కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 194

రిలీజ్ అప్‌డేట్

KGF చాప్టర్ 2 మూవీ రిలీజ్ వాయిదా ?

దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ " KGF చాప్టర్1" కన్నడభాషలో ఘనవిజయం సాధించి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రేపే యంగ్ హీరో నిఖిల్ పెళ్లి..!

లాక్ డౌన్ వల్ల యంగ్ హీరో నిఖిల్‌ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాలి. లాక్ డౌన్ అయినా గుడిలో పెళ్లి చేసుకుంటా అని గతంలో చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేశారు. ఇక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో తాజాగా పెళ్లి ముహుర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేపు నిఖిల్,పల్లవిల వివాహం జరగనున్నట్టు సమాచారం. మంచి ముహూర్తాలు లేకపోవడం.. మూఢం వల్ల మరో మూహూర్తం కోసం దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందని హీరో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రానా' ప్రేయసి వివరాలు - 'మిహిక బజాజ్' హైద్రాబాదీనే ..!

మొత్తానికి ఇన్నేళ్లకు రానా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించాడు. నిన్న సోషల్ మీడియా వేదికగా తన లవ్ సంగతి బయట పెట్టగా మొదట అందరూ షాక్ తిన్నా ఆ తర్వాత అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా రానా కు అభినందనలు తెలుపగా పలువురు హీరోలు మాత్రం కామెడీగా స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుంది. దీనిపై రానా తండ్రి సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని.. అంతకంటే ముందు అయినా అవ్వచ్చని తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ పై ఆసక్తి

"ఎవరే అతగాడు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి పలు తెలుగు, కన్నడ , తమిళ, మలయాళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. "పరుత్తి వీరన్ "తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ "చెన్నై ఎక్స్ ప్రెస్" ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ప్రియమణి ప్రస్తుతం "నారప్ప ", "విరాటపర్వం"మూవీస్ లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా "మైదాన్" హిందీ మూవీ లో ప్రియమణి నటించారు.

Team TFNవాట్సాప్
Versatile Actor Jagapathi Babu and Laya Musical Blockbuster Manoharam Completes 20 Years.
సినిమా వార్తలు

జగపతిబాబు, ల‌య‌ ‘మనోహరం’కి 20 ఏళ్ళు

కుటుంబక‌థా చిత్రాల క‌థానాయ‌కుడు జగపతిబాబు కెరీర్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘మనోహరం’ ఒక‌టి. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పాట్రియాటిక్ డ్రామాలో జగపతిబాబుకి జోడిగా ల‌య న‌టించింది. ప్రకాష్‌రాజ్, బ్రహ్మాజీ, సూర్య, ముకేష్ రిషి, చంద్రమోహన్, మల్లికార్జున రావు, యం.ఎస్.నారాయణ, యల్.బి.శ్రీరాం, బెనర్జీ, ఝాన్సీ, వినోద్ బాల‌ ముఖ్య భూమికలు పోషించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సోష‌ల్ మీడియాలో సాయితేజ్ హ‌వా

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా సోషల్ మీడియాదే హ‌వా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే.. రెండు వేర్వేరు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవ‌ర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్‌స్టాగ్రామ్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ సంచ‌ల‌నం

‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైన‌ర్స్‌తో ఈ త‌రం ప్రేక్షకులకు చేరువ‌య్యాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. సినిమాల‌తోనే కాదు.. సోష‌ల్ మీడియాలోనూ త‌నదైన బాణీతో సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. ఎంత‌లా అంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అధిగ‌మించి ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్ర‌మించాడు ఈ “రౌడీ హీరో”.

Team TFNవాట్సాప్
సాంగ్

'రాములాతో' మరోసారి చంపేశావ్.. థాంక్స్ వార్నర్..!

మొత్తానికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. 'అల వైకుంఠపురములో' పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇక ఈపాటలు వార్నర్ కు కూడా బాగా నచ్చినట్టు ఉన్నాయి. మొన్నేమో బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి అందరికి షాకివ్వగా.. ఇప్పుడు రాములో రాములా పాటకు కూడా కాలు కదిపాడు. `రాములో..రాముల`కు తన ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేయగా ఈ వీడియోకు కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్టాండ‌ప్ క‌మెడీయ‌న్‌గా రాజ్ త‌రుణ్‌?

యువ కథానాయకుడు రాజ్ తరుణ్ తాజా చిత్రం ‘ఒరేయ్ బుజ్జిగా’ ఉగాదికి విడుద‌ల కావాల్సింది. అయితే, క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. లాక్ డౌన్ అనంత‌రం ఈ సినిమా థియేట‌ర్ల‌లో సంద‌డి చేసే అవ‌కాశం ఉంది. ఈ లోపే.. రాజ్ తరుణ్ మ‌రో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడని స‌మాచారం. నూతన దర్శకుడు సంతోష్ మోహన్ వీరంకి తెరకెక్కించ‌బోతున్న ఈ సినిమాని నంద‌కుమార్ నిర్మించ‌నున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని.. లాక్ డౌన్ అనంతరం సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

లక్కీ సీజన్‌లో 'అల్లరి' నరేష్ 'డబుల్ ధమాకా' మిస్

కథానాయకుడిగా 'అల్లరి' నరేష్‌ది పద్దెనిమిదేళ్ళ‌ నటనా ప్రస్థానం. 2002లో విడుదలైన 'అల్లరి' చిత్రంతో నరేష్ కెరీర్ ప్రారంభమైంది. ఆ ఏడాది వేసవిలో విడుదలైన ఈ సినిమా అనూహ్య విజయం సాధించింది. ఆపై ఇదే సీజన్‌లో వచ్చిన 'అల్ల‌రి' న‌రేష్ పలు చిత్రాలు బాక్సాఫీస్ ముంగిట మంచి ఫ‌లితాన్ని అందుకున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

వరుసగా మూడోసారి రజినీకాంత్ సంక్రాంతి సందడి

సూపర్ స్టార్ రజినీకాంత్‌కి అచ్చొచ్చిన సీజన్స్‌లో సంక్రాంతి ఒకటి. పొంగల్ బరిలో దిగిన రజినీ పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలోనే.. రజినీ తాజా చిత్రం 'అణ్ణాత్త' కూడా సంక్రాంతి సీజన్‌లోనే సందడి చేయనుంది. 'శౌర్యం' శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని.. తొలుత ఆయుధపూజ రోజున విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్‌తో 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

టీనేజ్ అమ్మాయికి తండ్రిగా బాలకృష్ణ?

నటసింహ బాలకృష్ణ, నిన్నటితరం అగ్రశ్రేణి దర్శకుడు బి.గోపాల్‌ది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో 5 చిత్రాలు రాగా.. వాటిలో నాలుగు సినిమాలు సంచలనం సృష్టించాయి. 'లారీ డ్రైవర్', 'రౌడీ ఇన్‌స్పెక్టర్', 'సమరసింహారెడ్డి', 'నరసింహనాయుడు'.. ఇలా బాలయ్య, గోపాల్ కాంబినేషన్‌లో 4 బ్లాక్‌బస్టర్ మూవీస్ ఉన్నాయి. కట్ చేస్తే.. 17 ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోంది. బాలయ్య 60వ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న ఈ సినిమా లాంఛనంగా ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రానా పెళ్లిపై సురేష్ బాబు - ఈ ఏడాది లోనే ఉంటుంది..!

అసలు పెళ్లి ప్రస్తావన వస్తేనే అప్పుడే ఎవరు చేసుకుంటారు అని చెప్పే టాలీవుడ్ హంక్ రానా.. ఫైనల్లీ అందరికీ తన ప్రేమను పరిచయం చేసే పెద్ద షాక్ ఇచ్చాడు. నిన్న సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా తన ప్రేయసిని పరిచయం చేయగా ఒక్కసారిగా ఈ న్యూస్ సెన్సేషన్ అయిపోయింది. రానా పెళ్లి చేసుకోబోతున్నాడని దేశవ్యాప్తంగా ఈ న్యూస్ వైరల్ అయిపోయింది. ఇక టాలీవుడ్ నుండే కాక పలువురు ప్రముఖుల నుండి రానాకు అభినందనలు అందుతున్నాయి. ఇక అప్పుడు రానా పెళ్లి ఎప్ప్పుడు అన్న దానిపై వార్తలు మొదలయ్యాయి. ఇక పెళ్లిపై కూడా క్లారిటీ ఇచ్చారు రానా రానా తండ్రి సురేష్ బాబు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు ఇదే నా విజ్ఞప్తి..!

కరోనాతో దేశం పెద్ద యుద్ధమే చేస్తుంది. అందరూ ఇళ్లల్లోనే ఉంటూ పోరాడుతున్నారు. ఇక ఈ కరోనా వల్ల పెళ్లిళ్లు పలు వేడుకలకు కూడా దూరమయ్యారు ప్రజలు. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు, సన్నిహితులు, స్నేహితులను ఇబ్బంది పెట్టకూడదని ఎనర్జిట్ స్టార్ రామ్ పోతినేని నిర్ణయం తీసుకొన్నారు. మే 15న రామ్ పుట్టినరోజు. అయితే ఈ సందర్భంగా రామ్ పోతినేని తన అభిమానులు ఎవరు తన బర్త్ డే వేడుకలు చేయోద్దంటూ రిక్వెస్ట్ చేసాడు. ప్రస్తుతం మన దేశం కరోనా అనే మహామ్మారితో పోరాడుతోంది. ఈ సమయంలో అందరు ఇంట్లోనే ఉంటూ కరోనానను తరిమి కొట్టాలంటూ పిలుపునిచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

భార్యకు ప్రేమతో గోపీచంద్ ..!

యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ‌ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వ‌సంతాలు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫైనల్లీ.. తన లవ్ ను బయటపెట్టిన రానా..!

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో కొంత మంది హీరోల పేర్లు టక్కున వచ్చేస్తాయి. అయితే వారిలో కూడా ముందొచ్చే పేరు రానా. రానా పెళ్లి, ప్రేమ వ్యవహారాలు ఎప్పుడు హాట్ టాపిక్కే . ఎప్పుడూ ఏదో ఒక వార్త బయటకు వస్తూనే ఉంటుంది. ఇక ఇన్ని రోజులు తన పెళ్లి గురించి.. ప్రేమ గురించి ఏ ప్రశ్నలు అడిగినా నవ్వుతో సమాధానం చెప్పే రానా తాజాగా తన సోషల్ మీడియా ద్వారా ఓ సర్పైజ్ ఇచ్చాడు. మామూలు విషయం కాదు తన ప్రేయసిని పరిచయం చేశాడు. తన ప్రపోజల్ కి ఆమె ఎస్ అన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేయడంతో పాటు వారి ఫోటోను కూడా పంచుకున్నాడు. చాలా కాలంగా రానా పెళ్లి పై వార్తలు వస్తుండగా నేడు ఆయన కాబోయే భార్యను…

TFN Adminవాట్సాప్
Director Boyapati Srinivas Completes 15 Years Of His Film Career In Tollywood.
సినిమా వార్తలు

15 సంవత్సరాల సినీ కెరీర్ పూర్తి

సూపర్ హిట్ "భద్ర " మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను "తులసి" , "సింహా" , "లెజెండ్", "సరైనోడు " వంటి సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వంవహించారు. మాస్ చిత్ర దర్శకుడిగా పేరుపొందిన బోయపాటి శ్రీను ఈ రోజుతో 15 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందిస్తున్నారు. బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన "సింహా" , "లెజెండ్" మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒరిస్సా మహిళా ఎస్ ఐ కు అభినందనలు

కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో ప్రవేశించిన మెగా స్టార్ చిరంజీవి తన వ్యక్తిగత విషయాలతో పాటు కరోనా వైరస్ పై అవగాహనా ట్వీట్స్ చేస్తున్నారు. సామజిక అంశాల పట్ల స్పందిస్తున్నారు. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన శుభశ్రీ అనే మహిళా ఎస్ ఐ ఒక మానసిక , శారీరక వికలాంగురాలైన ఒక మహిళ కు చేసిన సేవలకు చిరంజీవి స్పందించి ఆ మహిళా ఎస్ ఐ శుభశ్రీ తో స్వయంగా మాట్లాడి అభినందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్ కు జోడిగా మలయాళీ భామ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శ్రీరామ్ వేణు దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా కరోనా వల్ల రిలీజ్ కు నోచుకోలేదు. లాక్ డౌన్ తీసేసినా ఈ ఏడాది ఈ సినిమా రావడం కష్టమే అంటున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత క్రిష్ తో మరో సినిమాను చేస్తున్నాడు పవన్. పీరియాడిక్ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కబోతుంది

TFN Adminవాట్సాప్

షేర్