కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Tollywood News

ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 165

సినిమా వార్తలు

కరెంట్ బిల్ పై సందీప్ కిషన్ కామెడీ..!

ఈ లాక్ డౌన్ టైంలో సెలబ్రిటీస్ కు షాకిస్తున్న మరో అంశం ఏంటంటే కరెంట్ బిల్. ఊహించని రీతిలో వస్తున్న ఈ కరెంటు బిల్ కు షాకవుతున్నారు. ఇప్పటికే.. ఇప్పటికే కార్తీక, తాప్సీ, శ్రద్దదాస్ ఇలా చాలామంది తమకు వచ్చిన కరెంట్ బిల్ చూసి షాక్ తో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఈ లిస్ట్ లో టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ కూడా చేరిపోయాడు. ఇక ఇదే విషయాన్ని తన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కాస్త కామెడీ చేశాడు. `ఇంటి దగ్గర కరెంట్ మీటర్ చూస్తుంటే చిన్నప్పటి ఆటో రిక్షా మీటర్ గుర్తొస్తోంది. ఏంది సార్ ఆ బిల్లు. ఎవరి ఇంటికి ఎక్కువ బిల్లు వచ్చిందని ఆన్‌లైన్లో వార్ ప్రారంభమైనా ఆశ్చర్యం లేదు. ఈ బిల్లులను చూస్తుంటే…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఈవారం 'ఎమోషనల్‌ ఇంటలిజెన్స్' కే.. !

కరోనా వల్ల ఒక రకంగా హీరో హీరోయిన్స్ కు షూటింగ్స్ లో పాల్గొనే పని లేకుండా పోయిందేమో కానీ.. మరోరకంగా మాత్రం లాక్‌డౌన్ సమయాన్ని సెలబ్రిటీలు బాగా వాడుకుంటున్నారు. నచ్చిన పనులు చేయడం, పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం, కొత్త ఇష్టమైన పనులు నేర్చుకోవడం వంటివన్నీ చేసేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ పాత జ్ఞాపకం

యాక్ట్రెస్ , సింగర్ , మ్యూజిక్ డైరెక్టర్ శృతి హాసన్ తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా వుంది కొత్త కొత్త ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. శృతి ఇప్పుడు 2018 సంవత్సరం నాటి తన బ్లాక్ &వైట్ ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటో అభిమానులతో పాటు ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'బంగారు బుల్లోడు' టీజర్ రిలీజ్..!

ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు డబల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే అల్లరి నరేష్ నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో నరేష్ ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడని మాత్రం అర్ధమవుతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

"రౌద్రం రణం రుధిరం " మూవీ అప్ డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో "రౌద్రం రణం రుధిరం " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా కథానాయికలు కాగా , బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోయింది. డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న "RRR" మూవీ కి కీరవాణి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మోహన్ లాల్ హీరోగా "బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్ " మూవీ ?

4 దశాబ్దాలుగా పలుసూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. "మనమంతా ", "జనతా గ్యారేజ్ " తెలుగు మూవీస్ లో నటించారు. యాక్టర్ , సింగర్, ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మోహన్ లాల్ "పద్మశ్రీ ", "పద్మభూషణ్ "వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. హీరో మోహన్ లాల్ ప్రస్తుతం "మరక్కార్ ", "దృశ్యం 2", "రామ్ " మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

‘సూర్యవంశీ’, ‘83’ సినిమాల రిలీజ్ డేట్స్ ఫిక్స్..!

లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా థియేటర్స్ అన్నీ మూతపడిన సంగతి తెలిసిందే. రిలీజ్ కావాల్సిన ఎన్నో సినిమాలు ఆగిపోయాయి. ఇక ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో రెండు భారీ చిత్రాలు ‘సూర్యవంశీ’, ‘83’ సినిమాలు కూడా రిలీజ్ కు నోచుకోలేదు. రోహిత్ శెట్టి దర్శకత్వంలో అక్ష‌య్‌కుమార్‌, క‌త్రినా కైఫ్‌, గుల్ష‌న్ గ్రోవ‌ర్ ప్రధాన పాత్రల్లో న‌టించిన సినిమా ‘సూర్య‌వంశీ’. మార్చి 27న విడుద‌ల కావాల్సిన ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డింది. అలాగే కపిల్ దేవ్ జీవితం ఆధారంగా క‌బీర్‌ఖాన్ దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘83’. ఏప్రిల్ 10న విడుద‌ల కావాల్సిన ఈ సినిమా కూడా వాయిదా ప‌డింది. 1983లో క్రికెట్‌లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'హిరణ్య కశ్యప' - అందుకే బడ్జెట్ విషయంలో రాజీ లేదు..!

రానా దగ్గబాటి, గుణశేఖర్ కాంబినేషన్ లో “హిరణ్య కశ్యప” అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ మధ్య ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు కూడా వచ్చాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో.. మరోపక్క కరోనా ప్రభావం వల్ల ఇప్పుడు భారీ బడ్జెట్ పెట్టే అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇప్పుడు తీసే ఉద్దేశం లేదంటూ వార్తలు వచ్చాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదంటూ అప్పుడే క్లారిటీ కూడా ఇచ్చేసారు. ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తయ్యాయి. ప్రస్తుతం రానా వేరే సినిమాలతో బిజీగాఉన్నాడు అవి అయిపోయిన వెంటనే ఈ సినిమాను పట్టాలెక్కిస్తామని అన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తమన్నా లాక్ డౌన్ వ్యాయామం

15 సంవత్సరాలుగా తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో తమన్నా ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే . పలు సూపర్ హిట్ మూవీస్ లో హీరోయిన్ గా నటించిన తమన్నా "అల్లుడు శీను ", "జాగ్వార్ ", జై లవకుశ", "KGF చాప్టర్ 1", "సరిలేరు నీకెవ్వరు " వంటి మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ లో నటించి ప్రేక్షకులను అలరించారు. "100%లవ్ ", "తడాఖా ", "బాహుబలి " , "కెమెరా మెన్ గంగతో రాంబాబు" మూవీస్ కు బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. తమన్నా ప్రస్తుతం "సీటీ మార్ ", "బోలే చూడియన్ "(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Regina Cassandra Says No To Intimate Scenes
సినిమా వార్తలు

ఇంటిమేట్ సీన్స్ కు "నో" - రెజీనా

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి రెజీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ మూవీ "ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా " తో రెజీనా బాలీవుడ్ లో ప్రవేశించారు. రీసెంట్ గా సూపర్ హిట్ "ఎవరు " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన రెజీనా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. చిరంజీవిహీరోగా రూపొందుతున్న "ఆచార్య "మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కరోనా కారణం గా సుమారు 3నెలలపాటు షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సూపర్ స్టార్ లేకుండానే షూటింగ్..!

అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ శివతో రజనీ ‘అన్నాత్తె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల ఇన్ని షూట్ కు బ్రేక్ పడింది. అయితే తమిళ్ నాడు ప్రభుత్వం కూడా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిన్నగా అందరూ షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రజినీ ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Allari Naresh's Naandhi Teaser looks interesting
ట్రైలర్ & టీజర్

ఆసక్తి రేపుతున్న 'నాంది' టీజర్..!

కామెడీ హీరోగా వరుస విజయాలు సాధించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఈ మధ్య కాస్త వెనకపడ్డాడు. అయితే ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ 'నాంది' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై స‌తీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్త‌యింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ సినిమాలోనా.. చాలా మంది ఫోన్ చేస్తున్నారు..!

పరుశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమాను ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించనున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఒకప్పటి హీరోయిన్, పవన్ కళ్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ చేస్తున్నారంటూ గత రెండు రోజులుగా వార్తలు వస్తున్న సంగతి కూడా తెలిసిందే. దీంతో ఈ విషయమై తాజాగా రేణు దేశాయ్ స్పందించి ఆమె క్లారిటీ ఇచ్చారు. అందులో ఎలాంటి వాస్తవం లేదని అన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.. అలర్ట్ చేస్తుంది..!

లాక్ డౌన్ నుండి ఎప్పుడైతే సడలింపులు చేశారో... అప్పటినుండి రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. దీనితో ఎవరికి వాళ్ళు జాగ్రతలు తీసుకోవడం తప్ప మరో మార్గం లేదు. ఇక ఇప్పటికే ఎంతో మంది దీనిపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ఎన్నో సూచనలు చేశారు. ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మరోసారి పలు సూచనలు చేశారు. నిజానికి కరోనా ప్రారంభమైనప్పటి నుండి సోషల్ మీడియా ద్వారా పలు జాగ్రత్తలు, సూచనలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మాస్క్‌లు ధరిస్తూ, వీలైనంతగా భౌతిక దూరం పాటించాలని ఇప్పటికే ఎన్నో వీడియోలలో ఆయన చెప్పి ఉన్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ‌శి' డబ్బింగ్ పనులు మొదలు పెట్టిన ఆది

శ్రీ‌నివాస్ నాయుడు న‌డిక‌ట్ల దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా న‌టిస్తోన్న సినిమా 'శ‌శి'. ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు వచ్చింది. ఒక పాట మిన‌హా సినిమా షూటింగ్ అంతా పూర్త‌యింది. ఆ పాట‌ను కూడా మూడు రోజుల్లో పూర్తి చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శృతి హాసన్ అండర్ వాటర్ ఫొటో షూట్

తెలుగు , తమిళ భాషలలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న శృతి హాసన్ సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉన్న విషయం తెలిసిందే. ఇన్ స్టా గ్రామ్ లో 14 మిలియన్ కు పైగా ఫాలోవర్స్ ఉన్న శృతి హాసన్ కొత్త కొత్త ఫొటోస్ తో అభిమానులను ఇంప్రెస్ చేస్తున్నారు. శృతి ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న "కాక్ ", విజయ్ సేతుపతి హీరోగా రూపొందుతున్న "లాభం " తమిళ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ కు కర్ణాటక డిప్యూటీ సిఎమ్ ప్రశంసలు

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో కోలీవుడ్ లో అజిత్ కుమార్ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హీరో అజిత్ ప్రస్తుతం "వాలిమై " మూవీ లో నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ కారణంగా ఆ మూవీ షూటింగ్ నిలిచిపోయింది. మద్రాస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డ్రోన్ టీమ్ "దక్ష" కు అజిత్ సలహాదారు గా ఉన్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి నివారణకు దక్ష టీమ్ డ్రోన్స్ ద్వారా పలు ప్రాంతాలను క్రిమి సంహారక మందు ను స్ప్రే చేస్తూ శానిటైజ్ చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ప్రస్తుతం చదువుకుంటున్నాడు.. ఇంకా టైం ఉంది..!

తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి గుర్తింపు రావడంలో దగ్గుపాటి ఫ్యామిలీ పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దివంగత లెజెండరీ నిర్మాత రామానాయుడు ఎన్నో క్లాసిక్ సినిమాలను నిర్మించారు. ఇండియన్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయో అన్నిభాషల్లో సినిమా తీసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక కొడుకులు వెంకటేష్ అగ్ర హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా.. సురేష్ బాబు టాప్ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక ఈ జెనరేషన్ నుండి వచ్చిన హీరో రానా కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ కాంపౌండ్ నుండి మరో హీరో రానున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రాబోయే హీరో ఎవరో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టాలీవుడ్ ఆఫర్స్ తో సంతోషంగా ఉన్నా - నవీన్ చంద్ర

సక్సెస్ ఫుల్ "అందాల రాక్షసి " మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన నవీన్ చంద్ర హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ప్రతి నాయకుడిగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తమిళ మూవీస్ లో కూడా నటిస్తున్న నవీన్ చంద్ర ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రతిభావంతుడిగా పేరు పొందారు. "దళం", "దేవదాస్ ", "అరవింద సమేత వీర రాఘవ ", "ఎవరు " మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి నవీన్ గుర్తింపు పొందారు. నవీన్ ప్రస్తుతం "భానుమతి రామకృష్ణ "మూవీ లో హీరోగా నటించారు. "మిస్ ఇండియా ", విరాటపర్వం ", బాక్సర్ , "మోసగాళ్ళు " మూవీస్ లో నవీన్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

దిల్ రాజు గారి సలహా వల్ల నా కెరీర్ మారిపోయింది..!

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో నవీన్ చంద్ర. ఆ సినిమాలో నవీన్ చంద్ర నటనకు ప్రశంసలు దక్కడమే కాదు.. ఇండస్ట్రీకి ఒక మంచి నటుడు దొరికాడనుకున్నారు అందరూ. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలేవీ నవీన్ చంద్రకు పెద్దగా కలిసిరాలేదు. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన 'అరవింద సమేత' సినిమాతో ఈ సారి విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమాలో దర్శకుడు త్రివిక్రమ్ బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం తర్వాత మళ్లీ బిజీ అయ్యాడు. ప్రస్తుతం ఇక పక్క హీరో గా…

TFN Adminవాట్సాప్

షేర్