కామెడీ హీరోగా వరుస విజయాలు సాధించిన అల్లరి నరేష్ ఆ తర్వాత ఈ మధ్య కాస్త వెనకపడ్డాడు. అయితే ఇప్పుడు మరో విభిన్నమైన కథతో వస్తున్నాడు. విజయ్ కనకమేడల దర్శకత్వంలో నరేష్ ‘నాంది’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌వీ 2 ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సతీష్ వేగేశ్న నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. లాక్ డౌన్ ముందే 80 శాతం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే మిగిలిన షూట్ కూడా పూర్తి చేసే ప్లాన్ లో వున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈరోజు అల్లరి నరేష్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ను రిలీజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. చిత్రయూనిట్ కు నా అభినందనలు తెలుపుతున్నాను.. టీజర్ చాలా బాగుంది అంటూ విజయ్ ట్వీట్ లో పేర్కొన్నాడు. ఇక టీజర్ మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది. చివర్లో ఒక మనిషి పుట్టడానికి కూడా తొమ్మిది నెలల టైం పడుతుంది.. మరి నాకు న్యాయం చెప్పడానికి ఏంటి సర్ ఇన్ని సంవత్సరాలు పడుతుంది అన్న డైలాగ్ బాగుంది.
#Naandhi https://t.co/7XwW2gWqOE
Very happy to share this teaser with the world. Wishing my best to the entire team. Looks fantastic @allarinaresh Anna 👍🏼
Happy birthday Anna 🙂
— Vijay Deverakonda (@TheDeverakonda) June 30, 2020
ఇంకా ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, హరీష్ ఉత్తమన్, ప్రవీణ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో పాటు నరేష్ మరో సినిమా `బంగారు బుల్లోడు`గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పీవీ గిరి తెరకెక్కించిన ఈ సినిమాను ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర నిర్మించారు. అల్లరి నరేష్ సరసన పూజా జవేరి హీరోయిన్‌గా నటించగా… ఈ సినిమా టీజర్ ను కూడా సాయంత్రం 4.05 గంటలకువిడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: