ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 193
అవును ప్రభాస్ 20 లో ఉన్నాను..!
సమంత ఆన్ లైన్ జిమ్ పాఠాలు
మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్..!
‘లయన్’గా బాలకృష్ణ సందడికి 5 ఏళ్ళు
శర్వానంద్ ‘అందరి బంధువయ’కి 10 ఏళ్ళు
సుధీర్‌బాబు.. ఇంట్రెస్టింగ్ లైనప్
ఒకే ఒక్క సీన్ మినహా ‘క్రాక్’ పూర్తి
మరోసారి 'త్రిష' కు చిరు ఛాన్స్..!
నిరాడంబరంగా జరిగిన హీరో నిఖిల్ వివాహం..!
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
రానా ట్వీట్ కు సురేష్ ప్రొడక్షన్స్ ఫన్నీ రిప్లై..!
ఎలాంటి హడావుడి లేకుండా రానా తనకు కాబోయే భార్యను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసి ఒక రేంజ్ లో షాక్ ఇచ్చాడు రానా. నిజానికి వేరే ఏదైనా హీరో అయితే ఇంత రెస్పాన్స్ వచ్చేది కాదేమో. మొదటినుండి పెళ్లి, ప్రేమ అనే విషయాలు ఇంట్రెస్ట్ లేనట్టు ఉండే రానా ఇప్పుడు ఇలా చేయడంతో ఇంత రేంజ్ లో సోషల్ మీడియా వేదికగా చర్చలు జరిగాయి. ఇక కొంత మంది టాలీవుడ్ హీరోలు కూడా చాలా ఫన్నీగా రియాక్ట్ అవుతూ ట్వీట్స్ చేశారు. ఇక రానా పెళ్లిపై వచ్చిన ఫన్నీ మీమ్స్ అయితే పీక్స్ లెవెల్. అందరు సంగతి ఏమోకానీ ముందు ప్రభాస్ కు మాత్రం భజన స్టార్ట్ అయింది.
అవును ప్రభాస్ 20 లో ఉన్నాను..!
'బాహుబలి' సిరీస్, 'సాహో' తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. భారీ బడ్జెట్ సినిమా... పాన్ ఇండియా రేంజ్ సినిమాలే ప్రభాస్ తలుపు తడుతున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ కి ఆ రేంజ్ సినిమాలు తీయడానికే ఇష్టపడుతున్నారు దర్శక నిర్మాతలు కూడా. ప్రస్తుతం 'జిల్' ఫేమ్ రాధా కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు యూరప్ లో షూటింగ్ జరుపుకున్న సినిమా... కరోనా వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఇక లాక్ డౌన్ తీసేసినా విదేశాలు వెళ్లడం కష్టమే కాబట్టి ఇక్కడే షూట్ ను పూర్తి చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.
"పుష్ప" మూవీ లో ఫోక్ సాంగ్స్ ?
బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠపురములో .. " మూవీ తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా "పుష్ప" మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ థ్రిల్లర్ "పుష్ప" మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ రష్మిక కథానాయిక కాగా ప్రకాష్ రాజ్, జగపతి బాబు, బాబీ సింహ , వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సమంత ఆన్ లైన్ జిమ్ పాఠాలు
ప్రాణాంతక కరోనా మహమ్మారి కారణంగా ప్రజలంతా ఇళ్ళకే పరిమితం అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ వల్ల షూటింగ్స్ రద్దు కావడంతో ఇళ్ళకు పరిమితం అయిన సినీ సెలబ్రిటీస్ వర్క్ అవుట్స్, బుక్ రీడింగ్, వంటలు, ఇంటి పనులు, కొత్త భాషలు నేర్చుకొనడం , ఇంటి సభ్యులతో ఎంజాయ్ చేయడం వంటి కార్యక్రమాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సినీ హీరోయిన్స్ ఫిట్ నెస్ కై జిమ్ లకే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. జిమ్ లు మూతపడడం తో కొంతమంది స్వయంగా వర్క్ అవుట్స్ చేస్తున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రయోగాత్మక చిత్రం ‘నాని’కి 16 ఏళ్ళు
ఈతరం కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు తీరే వేరు. ఒకవైపు కమర్షియల్ సినిమాలు చేస్తూనే.. మరోవైపు ప్రయోగాత్మక చిత్రాలకూ పెద్దపీట వేస్తుంటాడీ టాలెంటెడ్ స్టార్. అలా.. మహేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రాల్లో ‘నాని’ ఒకటి.
మరోసారి పెద్ద మనసు చాటుకున్న విజయ్..!
కరోనా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వాలు తమ వంతు సాయం అందిస్తుండగా సినీ తారలు కూడా ముందుకొచ్చి పెద్దఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కూడా చెరో రూ.5 లక్షలు చొప్పున అందజేశారు.
‘లయన్’గా బాలకృష్ణ సందడికి 5 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ తన కెరీర్‌లో పలువురు నూతన దర్శకులను ప్రోత్సహించారు. వారిలో సత్యదేవ్ ఒకరు. బాలయ్య, సత్యదేవ్ కాంబినేషన్‌లో రూపొందిన ఆ చిత్రమే ‘లయన్’. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా త్రిష, రాధికా ఆప్టే నటించారు. ‘లెజెండ్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత రాధికా ఆప్టే మరోసారి బాలయ్యతో జట్టుకట్టగా.. త్రిష తన కెరీర్‌లో తొలిసారి బాలయ్య సరసన కనువిందు చేసింది. ప్రకాష్‌రాజ్, చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, సురేష్, ఇంద్రజ, జయసుధ, గీత, చలపతిరావు, ప్రదీప్ రావత్, విజయకుమార్, అలీ, శివబాలాజి, అర్చన ముఖ్య పాత్రలు పోషించారు.
శర్వానంద్ ‘అందరి బంధువయ’కి 10 ఏళ్ళు
కుటుంబ బంధాలకు, మానవతా విలువలకు పెద్ద పీట వేస్తూ సినిమాలను తెరకెక్కించడంలో దర్శకుడు చంద్రసిద్ధార్థ తీరే వేరు. చంద్రసిద్ధార్థ రూపొందించిన ఈ తరహా చిత్రాల్లో ‘అందరి బంధువయ’ ఒకటి. శర్వానంద్, పద్మప్రియ జంటగా నటించిన ఈ సినిమాలో నరేష్, విజయ్‌సాయి, వి.రామకృష్ణ, హరితేజ, యం.యస్.నారాయణ, ప్రగతి, కృష్ణభగవాన్, జీవా ముఖ్య భూమికలు పోషించారు. ఫిల్మోత్సవ్ స్టూడియోస్ (ప్రై) లిమిటెడ్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమాకి ప్రముఖ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి కథ, మాటలు అందించారు.
సుధీర్‌బాబు.. ఇంట్రెస్టింగ్ లైనప్
వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న యువ కథానాయకుల్లో సుధీర్ బాబు ఒకరు. ‘ప్రేమకథా చిత్రమ్’(2013), ‘సమ్మోహనం’(2018) వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా తనేంటో నిరూపించుకున్న సుధీర్.. త్వరలో విడుదల కానున్న ‘వి’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్‌తో వాయిదా పడింది. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం రిలీజ్ డేట్‌పై క్లారిటీ వస్తుంది.
ఒకే ఒక్క సీన్ మినహా ‘క్రాక్’ పూర్తి
మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013).. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత రవితేజ, గోపీచంద్ కలయికలో మూడో సినిమా వస్తోంది. ఆ చిత్రమే.. ‘క్రాక్’. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు రవితేజ.
మరోసారి 'త్రిష' కు చిరు ఛాన్స్..!
ఆచార్య కొరటాల శివ-చిరు కాంబినేషన్ 'ఆచార్య' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కాజల్ నటిస్తున్న సంగతి కూడా విదితమే. అయితే మొదట ఈ సినిమా కోసం త్రిష ను తీసుకోగా.. కొన్ని కారణాల తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాతే త్రిష స్థానంలో కాజల్ ను ఎంపిక చేసింది చిత్ర యూనిట్. త్రిష తప్పుకోవడంపై పలు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆమె వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వలన ఈ సినిమాకి డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోవడంతో తప్పుకుందని చిరు క్లారిటీ కూడా ఇచ్చారు.
నిరాడంబరంగా జరిగిన హీరో నిఖిల్ వివాహం..!
మొత్తానికి రెండుసార్లు వాయిదా పడిన అనంతరం టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ వివాహం జరిగింది. నిఖిల్, డాక్టర్ పల్లవి వర్మ ల వివాహం ఈ రోజు నిరాడంబరంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని షామీర్ పేటలోని ఓ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో ఈ ఉదయం 6.31 గంటలకు వివాహ బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు. లాక్ డౌన్ నేపథ్యంలో కుటుంబ సభ్యులు...కొద్ది మంది బంధువులు, మిత్రులు మాత్రమే ఈ పెళ్లి హాజరయ్యారు. కొత్త జంటకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.
రానా పెళ్లి - సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న రానా - ప్రభాస్ పై ఫన్నీ మీమ్స్
ఎంకి పెళ్లి సుబ్బు చావుకి వచ్చింది అన్న సామెత వినే ఉంటారు కదా.. ఇప్పుడు బాహుబలి ప్రభాస్ ను చూస్తే అదే గుర్తొస్తుంది. దీనికి కారణం ఏంటో స్పెషల్ గా చెప్పనక్కర్లేదు అనుకుంటా..రానా పెళ్లి విషయమే. నిన్న సోషల్ మీడియా వేదికగా తన ప్రేమను బయటి ప్రపంచానికి చెప్పి ఒక్కసారిగా షాక్ ఇచ్చాడు. అందరూ ఏమో కానీ టాలీవుడ్ లో కొందరు హీరోలు మాత్రం రానా పై ఫన్నీ కామెంట్స్ వేస్తున్నారు. సాయి తేజ్ ఇందంతా కలా.. మళ్ళీ పడుకుందాం అని ట్వీట్ చేయగా.. నాని అయితే 2020 లో ఇంకా ఏమేం చూస్తామో అని ఫన్నీ గా ట్వీట్ చేశాడు. ఇక ప్రభాస-రానా పై అయితే ఒక రేంజ్ లో ట్వీట్స్ మొదలయ్యాయి. సోషల్ మీడియాలో ఈ రోజు ఈ మీమ్స్ మీదనే రచ్చ…
'మహానటి' సీరియస్.. నేను బరువు తగ్గింది దానికి మాత్రమే..!
'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో 'మిస్ ఇండియా'.. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో 'పెంగ్విన్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది.
సితార ఉంటే చాలు.. ప్లే లిస్ట్ అవసరం లేదు..!
సూపర్ స్టార్ మహేష్ బాబు గారాల పట్టి.. అల్లరి పిడుగు సితార గురించి ప్రేత్యేకంగా చెప్పేదేముంది. చిన్నప్పటి నుండి సితార స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్ గానే నిలిచింది. ఇక ఇప్పుడు స్వయంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ నే నిర్వహిస్తుంది. వంశీ పైడిపల్లి కూతురు ఆద్య తో కలిసి పలు వీడియోలు చేస్తూ సందడి చేస్తూనే ఉంటుంది. ఆడుతూ పాడుతూ వుండే వీడియోలే కాదు అప్పుడప్పుడు.. ఆ ఛానల్ ద్వారా వీరు సోషల్ అవెర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటారు.
మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా..!
తన ప్రేయసి మిహీకా బాజాజ్ ను పెళ్లి చేసుకోబోతున్నట్టు రానా నిన్న సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు రానాకు సోషల్ మీడియలో శుభాకాంక్షలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఈ జాబితాలో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ కూడా చేరిపోయారు. మిహిక, సోనం మంచి స్నేహితులని తెలిసిందే. ఇప్పుడు తాజాగా మిహిక కు సోనమ్ కపూర్ కూడా దీనిపై స్పందించి అభినందనలు తెలిపారు. ‘‘డార్లింగ్ బేబీ మిహిక... నీకు శుభాకాంక్షలు. లవ్ యూ. అత్యుత్తమైనవి పొందేందుకు నువ్వు అర్హురాలివి. రానా.. నువ్వు సంతోషంగా ఉండేలా చూసుకుంటాడు. మా కుటుంబంలోకి నీకు స్వాగతం రానా’’ అంటూ…
మీ సేవ ముందు మాది పెద్ద విషయం కాదు..!
కరోనా వల్ల అందరూ ఇంట్లోనే వుంటూ కాలం గడుపుతున్న నేపథ్యంలో డాక్టర్స్, నర్సులు, పోలీస్ మరియు పారిశుధ్య కార్మికులు మాత్రం ఎలాంటి విశ్రాంతి లేకుండా మన కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూనే వున్నారు. ఇక వారి కృషిని అందరూ ప్రశంసిస్తూనే ఉన్నారు. దేశవ్యాప్తంగా వారికి సెల్యూట్ చెబుతున్నారు.
బాలీవుడ్ రీమేక్ మూవీ లో రాజ్ తరుణ్
సక్సెస్ ఫుల్ "ఉయ్యాలా జంపాలా " మూవీ తో రాజ్ తరుణ్ టాలీవుడ్ కు ఎంటర్ అయ్యి "సినిమా చూపిస్త మామ" , "కుమారి 21 F" , "కిట్టు ఉన్నాడు జాగ్రత్త ", "అంధగాడు", "రాజుగాడు" వంటి కామెడీ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన "ఒరేయ్ బుజ్జిగా " మూవీ కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది.
ప్రజా గాయకురాలు పాత్ర లో సాయి పల్లవి ?
సక్సెస్ ఫుల్ "నీదీ నాదీ ఒకే కథ " మూవీ ఫేమ్ వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా సురేష్ ప్రొడక్షన్స్ , శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై రొమాంటిక్ ఎంటర్ టైనర్ "విరాటపర్వం 1992 " మూవీ రూపొందుతుంది. పీరియాడిక్ డ్రామా గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రియమణి, నందితాదాస్, జరీనా వహాబ్ , నవీన్ చంద్ర, సాయి చంద్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.
విక్రమ్ "కోబ్రా "మూవీ అప్ డేట్
విభిన్న కథా చిత్రాలను ఎంపిక చేసుకుని నటించే తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఇప్పుడు మరో డిఫరెంట్ మూవీ "కోబ్రా " లో నటిస్తున్నారు. సూపర్ హిట్ "ఇమైక్క నోడిగళ్" మూవీ ఫేమ్ అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై "కోబ్రా "మూవీ రూపొందుతుంది. బ్లాక్ బస్టర్ KGF చాప్టర్ 1 మూవీ ఫేమ్ శ్రీనిధి శెట్టి కథానాయిక కాగా క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్, దర్శకుడు KS రవి కుమార్, ఆనంద్ రాజ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. AR రెహమాన్ సంగీతం అందించారు.