అజిత్‌తో వరుసగా బ్లాక్ బస్టర్లు ఇచ్చిన మాస్ డైరెక్టర్ శివతో రజనీ ‘అన్నాత్తె’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా షూటింగ్ దశలో ఉండగా కరోనా వల్ల ఇన్ని షూట్ కు బ్రేక్ పడింది. అయితే తమిళ్ నాడు ప్రభుత్వం కూడా షూటింగ్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిన్నగా అందరూ షూటింగ్ లను మొదలుపెడుతున్నారు. ఈ నేపథ్యంలో.. రజినీ ‘అన్నాత్తె’ సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించాలన్న ఆలోచనలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే తాజా సమాచారం ప్రకారం రజినీ మాత్రం షూట్ లో పాల్గొనరట. రజినీతో ఉన్న సన్నివేశాలను మినహాయించి ఇతర సన్నివేశాలను ముందు చిత్రీకరించి తర్వాత రజినీతో షూట్ ను కంప్లీట్ చేయనున్నారట.
కాగా ఇంకా ఈ సినిమాలో రజినీతో కలిసి మీనా, నయనతార, ఖుష్బూ సుందర్, కీర్తి సురేష్ నటించనున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. వచ్చే ఏడాది 2021 పొంగల్ లో ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ అది కూడా వాయిదా పడేట్టు ఉంది.
ఇదిలా ఉండగా కబాలి, కాలా, పేట్టా, దర్బార్ ఇలా వరుసగా సినిమాలు చేసుకుంటూ యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ దూసుకుపోతున్నాడు. ఈ సినిమా తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీ తన 169వ చిత్రాన్ని చేయనున్నాడు. ఆ తర్వాత రాఘవ లారెన్స్ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: