ప్రస్తుతం చదువుకుంటున్నాడు.. ఇంకా టైం ఉంది..!

Tollywood Ace Producer Suresh Babu Updates About The Official Movie Debut Of His Younger Son Abhiram

తెలుగు చిత్ర పరిశ్రమకు మంచి గుర్తింపు రావడంలో దగ్గుపాటి ఫ్యామిలీ పాత్ర కూడా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. దివంగత లెజెండరీ నిర్మాత రామానాయుడు ఎన్నో క్లాసిక్ సినిమాలను నిర్మించారు. ఇండియన్ లాంగ్వేజ్ ఎన్ని ఉన్నాయో అన్నిభాషల్లో సినిమా తీసి రికార్డు క్రియేట్ చేశారు. ఇక కొడుకులు వెంకటేష్ అగ్ర హీరోల్లో ఒకడిగా మంచి గుర్తింపు తెచ్చుకోగా.. సురేష్ బాబు టాప్ నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇక ఈ జెనరేషన్ నుండి వచ్చిన హీరో రానా కూడా వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ కాంపౌండ్ నుండి మరో హీరో రానున్నట్టు ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ రాబోయే హీరో ఎవరో కాదు సురేష్ చిన్న తనయుడు అభిరామ్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇటీవలే తన ఎంట్రీ పైన అభిరామ్ కూడా క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తన తాత జయంతి రోజున అభిరామ్ మాట్లాడుతూ.. ఉదయం లేచింది మొదలు నాకు ఆయనతోనే రోజు మొదలయ్యేది. చిన్నప్పటి నుంచి ఆయనతో పాటు షూటింగ్‌లకు వెళ్లేవాడిని. నన్ను హీరోగా చూడాలన్నది తాతగారి కోరిక. ఆయన ఉండి ఉంటే నన్ను హీరోని చేసేవారు. ఇప్పుడు మా డాడీ సురేష్ బాబు ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. హీరోగా రావాలన్న నా కోరిక తీరనుంది. ఈ ఏడాది లేదంటే.. వచ్చే ఏడాదైనా మంచి లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రావొచ్చన్నాడు.

ఇక ఈ విషయం తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సురేష్ బాబు కూడా అభిరామ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ఇప్పటివరకైతే ఎలాంటి ప్లాన్స్ లేవు.. ప్రస్తుతం తాను చదువుకుంటున్నాడు.. చదువుకోనివ్వండి.. అయితే మా ఫ్యామిలీలో పిల్లలు వాళ్ళు ఏం చేయాలో వాళ్లే నిర్ణయం తీసుకుంటారు.. తను నిజంగా సినిమాల్లోకి రావాలని డిసైడ్ అయితే అదే చేస్తాడు.. దానికి ఇంకా టైం ఉంది అని చెప్పుకొచ్చాడు. మరి చూద్దాం అభిరామ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది…

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =