‘రాములాతో’ మరోసారి చంపేశావ్.. థాంక్స్ వార్నర్..!

Stylish Star Allu Arjun Reacts To David Warner Dancing Video On His Popular Chart Buster Ramuloo Ramulaa Song
Stylish Star Allu Arjun Reacts To David Warner Dancing Video On His Popular Chart Buster Ramuloo Ramulaa Song

మొత్తానికి ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ తెలుగు సినిమా పాటలు, డైలాగులతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాడు. ‘అల వైకుంఠపురములో’ పాటలు ఎంత హిట్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇక ఈపాటలు వార్నర్ కు కూడా బాగా నచ్చినట్టు ఉన్నాయి. మొన్నేమో బుట్ట బొమ్మ పాటకు స్టెప్పులేసి అందరికి షాకివ్వగా.. ఇప్పుడు రాములో రాములా పాటకు కూడా కాలు కదిపాడు. `రాములో..రాముల`కు తన ఫ్యామిలీతో కలిసి డ్యాన్స్ చేయగా ఈ వీడియోకు కూడా సోషల్ మీడియాలో భారీ స్పందన వచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తనపాటపై డ్యాన్స్ చేయడంతో అల్లుఅర్జున్ కూడా వార్నర్ వీడియో పై తన ట్విటర్ వేదికగా స్పందించాడు. మరో బిగ్ సప్రైజ్ డ్యాన్స్ చంపేశారు.. థాంక్స్ వార్నర్ సార్ అని ట్వీట్ చేశాడు.

ఇదిలా ఉండగా తాజాగా రాములో రాములా వీడియో సాంగ్ ఓ సెన్సేషన్ రికార్డ్ సృష్టించింది. యూట్యూబ్‌లో ఏకంగా ఈ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ రాబట్టి బన్నీ ఖాతాలో మరో రికార్డ్‌ని నెలకొల్పింది.

కాగా `పోకిరి` చిత్రంలోని `ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను` అనే డైలాగ్ కూడా వార్నర్ చెప్పిన సంగతి తెలిసిందే. దానికి `పోకిరి` చిత్రం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కూడా స్పందించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 + 6 =