 వ తేదీకీ అటూ ఇటూ పెద్ద సినిమాల రిలీజ్ లు కూడా ఏం లేవు.. దాంతో ఇదే కరెక్ట్ డేట్ అని.. ఒరిజినల్ డేట్ కే సినిమా రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. చూద్దాం మరి ఇంకా రెండు నెలలు టైమ్ ఉంది.. ఈ లోపు ఏమన్నా చేంజ్ చేస్తారో?లేక అదే డేట్ ను ఉంచుతారో..?

కాగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో క‌న్న‌డ స్టార్ హీరో య‌ష్ హీరోగా రూపొందిన సినిమా ‘కె.జి.యఫ్ ఛాప్టర్ 2’. ఈసినిమా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండటంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. ర‌వీనాటాండ‌న్‌లతో పాటు విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్‌, ఇంకా రావు రమేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబ‌లే ఫిలింస్, ఎక్సెల్ మూవీస్, వారాహి చలన చిత్రం బ్యానర్స్ పై  నిర్మిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. మరి సినిమా ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 2 =