4 దశాబ్దాలుగా పలుసూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ మోహన్ లాల్ మలయాళ సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. “మనమంతా “, “జనతా గ్యారేజ్ ” తెలుగు మూవీస్ లో నటించారు. యాక్టర్ , సింగర్, ప్రొడ్యూసర్ , డిస్ట్రిబ్యూటర్ మోహన్ లాల్ “పద్మశ్రీ “, “పద్మభూషణ్ “వంటి అత్యున్నత పురస్కారాలు అందుకున్నారు. హీరో మోహన్ లాల్ ప్రస్తుతం “మరక్కార్ “, “దృశ్యం 2”, “రామ్ ” మలయాళ మూవీస్ లో నటిస్తున్నారు. ఇప్పుడు మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారత్ , చైనా సరిహద్దు గాల్వన్ లోయలో సైనికుల మధ్య ఘర్షణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ ఘటనలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా కు వ్యతిరేక పోరులో ప్రధాని మోదీ కి ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఈ సంఘటన నేపథ్యంలో ప్రముఖ నటుడు , దర్శకుడు మేజర్ రవి దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా “బ్రిడ్జ్ ఆఫ్ గాల్వన్ ” మలయాళ మూవీ రూపొందనుందని సమాచారం. దర్శకుడు మేజర్ రవి ఇంతకు ముందు భారత్ , పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో “1971 బియాండ్ బోర్డర్స్ ” మూవీ ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఆ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ “యుద్ధభూమి “మూవీ గా రిలీజ్ అయింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: