ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 195
రియల్ హీరో గా మారిన రీల్ విలన్
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
'పవన్ 28'కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
ఎన్టీఆర్ కోసం రోహిత్ స్పెషల్ గిఫ్ట్..!
వెంకటేష్ హిందీ చిత్రం ‘తక్దీర్వాలా’కు 25 ఏళ్ళు
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!
ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన తాప్సీ..!
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
బాలీవుడ్ లోకి అనసూయ..!
'దిల్ రాజు' పెళ్లి ఫొటోలు విడుదల..!
వెబ్ సిరీస్ అనుమతి కోసం ప్రభుత్వానికి అల్లు అరవింద్ రిక్వెస్ట్..!
కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద సమస్యలే వచ్చి పడ్డాయి. ఏదో చిన్న చిన్న పనులంటే ఇంట్లో ఉండి కానిచ్చేస్తున్నారు కానీ అన్ని పనులు అవ్వాలంటే కష్టం. జూన్ నుండి షూటింగ్ లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉందని అంటున్నా అది ఎంత వరకూ సాధ్యపడుతుందో తెలియదు. కేరళ లాంటి రాష్ట్రాల్లో.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులకు అనుమతులు ఇచ్చారు. అక్కడ షూటింగులు కూడా మొదలయ్యే ఛాన్సుంది. కానీ ఇక్కడ మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. విదేశాల్లో షూటింగ్ అనే ఆలోచనే లేదు. దానికోసం స్క్రిప్ట్ లో మార్పులు చేసుకుంటున్నారట దర్శక నిర్మాతలు.
రియల్ హీరో గా మారిన రీల్ విలన్
"సూపర్ ", "అతడు ", అరుంధతి", " దూకుడు", "జులాయి "వంటి సూపర్ హిట్ మూవీస్ లో విలన్ గా ప్రేక్షకులను అలరించిన బాలీవుడ్ నటుడు సోను సూద్ తమిళ, కన్నడ మూవీస్ లో కూడా నటించారు. "అరుంధతి " మూవీ లో పశుపతి గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సోను సూద్ బెస్ట్ విలన్ గా నంది అవార్డ్, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 2దశాబ్దాలుగా ప్రతినాయకుడిగా ప్రేక్షకులను అలరిస్తున్న సోను సూద్ కరోనా బాధితులను ఆదుకుంటూ రియల్ హీరో గా మారారు.
పోరాట ఘట్టాలు మినహా 'కేజీఎఫ్: చాప్టర్ 2' పూర్తి
పాన్ ఇండియా మూవీగా రిలీజైన కన్నడ చిత్రం 'కేజీఎఫ్: చాప్టర్ 1'.. నేషనల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యశ్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాకి సంబంధించిన సెకండ్ పార్ట్ 'కేజీఎఫ్: చాప్టర్ 2'.. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది.

మణిరత్నం ఏకైక తెలుగుచిత్రం ‘గీతాంజలి’కి 31 ఏళ్ళు
‘కింగ్’ నాగార్జున కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచిన చిత్రం ‘గీతాంజలి’. నాగ్‌లోని నటుణ్ణి సరికొత్త కోణంలో ఆవిష్కరించిన సినిమా ఇది. అలాగే, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఏకైక తెలుగు చిత్రం ‘గీతాంజలి’ కావడం విశేషం. తెలుగునాట క్లాసిక్‌గా నిలిచిన ఈ ప్రణయ దృశ్యకావ్యంలో నాగ్‌కు జోడిగా గిరిజ(తొలి పరిచయం) నటించింది. విజయకుమార్, విజయచందర్, సుమిత్ర, ముచ్చర్ల అరుణ, 'డబ్బింగ్' జానకి, బేబీ నీనా ముఖ్య భూమికలు పోషించగా.. చంద్రమోహన్, ‘షావుకారు’ జానకి, డిస్కో శాంతి, సుత్తి వేలు ప్రత్యేక పాత్రల్లో నటించారు. సిల్క్ స్మిత స్పెషల్ సాంగ్‌లో సందడి చేసింది.
"ఇచ్చట వాహనములు నిలుపరాదు "మూవీ సుశాంత్ లుక్
సక్సెస్ ఫుల్ "కాళిదాసు " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సుశాంత్ "కరెంట్ ", "చి || ల || సౌ "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ "అల .. వైకుంఠ పురములో .. మూవీ లో ఒక కీలక పాత్రలో నటించిన సుశాంత్ ఇప్పుడు నిజ సంఘటనల ప్రేరణతో రూపొందుతున్న ఒక మూవీ లో హీరోగా నటిస్తున్నారు. రవి శంకర్ శాస్త్రి , హరీష్ కోయలగండ్ల నిర్మాతలు.
'పవన్ 28'కి దేవిశ్రీప్రసాద్ స్వరాలు
'గబ్బర్ సింగ్' (2012) వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మించనుంది. కాగా, ఈ చిత్రానికి టాలీవుడ్ రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందించనున్నాడు. తాజాగా ఈ విషయాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ట్విట్టర్ వేదికగా ధ్రువీకరించాడు.
కన్నీళ్లు పెట్టించే విధంగా 'సాయి పల్లవి' పాత్ర..!
ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన తమిళ బ్యూటీ సాయిపల్లవి. ఈ సినిమాలో తెలంగాణ స్లాంగ్ తో మాట్లాడి అందరినీ ఆకట్టుకుంది. తన అందం దానికి తగిన అభినయంతో తెలుగులో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. అయితే సాయి పల్లవి గురించి తెలుసు కదా.. కేవలం పాత్ర ప్రాధాన్యమైన పాత్రలు మాత్రమే ఎంచుకుంటదని. ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా చేస్తుంది. దానితో పాటు 'విరాట పర్వం' సినిమా చేస్తుంది.
భారీ చిత్రాల హీరో ఎన్టీఆర్
టాలీవుడ్ లో ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ చిత్రాలతో యంగ్ రెబల్ స్టార్ ముందుండగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై 400 కోట్ల తో రూపొందుతున్న "రౌద్రం రణం రుధిరం "మూవీ లో నటిస్తున్నారు.
ఎన్టీఆర్ కోసం రోహిత్ స్పెషల్ గిఫ్ట్..!
ఈ నెల 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో ఎవరి ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు. ఒక పక్క అభిమానులు తమ హీరో బర్త్ డే సందర్భంగా ఏ సినిమా ఏ అప్ డేట్ వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఏ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ నుండి పెద్ద సర్ప్రైజ్ ఏ ఉంటుందని ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమా చేస్తున్నాడు కాబట్టి ఆ సినిమానుండి ఏదో ఒక అప్డేట్ వస్తుందని.. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోను ఒక సినిమా చేయనున్నట్టు కూడా వార్తలు వస్తుండటంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు గురించిన కూడా ప్రకటన రావొచ్చని అనుకుంటున్నారు.
బోయపాటి శ్రీను తొలి చిత్రం ‘భద్ర’కి 15 ఏళ్ళు
మాస్ ఎంటర్టైనర్స్కి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుల్లో బోయపాటి శ్రీను ఒకరు. అలాంటి బోయపాటి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భద్ర’. టైటిల్ రోల్లో మాస్ మహారాజా రవితేజ నటించగా.. అతనికి జోడిగా మీరా జాస్మిన్ దర్శనమిచ్చింది. దీపక్, ప్రకాష్‌రాజ్, మురళీమోహన్, పద్మనాభం, సునీల్, బ్రహ్మాజీ, ప్రదీప్ రావత్, ఈశ్వరీరావు, సుబ్బరాజు, సుధ, సురేఖా వాణి, ఝాన్సీ, రేవతి, జీవా ముఖ్య పాత్రలు పోషించారు.
వెంకటేష్ హిందీ చిత్రం ‘తక్దీర్వాలా’కు 25 ఏళ్ళు
తెలుగునాట అగ్ర కథానాయకుడిగా తనదైన బాణీ పలికించిన ‘విక్టరీ’ వెంకటేష్.. హిందీనాట కూడా సందడి చేశారు. తన కెరీర్ మొత్తమ్మీద రెండే రెండు హిందీ చిత్రాల్లో వెంకీ నటించారు. అందులో ఒకటి ‘అనారీ’కాగా.. రెండోది ‘తక్దీర్వాలా’. ఈ రెండు కూడా రీమేక్ సినిమాలు కావడం విశేషం. తెలుగునాట ఘనవిజయం సాధించిన ‘చంటి’కి రీమేక్ గా ‘అనారి’ రూపొందితే.. మరో సెన్సేషనల్ మూవీ ‘యమలీల’ ఆధారంగా ‘తక్దీర్వాలా’ తెరకెక్కింది.
'క్రాక్' అప్ డేట్ త్వరలోనే - కష్టపడి పనిచేస్తున్నాం..!
మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'క్రాక్' సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. డాన్ శ్రీను, బలుపు తర్వాత వీరిద్దరి కలయికలో రాబోతున్న మూడవ సినిమా కాబట్టి ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయినట్టే. మరో 10రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉందని ఇటీవలే తెలియచేసాడు డైరెక్టర్ గోపిచంద్ మలినేని. కరోనా వల్ల ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా ఇంకా రిలీజ్ కాలేదు.
'జీవితం తలకిందులైపోయింది' అందుకే ఇలా..!
మొత్తానికి కరోనా వైరస్ ఒక్కసారిగా ప్రపంచాన్ని వణికించేసింది. దెబ్బకు అందరూ ఇంటి నుండి బయటకు రావడానికి భయపడేలా చేసింది. కనీసం ఒకరినొకరు పలకరించుకునే ఉరుకుల పరుగుల జీవితం.. కుటుంబ సభ్యులతో కూడా సరిగా మాట్లాడలేనంత బిజీ..ఈ కరోనా వల్ల అందరూ ఇళ్లకే పరిమిత మయ్యారు. అందరికీ తమ కుటుంబాలతో కాస్త టైం స్పెండ్ చేసే అవకాశం దక్కింది. ముఖ్యంగా సెలెబ్రిటీస్ కు ఇది బాగా కలిసొచ్చింది. వాళ్ళది మరీ బిజీ లైఫ్ కదా.
ఫైనల్లీ బాయ్ ఫ్రెండ్ పేరు బయటపెట్టిన తాప్సీ..!
నటీనటులు తమ ప్రేమ గురించి మీడియా కంట పడకుండా.. వార్తల్లో రాకుండా ఉండటానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ పబ్లిక్ పర్సనాలిటీస్ కాబట్టి ఎంత దాచిన ఏదో ఒకరకంగా వార్తలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ వార్తలు వచ్చినా ఎక్కడా నోరు మాత్రం విప్పకుండా తమ పని తాము చేసుకుంటారు. కొంతమంది మాత్రం ఓపెన్ గానే రిలేషన్ లో ఉన్నామని చెప్తారనుకోండి. కాకపోతే ఎక్కువ మంది సెలబ్రిటీస్ మాత్రం సీక్రెట్ నే మెయిన్ టైన్ చేస్తుంటారు.
పెట్ డాగ్స్ తో ప్రిన్స్..అదిరిపోయిన యంగ్ లుక్..!
టాలీవుడ్ ప్రిన్స్, రాజకుమారుడు అంటే వెంటనే గుర్తొచ్చేది సూపర్ స్టార్ మహేష్ బాబు. వయసు పెరుగుతున్న కొద్దీ మహేష్ అందం పెరుగుతుంది కానీ ఏ మాత్రం తగ్గట్లేదు. కాలేజ్ స్టూడెంట్ గెటప్ కూడా ఆయన ఇంకా సెట్ అవుతాడని మహర్షి సినిమాలో చేసి చూపించారు. ఇక ఇప్పుడు మహేష్ లుక్ ను చూసిన వారెవరైనా టాలీవుడ్ హీరోనా.. హాలీవుడ్ హీరోనా అన్న డౌట్ రాకుండా మారదు.
వరుణ్ తేజ్ ఆసక్తికర ట్వీట్
"ముకుంద " మూవీ తో వరుణ్ తేజ్ టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయ్యారు. వరుణ్ హీరోగా నటించిన వార్ ఫిల్మ్ "కంచె " మూవీ బెస్ట్ ఫిల్మ్ గా నేషనల్ అవార్డ్ అందుకుంది. "ఫిదా ", "తొలిప్రేమ ", "F 2", "గద్దలకొండ గణేష్" వంటి సూపర్ హిట్ మూవీస్ తో వరుణ్ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు. వరుణ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా #VT 10 మూవీ లో నటిస్తున్నారు.
"RED " మూవీ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ పోతినేని హీరో గా యాక్షన్ థ్రిల్లర్ "RED " మూవీ రూపొందింది. నివేత పేతురాజ్, మాళవిక శర్మ, అమృత అయ్యర్ కథానాయికలు. సంపత్ రాజ్, వెన్నెల కిషోర్, నాజర్, పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సూపర్ హిట్ తమిళ మూవీ "తడమ్" మూవీ తెలుగు రీమేక్ గా రూపొందిన ఈ మూవీ కి మణిశర్మ సంగీతం అందించారు.
"ఇట్స్ టైమ్ టు పార్టీ " మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్
సూపర్ హిట్ "జులాయి" మూవీ లో సపోర్టింగ్ రోల్ లో నటించి శ్రీముఖి సినీ కెరీర్ ప్రారంభించారు. "ప్రేమ ఇష్క్ కాదల్", "ధనలక్ష్మి తలుపు తడితే " వంటి మూవీస్ లో హీరోయిన్ గా నటించారు. "ఆంధ్రా పోరి" , "నేను శైలజ", "జంటిల్ మేన్", "మనలో ఒక్కడు", "సావిత్రి", "బాబు బాగా బిజీ" మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో శ్రీముఖి నటించారు.
బాలీవుడ్ లోకి అనసూయ..!
బుల్లితెరపై టాప్ యాంకర్ లు ఎవరంటే ఆ లిస్ట్ లో యాంకర్ అనసూయ పేరు ఖచ్చితంగా ఉంటది. విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న యాంకర్స్ లో అనసూయ ఒకరు. ఇక బుల్లితెర పైనే కాదు వెండితెరపై కూడా అనసూయకు లక్ బాగానే కలిసొచ్చింది. క్షణం సినిమాలో విభిన్నమైన పాత్రలో నటించి మెప్పించిన అనసూయ.. ఆతర్వాత వచ్చిన రంగస్థలంలోని రంగమత్త పాత్ర మాత్రం సినీ కెరీర్ టర్నింగ్ పాయింట్ అయింది. రంగమ్మత్త క్యారెక్టర్ తో అనసూయ బదులు రంగమ్మత్త అని పిలుచుకునేంత బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో అనసూయకు అవకాశాలు దక్కుతున్నాయి. ఇక సినిమాల్లో అవకాశాలు వస్తున్నా, ఆమె బుల్లితెరను వదిలేయకుండా కెరియర్ ను చక్కగా…
'దిల్ రాజు' పెళ్లి ఫొటోలు విడుదల..!
టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు రెండో వివాహం నిన్న రాత్రి జరిగిన సంగతి తెలిసిందే. నిన్న ఉదయం తన రెండో పెళ్లి విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించిన దిల్ రాజు.. లాక్ డౌన్ నేపథ్యంలో నిజామాబాద్ లోని తన స్వగ్రామంలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో నిరాడంబరంగా కేవలం తన కుటుంబ సభ్యులు.. కొద్దిపాటి బంధువుల సమక్షంలో ఈ పెళ్లి చేసుకున్నారు. తమ కుటుంబంతో పరిచయమున్న యువతినే దిల్ రాజు వివాహమాడినట్టు తెలుస్తుంది. ఆమె ఎయిర్ హోస్టెస్ అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కాగా ఇక దిల్ రాజు పెళ్లి ఫోటోలు బయటకి వచ్చాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.