బాలీవుడ్ పై ఆసక్తి

South Indian Talented Actress Priyamani Shows Interest To Work For Bollywood Movies

“ఎవరే అతగాడు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన ప్రియమణి పలు తెలుగు, కన్నడ , తమిళ, మలయాళ భాషల సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. “పరుత్తి వీరన్ “తమిళ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రియమణి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. సూపర్ హిట్ బాలీవుడ్ మూవీ “చెన్నై ఎక్స్ ప్రెస్” ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ప్రియమణి ప్రస్తుతం “నారప్ప “, “విరాటపర్వం”మూవీస్ లో నటిస్తున్నారు. అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “మైదాన్” హిందీ మూవీ లో ప్రియమణి నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ది ఫ్యామిలీ మాన్ “, “అతీత్ ” హిందీ వెబ్ సిరీస్ లలో నటించిన ప్రియమణి ఇప్పుడు బాలీవుడ్ లో తన కెరీర్ ను విస్తరించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రియమణి మాట్లాడుతూ .. హిందీ ఫిల్మ్ మేకర్స్ తమ మూవీస్ లో తనకు ఫిట్ అయ్యే క్యారెక్టర్స్ ఆఫర్ చేస్తే బాలీవుడ్ లో తన కెరీర్ ను విస్తరించుకొనడానికి ఆసక్తిగా ఉన్నానని, తాను హిందీ లో వెబ్ సిరీస్ లు, “మైదాన్ ” మూవీ లో నటించినందుకు సంతృప్తిగా ఉన్నానని ప్రియమణి చెప్పారు. బాలీవుడ్ హీరోయిన్స్ దక్షిణాది భాషా చిత్రాలలో, దక్షిణాది హీరోయిన్స్ బాలీవుడ్ మూవీస్ లో నటించడం సర్వ సాధారణమే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =