‘రానా’ ప్రేయసి వివరాలు – ‘మిహిక బజాజ్’ హైద్రాబాదీనే ..!

Bahubali Actor Rana Daggubati Fiancee Miheeka Bajaj Is A Hyderabadi
Bahubali Actor Rana Daggubati Fiancee Miheeka Bajaj Is A Hyderabadi

మొత్తానికి ఇన్నేళ్లకు రానా తన ప్రేమను బహిరంగంగా ప్రకటించాడు. నిన్న సోషల్ మీడియా వేదికగా తన లవ్ సంగతి బయట పెట్టగా మొదట అందరూ షాక్ తిన్నా ఆ తర్వాత అభినందనలు తెలిపారు. సోషల్ మీడియాలో అయితే ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయింది. అంతేకాదు పలువురు సినీ ప్రముఖులు కూడా రానా కు అభినందనలు తెలుపగా పలువురు హీరోలు మాత్రం కామెడీగా స్పందిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే జరగనుంది. దీనిపై రానా తండ్రి సురేష్ బాబు కూడా క్లారిటీ ఇచ్చారు. డిసెంబర్ లో పెళ్లి ఉంటుందని.. అంతకంటే ముందు అయినా అవ్వచ్చని తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇక్కడి వరకూ బానే వున్నా రానా అంటే మనకు తెలుసు లెజెండ్ సినీ నిర్మాత రామానాయుడు మనవడు.. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కొడుకు అని. ఇంకా లీడర్ సినిమాతో కెరీర్ ను ప్రారంభించి తక్కువ టైం లోనే టాలెంటెడ్ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు రానా ను పడేసిన మిహిక బజాజ్ పై ఇప్పుడు గూగుల్ లో సెర్చ్ మొదలైంది. టాలీవుడ్, బాలీవుడ్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో పనిచేసిన రానాను పడేసిన మిహిక బజాజ్ ఎవరబ్బా.? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటబ్బా..? అని వెతకడం మొదలుపెట్టారు అప్పుడే.

ఆ వివరాల ప్రకారం మిహిక పక్కా హైదరాబాదీ అని తెలుస్తుంది. ముంబైలోని రచన సంసద్ నుంచి ఇంటీరియర్ డిజైనింగ్ లో డిప్లొమా అందుకుంది. లండన్ లోని చెల్సియా యూనివర్సిటీలో ఆర్ట్ అండ్ డిజైనింగ్ లో ఎంఏ చేసింది. ఇలా ఇంటీరియర్‌ డిజైనింగ్‌ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ముంబైలో డ్యూ డ్రాప్ డిజైన్ స్టూడియో పేరిట ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్, డెకరేషన్ సంస్థను నడుపుతోంది. అంతేకాదు మిహిక కు బాలీవుడ్ తో కూడా మంచి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుంది. సోనమ్ కపూర్ ఫ్యామిలీతో కూడా వీరి కుటుంబానికి సాన్నిహిత్యం ఉంది.

 

View this post on Instagram

 

for @tulipmag interview. #miheekabajaj #miheeka #ranadaggubati #rana #tollywood

A post shared by Miheeka Bajaj (@miheekabajaj7) on


మిహీక తల్లిదండ్రులు విషయానికి వస్తే తండ్రి పేరు సురేష్‌ బజాజ్‌, తల్లి బంటీ బజాజ్‌. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్. ఆమె తల్లి హైదరాబాద్‌లోనే క్రస్లా బ్రాండ్‌ పేరిట జ్యూవెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నారు. మిహీకకు ఓ సోదరుడు కూడా ఉన్నాడు.. అతని పేరు సమర్థ్‌. అతనికి ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ కునాల్ రావల్ సోదరి సాషా రావల్ తో వివాహం జరిగింది.

 

మరి గూగుల్ ద్వారా ఆమె వివరాలు తెలిసాయి కానీ అసలు వీరి ప్రేమ ఎప్పుడు..? ఎక్కడ మొదలైంది అన్న విషయాలు మాత్రం వారిద్దరూ చెబితేనే తెలుస్తుంది. మరి అప్పటివరకూ వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 + 9 =