సోష‌ల్ మీడియాలో సాయితేజ్ హ‌వా

Prati Roju Pandaage Actor Sai Tej Creates Buzz On Social Media

ప్ర‌స్తుతం ఎక్క‌డ చూసినా సోషల్ మీడియాదే హ‌వా. అందుకే నిన్నటి తరం అగ్ర కథానాయకుల నుంచి నేటి తరం యువ కథానాయకుల వరకు అంతా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. తమ తమ సినిమాల అప్‌డేట్స్‌తో పాటు.. వ్యక్తిగత, సామాజిక అంశాలతో కూడా తమ అభిమానులను అలరిస్తూ ఫాలోవర్స్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్ర‌మంలోనే.. రెండు వేర్వేరు సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో ఫాలోవ‌ర్స్ పరంగా రెండు ల్యాండ్ మార్క్స్‌ను అందుకున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివరాల్లోకి వెళితే.. గ‌త కొంతకాలంగా ‘ఇన్‌స్టాగ్రామ్‌’, ‘ట్విట్టర్’ల్లో యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న సాయితేజ్ ఖాతాలో తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్ ఫాలోవర్స్‌, ట్విట్టర్‌లో 2 మిలియన్ ఫాలోవర్స్ తోడ‌య్యారు.

ఇదిలా ఉంటే.. సాయి తేజ్, డెబ్యూ డైరెక్టర్ సుబ్బు కాంబినేషన్‌లో రూపొందుతున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ అనంతరం ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తోంది యూనిట్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.