తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించి రెజీనా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సక్సెస్ ఫుల్ మూవీ “ఏక్ లడకీ కో దేఖాతో ఐసా లగా ” తో రెజీనా బాలీవుడ్ లో ప్రవేశించారు. రీసెంట్ గా సూపర్ హిట్ “ఎవరు ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన రెజీనా ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. చిరంజీవిహీరోగా రూపొందుతున్న “ఆచార్య “మూవీ లో రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. కరోనా కారణం గా సుమారు 3నెలలపాటు షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని షరతులతో షూటింగ్స్ అనుమతి ఇవ్వడం తో ఇప్పుడిప్పుడే షూటింగ్స్ ప్రారంభం అవుతున్నాయి. స్టార్ హీరో , హీరోయిన్స్ షూటింగ్స్ లో పాల్గొనడానికి సుముఖంగా లేరు. ఈ నేపథ్యంలో రెజీనా మూవీస్ లోని రొమాన్స్ సీన్స్ పై తన అభిప్రాయాన్ని తెలిపారు. తాను భవిష్యత్ లో నటించే మూవీస్ లో ఇంటిమేట్ సీన్స్ చేయనని , లిప్ లాక్స్ , హగ్స్ , రొమాన్స్ సీన్స్ లో నటించాలంటే భయంగా ఉందని చెప్పారు. సాధ్యమైనంత వరకు ఫిజికల్ డిస్టెన్స్ పాటించేందుకు నటీ నటులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: