‘బంగారు బుల్లోడు’ టీజర్ రిలీజ్..! 

Tollywood Actor Allari Naresh New Movie Bangaru Bullodu Teaser Is Out

ఈ రోజు అల్లరి నరేష్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు డబల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే అల్లరి నరేష్ నాంది సినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సస్పెన్స్ థ్రిల్లర్ కథకు ఎమోషనల్ అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే అల్లరి నరేష్.. సినిమా కోసం బాగానే కష్టపడినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమాతో నరేష్ ఖచ్చితంగా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటాడని మాత్రం అర్ధమవుతుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ప్రియదర్శి, హరిశ్‌ ఉత్తమన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా నరేష్ బంగారు బుల్లోడు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈటీజర్ ను చూస్తుంటే ఎప్పటిలాగే మరోసారి కామెడీ ఎంటర్ టైనర్ తోనే వస్తున్నట్టు తెలుస్తుంది. న‌గ‌ల్ని తాక‌ట్టు పెట్టుకుని అప్పులిచ్చే ఓ బ్యాంకులో ప‌నిచేస్తుంటాడు న‌రేష్‌. అయితే ఆ న‌గ‌ల‌తో వ‌చ్చే చిక్కులే ఈ బంగారు బుల్లోడు క‌థ‌. గతంలో నరేష్ సినిమాల్లో ఎలాగైతే కామెడీ, పంచ్‌లూ వుంటాయో అలానే ఈ టీజర్ లో వున్నాయి. గిరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి, పృథ్వీ, ప్రవీణ్‌, సత్యం రాజేశ్‌, ప్రభాస్‌ శ్రీను, జబర్దస్త్‌ మహేశ్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్‌ సంగీతమందిస్తున్నాడు. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కూడా రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =