‘పెళ్ళిచూపులు’, ‘అర్జున్ రెడ్డి’, ‘గీత గోవిందం’, ‘టాక్సీవాలా’.. ఇలా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్స్‌తో ఈ తరం ప్రేక్షకులకు చేరువయ్యాడు యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ. సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తనదైన బాణీతో సంచలనం సృష్టిస్తున్నాడీ టాలెంటెడ్ హీరో. ఎంతలా అంటే.. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం అధిగమించి ఇన్‌స్టాగ్రామ్‌లో నంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించాడు ఈ “రౌడీ హీరో”.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




ఆ వివరాల్లోకి వెళితే.. దాదాపు రెండేళ్ళ క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాను తెరిచాడు విజయ్. ఈ రెండేళ్లలో తన సినిమాల అప్‌డేట్స్ గురించే కాకుండా, కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో తన అభిమానులను అలరిస్తూ వస్తున్న విజయ్.. ప్రస్తుతం 7.2 మిలియన్ల (దాదాపు 72 లక్షలకు పైగా) ఫాలోవర్స్‌తో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(6.7 మిలియన్లు), సూపర్ స్టార్ మహేష్‌బాబు(4.7 మిలియన్లు), యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్(4.5 మిలియన్లు) వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో ఉండడం విశేషం. ఇక తర్వాతి స్థానాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(2.2 మిలియన్లు), యంగ్ టైగర్ యన్టీఆర్(1.7 మిలియన్లు) ఉండడం గమనార్హం.
ఏదేమైనా.. మన “రౌడీ హీరో” సినిమాలతోనే కాదు.. సోషల్ మీడియాలోనూ తన హవా కొనసాగిస్తుండడం విశేషమనే చెప్పాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























